
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్లు బయ్య రాజ్యలక్ష్మి స్వామి దంపతులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ తూర్పు మీడియా ప్రతినిధులు ఆడేపు సాగర్, కందికొండ గంగరాజు, ఓంప్రకాష్, రాజేంద్రప్రసాద్, కృష్ణ తదితరులు. అమెరికా ప్రయాణం సుఖవంతం, విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఆరు నెలల పాటు వారి అమెరికా పర్యటన కొనసాగనుంది. మాజీ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ వరంగల్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బయ్య స్వామి అమెరికాకు వెళ్తున్న సందర్భంగా పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.