
Bag Day special program.
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు
రాయికల్: జూలై 19: నేటి ధాత్రి:
పట్టణం లోని విజ్డం హై స్కూల్ విద్యార్థులు మూడవ శనివారం నో బ్యాగ్ డే స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి వరి నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకొని, రైతులతో పాటు నాటు వేశారు, పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి పిల్లలతో పాటు పొలంలో దిగి నాటు వేసి, చిన్ననాటి జ్ఞాపకాలను, రైతుల యొక్క కష్టాన్ని, రైతు విలువను విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే, మనకు అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,వరి పంట చేతికి రావాలంటే 120 రోజుల శ్రమ, కష్టం ఉంటుందని, వాటిని గుర్తుంచుకుని ఆహారాన్ని వృధా చేయకుండా, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు తద్వారా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.