Kavitha Slams Revanth Govt
ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కవిత ధ్వజం
సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM RevanthReddy), హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మూసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.ఫేజ్- వన్‌కి సంబంధించిన డీపీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని ప్రస్తావించారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని ఆరోపించారు. ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో రూ.5,641 కోట్లు ఖర్చు అవుతుందని ఈ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు.
