
Volleyball Tournament 2025 Kicks Off in Jharasangam
క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : పార్లమెంట్ ఇంచార్జ్ జి శుక్లవర్ధన్ రెడ్డి
◆:- మాజీ జడ్పిటిసి భాస్కర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు పొంగిపోకూడదని, ఒడిన వారు కృంగిపోకుండా ముందుకు సాగాలని పార్లమెంట్ ఇంచార్జ్ గంకటి శుక్లవర్ధన్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ మండలంలోని శేకపూర్ గ్రామంలో హజ్రత్ షేక్ శహబుద్దిన్ మెగా వాలీబాల్.4 సీజన్ 2025 ని న్యాల్కల్ మండల మాజీ జడ్పిటిసి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి తో కలిసి శుక్లవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ చష్మోద్దీన్ శాలువా పులమలతో ఘనంగా సన్మానించారు. టౌర్నిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉర్సు ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలోను టౌర్నిని నిర్వహించడం అభినందనీయం అని, వాలీబాల్ ఆట తెలివితో పాటు కొద్దిగా ధైర్యం ప్రదర్శించే వారు విజయవంతం అయ్యి ఆటలో మెరుగైన స్థాయిలో నిలిచి విజయం సాధిస్తారని అన్నారు. ఇలాంటి టౌర్నీలకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ చష్మోద్దీన్, మాజి జడ్పిటిసి కొత్తపల్లి భాస్కర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మహేబూబ్ ఖాన్, లతీఫ్ బి అజిమోద్దీన్, మొహమ్మద్ అరిఫ్ అలీ, మొయిజ్ లష్కరి, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ అమెర్, షేక్ అహేమద్, మసుల్దర్ గౌస్, మొహమ్మద్ సైఫ్, అమెర్ యఫై, జావిద్ రేగుండా, అబ్దుల్లా సిద్దిఖీ, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.