ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా పనిచేయాలి.
జడ్పీటీసీ . సభ్యులు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుడి వంశీధర్ రెడ్డి.
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
గత ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం కాక నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతికగా మారిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టబద్ధులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు లింగాల గణపురం జడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖమ్మం,వరంగల్, నల్లగొండ పట్టా బద్దుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రశ్నించే ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికులుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న జరగబోయే పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న విజయంకై నియోజకవర్గం లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టల వద్దకు వెళ్లి మల్లన్న గెలుపు కోసం నియోజకవర్గ పట్టబదులకు ఎంత అవసరమైన తెలియపరచాలని సూచించారు జర్నలిస్టుగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం పై అనేక పోరాటాలు చేశారని ఆయన వివరించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే పట్టబద్ధుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారు అన్నారు.