
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలువు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్. ఈసందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉండి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా సంక్షేమాన్ని మరిచి పెట్టుబడి దారి వర్గాలకు కొమ్ము కాస్తున్నారని, దేశంలోని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చేప్పి ఉద్యోగ అవకాశలు కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారని ఆరోపించారు. నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఎదుర్కొలేక అధికార దాహంతో సిబిఐ, ఇడి లాంటి దర్యాప్తు సంస్థలను గుపిట్లో పెట్టుకొని రాజకీయంగా నిర్వీర్యం చేయాడానికి కుట్ర చేస్తున్నారని, ఇదే కాకుండా మళ్ళీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సి ఎస్టీ, బిసిల రెజర్వేషన్లను మార్చడానికి చీకటి కుట్ర పన్నారని ఈపరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా అలోచించి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఇండియా కూటమి అభ్యర్థులను గెల్పించాలని, బీజేపి ఆభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశేల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, నాయకులు ఎగుర్ల మల్లేష్, కీర్తికుమార్, ముత్యం ఆంజనేయులు గౌడ్, రాజయ్య, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.