బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండించిన బీఎస్పీ నేతలు ప్రజా పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులా.
ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డ
బిఎస్పి మహా ముత్తారం మండల అధ్యక్షులు రామగిరి రాజు.
మహా ముత్తారం నేటి ధాత్రి.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా జన్వాడలో దాడికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బుధవారం పోలీసులు ఆయనను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్ను జన్వాడ వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేయడంపై బీఎస్పీ శ్రేణులు భగ్గుమన్నారు. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా.. బాధితులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రజాల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ
బీఎస్పీ నాయకులు మండిపడుతున్నారు. బాధిత కుటుంబాలకు అండగా బీఎస్పీ ఉంటుంది అని ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి వైఖరి మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని మరింత విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.