కాశిబుగ్గ చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం.
కాశిబుగ్గ వర్తక సంఘం
కాశిబుగ్గ నేటిధాత్రి
శుక్రవారం రోజున లక్ష్మి గణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ చౌరస్తాలో కాశిబుగ్గ వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి,19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత, భాస్కర్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు.అదేవిధంగా మజ్జిగ కూడా పంపిణీ చేయటం జరిగింది.లక్ష్మి గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి రాంప్రసాద్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఎండాకాలంలో 80 రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది. రామనాథం రఘు కిషోర్, ప్రవీణ దంపతులు ఎన్నారై వారి సహకారంతో ఫ్రిడ్జ్ ద్వారా మినరల్ చల్లని నీళ్లను ప్రజలకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా దాతల సహకారంతో 80 రోజులపాటు రోజు మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం రోజు మజ్జిగ దాతగా లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు వంగరి ప్రవీణ్ జ్ఞాపకార్థం వారి భార్య వంగరి కళ్యాణి నిర్వహించడం జరిగినది. లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గము సభ్యులు ప్రతిరోజు సేవలు అందించడం జరుగుతుందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భయ్యా స్వామి, మండల శ్రీరాములు, వడిచెర్ల సదానందం, గుళ్ళపల్లి రాజ్ కుమార్, ఓరుగంటి కొమురయ్య, మండల సురేష్,దుస్స కృష్ణ, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు మరియు లక్ష్మీగణపతి సహకార సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.