
PMJ Jewellers Grand Relaunch in Tirupati
*ఆకర్షణీయమైన డిజైన్లతో… తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్..
*మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ చేతులమీదుగా ప్రారంభం..
• నయా స్టోర్‌లో 9 రోజుల పాటు వివాహ, హాఫ్-సారీ ఆభరణాల అతిపెద్ద ఎగ్జిబిషన్‌ను కూడా నిర్హహణ..
తిరుపతి(నేటి ధాత్రి) సెప్టెంబర్ 27
దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, తిరుపతిలోని తమ కొత్త స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించింది.ఈ సందర్భంగా, బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు బిగ్గెస్ట్ వెడ్డింగ్ & హాఫ్-సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్” నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై స్టోర్‌ను ప్రారంభించారు.ఈ వేడుకలో పీఎంజే జ్యువెలర్స్, క్లస్టర్ మేనేజర్ కందకూరి అరవింద్ కుమార్,తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కొత్త స్టోర్ ప్రారంభంతో పీఎంజే జ్యువెలర్స్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలలో 40కి పైగా స్టోర్లను కలిగి ఉంది.
పీఎంజే జ్యువెలర్స్ సంస్థ తిరుపతిలో తమ కొత్త స్టోర్‌ను ప్రారంభించడం గర్వకారణంగా భావిస్తోంది. సంప్రదాయాన్ని, ఆధునికతను కలగలిపి తీర్చిదిద్దిన ఈ స్టోర్, వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది,
ఇందులో టెంపుల్ జ్యువెలరీ,పాతకాలపు బంగారు నెక్లెస్‌లు,వడ్డాణాలు, పెళ్లి కోసం ప్రత్యేకమైన జ్యువెలరీ సెట్లు,హాఫ్ సారీ, ఇతర సందర్భాలకు తగినట్లుగా డైమండ్స్,రంగుల రత్నాలతో చేసిన ఆభరణాలు ఉన్నాయి.
అంతేకాకుండా,నిత్యం ధరించేందుకు వీలుగా తేలికైన నెక్లెస్‌లు,చెవిపోగులు, ఉంగరాలు కూడా పీఎంజే జ్యువెలర్స్ తిరుపతి స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్ పీఎంజే జ్యువెలర్స్ పునఃప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా
ఆమె మాట్లాడుతూ తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్‌లో భాగం కావడం, 9 రోజుల పాటు పెళ్లి, హాఫ్-సారీ ఆభరణాల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాను.6,
దశాబ్దాలకు పైగా ఉన్న బ్రాండ్ వారసత్వంతో పీఎంజే తమ కస్టమర్ల నమ్మకాన్ని, సంప్రదాయాలను గౌరవిస్తోంది.
ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఆభరణాలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కావు, అవి కళకు అద్దం పట్టే ఆవిష్కరణలు
అని పేర్కొన్నారు.
పీఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్
క్లస్టర్ మేనేజర్ కందకూరి అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. తిరుపతి స్టోర్‌ను ఘనంగా పునఃప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రతి సందర్భంలోని అందాన్ని చాటి చెప్పేలా, పీఎంజే జ్యువెలర్స్ ఎల్లప్పుడూ అద్భుతమైన ఆభరణాలను సృష్టించడానికి కట్టుబడి ఉంది.
కొత్తగా తీర్చిదిద్దిన ఈ స్టోర్,అలాగే ఎగ్జిబిషన్ మా వినియోగదారులకు ఆభరణాల షాపింగ్‌ని మరింత అందంగా మారుస్తాయి అని అన్నారు.
పీఎంజే జ్యువెలర్స్ తిరుపతి స్టోర్ మేనేజర్ చంద్రబాబు మాట్లాడుతూ తాజా ఆభరణాలను,అద్భుతమైన డిజైన్లను బిగ్గెస్ట్ వెడ్డింగ్ అండ్ హాఫ్-సారీ జ్యువెలరీ ఎగ్జిబిషన్’లో ప్రదర్శిస్తున్నాము.పీఎంజే జ్యువెలర్స్ నైపుణ్యాన్ని, కళాత్మకతను మా విలువైన వినియోగదారులు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. మా వినియోగదారుల ప్రత్యేక క్షణాలలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది అని వివరించారు.
పీఎంజే జ్యువెలర్స్ ఎంతో కాలంగా నాణ్యత, వ్యక్తిగత సేవ, నిపుణుల సలహాల ద్వారా తమ వినియోగదారులకు ప్రత్యేకమైన, అద్భుతమైన ఆభరణాలను అందిస్తోంది. వజ్రాభరణాల వివాహ కలెక్షన్లలో ప్రత్యేకత కలిగిన పీఎంజే, వినియోగదారులకు కుటుంబ వారసత్వంగా మిగిలిపోయే అద్భుతమైన, ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేస్తుంది.
ఇవన్నీ పీఎంజే సంస్థ అందించే నాణ్యత, విలువ, ప్రత్యేకమైన డిజైన్ల హామీతో లభిస్తాయి.ఈ పెళ్లి ఆభరణాల ప్రదర్శనకు చాలామంది ప్రముఖులు, సంస్థ నమ్మకమైన కస్టమర్లు హాజరవుతారని భావిస్తున్నారు.