నేడు జడ్చర్ల బిఆర్ఎస్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి నామినేషన్…
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం మధ్యాహ్నం జడ్చర్ల లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకు ముందుగా ఆయన,
గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులతో, జడ్చర్ల నియోజకవర్గ ప్రజల అభిమానం, వారి దీవెనలతో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలతో ముందుగా గంగాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రానున్న ఐదేళ్లలో రైతులు, మహిళలు, పేదలు, యువకులకు మరింత మేలు చేకూరుస్తామని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలకు మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తామని, లక్ష మెజార్టీ సాధించేందుకు స్వామివారి కృపతో పాటు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని ప్రార్ధించారు.
అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో గెలుపే భరోసా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల అభిమానులు పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.