నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)
వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాత నియామకం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర వైశ్య రాజకీయ శిక్షణ కమిటీ ఉపాధ్యక్షులు తాటిపల్లి రాజన్న హర్షం ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బీద వైశ్యులకు గొప్ప వరం అన్నారు. మొదటి నుండి బీద వైశ్యుల కోసం ముందుండి పోరాటం చేసిన కల్వ సుజాతను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం బీద వైశ్య కుటుంబాలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజన్న శుక్రవారం హైదరాబాదులోని అష్టలక్ష్మి ఆలయంలో కల్వ సుజాతను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు.