బకాయిలున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దు!

rice millers scam

https://epaper.netidhatri.com/view/404/netidhathri-e-paper-15th-october-2024%09

 

`సివిల్‌ సప్లయ్‌పై సబ్‌ కమటీ సత్తా చూపిస్తుందా?

`కాలయాపనతో దాట వేస్తుందా?

`దొంగ మిల్లర్లను గుర్తించి ఏరవేయండి?

`దళారుల ముసుగులో వున్నవారిని గుర్తించి తప్పించండి.

`ఇంత కాలం దోచుకున్నదంతా కక్కించండి.

`ఏజెన్సీల పేరుతో దగా చేసిన వారిపై కేసులు నమోదు చేయండి!

`దళారుల అవతారంలో వున్న వారికి మిల్లులే లేవు!

`అసలైన మిల్లర్లకు దళారులతో సంబంధం లేదు.

`యూనియన్ల పేరుతో చెలామణీ అవుతున్న వారి బకాయిలు వసూలు చేయండి!

`దళారీ వ్యవస్థకు చరమగీతం పాడండి!

`ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిని తప్పించండి.

`వారి ప్రమేయం లేకుండానే మిల్లర్లకు నేరుగా వడ్లు ఇవ్వండి.

`డిపాజిట్లను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా బకాయిదారులే!

`డిపాజిట్లు చెల్లిస్తే తిరిగి బకాయిలకింద పోయాయని భయం!

`ఈ విషయంలో సబ్‌ కమిటీ కఠినంగా వ్యవహరించాలి.

`సివిల్‌ సప్లయ్‌పై సబ్‌ కమిటీ సత్తా చూపిస్తుందా?

`కాలయాపనతో దాట వేస్తుందా?

`నీతిగా వ్యాపారం చేసేవారినే నమ్మండని మిల్లర్ల డిమాండ్‌.

`దొంగ మిల్లర్లను నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దని అసలైన మిల్లర్ల సూచన.

`దొంగ మిల్లర్ల మూలంగా వ్యవస్థ మీద అపనమ్మకం పెరుగుతోంది.

`మిల్లర్లందరినీ సమాజం దోషులుగా చూస్తోంది.

`కొన్ని జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలో దాడులు చేయండి.

`దాడులు చేసి అధికారులు ఎందుకు మమ అనిపించడం మానుకోండి.

`మిల్లర్లపై కేసులెందుకు నమోదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు.

`ఇలా అయితే వేల కోట్లు ఎప్పుడు వసూలు చేస్తారు?

`డిపాజిట్లు చేయడానికి అసలైన మిల్లర్లు ససేమిరా అనడం లేదు.

`బకాయిలు ఎక్కడ చెల్లించాల్సి వస్తుందోనని డిపాజిట్లు వద్దంటున్నారు.

`ఫ్రీగా వడ్లు తీసుకోవడం అలవాటు చేసుకొన్న దొంగ మిల్లర్లకు మింగుడు పడడం లేదట!

`సబ్‌ కమిటీ పకడ్బందీ నిర్ణయాలు చేస్తేనే బకాయిలు వసూలౌతాయి.

`మిల్లర్లకు ముకుతాడు వేస్తేనే బకాయిలకు మోక్షం వస్తుంది.

`బకాయిలు ఇప్పటికైనా వసూలు చేయకపోతే ఇక అంతే సంగతులు.

`ఇంకా కాలయాపన చేసే మొదటికే మోసం వస్తుంది.

`సామాన్యుల నుంచి చిన్న చిన్న బకాయిలు ముక్కు పిండి వసూలు చేస్తారు.

`ఇంటి పన్ను కట్టకపోతే చావు డప్పు మోగిస్తారు.

`ఆదాయపు పన్ను కట్టకపోతే దాడులు చేస్తారు.

`ప్రభుత్వానికి వేల కోట్ల బకాయిలున్న మిల్లర్లను ఎందుకు వదిలేస్తున్నారు.

`పదేళ్ల నుంచి చర్చలకు ఎందుకు ఉపక్రమించలేదు.

`వ్యవసాయమే ప్రధాన ఆదాయమైన మన దేశంలో సాగు సంపదను దోచుకుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు.

`బకాయిలు వేల కోట్లకు చేరుకున్న సివిల్‌ సప్లయ్‌ ఎందుకు మొద్దు నిద్ర వీడడం లేదు!

`దొంగ మిల్లర్లను వదిలేస్తారా!

`దళారుల కొమ్ము కాస్తూనే వుంటారా!

`అధికారికంగా లూటీ చేస్తున్నా కళ్లు మూసుకుంటారా?

బకాయిలున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వకండి. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. తెలంగాణలో అసలైన మిర్లర్లు. అంటే తెలంగాణలో అసలైన మిల్లర్లు వేరు, దొంగ మిల్లర్లు వేరే వున్నారా? అన్న అనుమానం అసలే వద్దు. గత కొన్ని రోజులుగా నేటిదాత్రి వరస కథనాలు రాస్తూనే వుంది. వాటిలో దొంత మిల్లర్ల బాగోతాలను వెలుగులోకి తెస్తూనే వుంది. మిల్లర్ల ముసుగులో దళారులు చేరి, ఏజెన్సీల పేరుతో సాగిస్తున్న దోపడీ గురించి నేటిదాత్రి వాస్తవ కథనాలను పాఠకులు ముందుకు తెస్తూనే వుంది. అసలు మిల్లులే లేకుండా మిల్లర్లుగా ఎలా చెలామణి అవతున్నారు. గోడౌన్లు లేకుండా ఇతరల గోడౌన్లను ఎలా చూపిస్తున్నారు. అసలు వడ్లు తమవి కాకున్నా కాకిలెక్కలు ఎలా చెబుతున్నారు. అధికారులను ఎలా బురిడీ కొటిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారన్న సంగతి వెలుగులోకి వచ్చిందే. కనీసం ఇప్పటికైనా దొంగల చేతికి తాళాలివ్వడం ఆపేయాలి. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టాలి. ముందుగా వడ్ల కొనుగోలు అంశంలో దళారీ వ్యవస్ధ లేకుండా చేయాలి. ప్రభుత్వం దొంత మిల్లర్ల ముసుగులో వున్న వారిని గుర్తించాలి. వారికి వడ్లు ఇవ్వడం ఆపేయాలి. లేకుంటే నెల రోజుల్లోనే అంతా తారు మారు చేస్తారు. మళ్లీ వడ్లు తమ ఖాతాలో వేసుకుంటారు. ప్రభుత్వానికి ఎగనామం పెడతారు. అందుకే దొంగ మిల్లర్లను ఏరివేయండి. దళారులు ముసుగులో వున్న వారిని గుర్తించి తప్పించండి. ఇంత కాలం దోచుకున్నదంతా కక్కించండి. ఏజెన్సీల పేరుతో దగా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయండి. దళారుల అవతారంలో వున్నవారికి మిల్లులే లేవు. అసలైన మిల్లర్లకు దళారులతో సంబంధం లేదు. యూనియన్ల పేరుతో చెలామణి అవుతున్న వారి బకాయిలు ముక్కుపిండి వసూలు చేయండి. మొత్తంగా దళారీ వ్యవస్ధకు చరమగీతం పాడండి. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిని మిల్లర్ల లిస్టు నుంచి తప్పించండి. దళారులతో సంబంధం లేకుండా నేరుగా మిల్లర్లకే వడ్లు ఇవ్వండి. డిపాజిట్లు వ్యతిరేకిస్తున్నవారంతా బాకాయిదారులే. డిపాజిట్లు చెల్లిస్తే తిరిగి బాకాయిల కింది సొమ్ము పోతుందని భయపడుతున్నవారే. ఈ విషయంలో సబ్‌ కమిటీ కఠినంగా వ్యవహరించాలి. సివిల్‌ సప్లయ్‌ అదికారులు ఇప్పటికైనా అంకితభావంతో పనిచేయాలి. నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లనే నమ్మండని మిల్లర్ల యజమానులే కోరుతున్నారు. వారి మాటలను పరిగణలోకి తీసుకోవాలి. దొంగ మిల్లర్ల వ్యవస్ధ మూలంగా తమ మీద అపనమ్మకం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దోచుకుంటున్నది కొందరైతే మొత్తం వ్యవస్ధ మీదకే సమాజం వేలెత్తి చూపుతోంది. నిజానిజాలు తెలియక పోవడంతో మిల్లర్లంతా దొంగలే అన్న భావన ఏర్పడుతోంది. దాంతో మిల్లర్లంతా దోషులే అన్న అపవాదు మూటగట్టుకోవాల్సివస్తుందని అసలైన మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాలో విజిలెన్స్‌ దాడులు చేసి అదికారులు మమ అనిపిస్తున్నారు. అన్ని జిల్లాల్లో దాడులు నిర్వహస్తేనే దోషులెవరు? దొంగలెవరు? నిజాయితీ పరులైన మిల్లర్లు ఎవరు అన్నది తేలుతుందని అంటున్నారు. దొంగ మిల్లర్లను వదిలేసి, అసలైన మిల్లర్లను అధికారులు వేదిండం మానుకోవాలని కూడా సూచిస్తున్నారు. అసలైన దోషులును పట్టుకోక వారికి వత్తాసు పలికే అధికారులే లేనిపోని అపోహలు, అగాధాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దోషులైన దొంగ మిల్లర్లను వెనకేసుకొస్తూ, వారికి కొమ్ము కాస్తూ వుంటే వారి నుంచి వేల కోట్లు ఎప్పుడు వసూలు చేస్తారు. చిన్న చిన్న మిల్లర్లను ఇబ్బంది పెట్టి అదికారులు ఏం సాధిస్తారన్నది అర్దం కాని ప్రశ్న. ప్రభుత్వం డిపాజిట్లు కోరడంలో తప్పు లేదు. అసలైన మిల్లర్లు డిపాజిట్లకు వ్యతిరేకం కాదు. వారి ఎక్కడా డిపాజిట్లను వ్యతిరేకించడం లేదు. దొంగ మిల్లర్లు డిపాజిట్లను వ్యతిరేకించడంతో అసలైన మిల్లర్లు కూడా అబాసు పాలౌతున్నారు. మిల్లర్లంతా డిపాజిట్లు వద్దంటున్నారన్న సంకేతాలు పంపిస్తున్నారు. దళారుల ముసుగులో వున్న దొంగ మిల్లర్లు, కొందరు యూనియన్‌ నాయకులు కూడ బలుక్కొని డిపాజిట్లను వ్యతిరేకిస్తున్నారు. అందుకు కారణాలున్నాయి. వారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా దర్జా వెలగబెడుతున్నారు. కోట్లు కొల్లగొట్టి కడుపు నింపుకున్నారు. ఒక వేళ ఇప్పుడు డిపాజిట్లు చెల్లిసే అవి బకాయిల కింద జమ చేస్తారన్న అనుమానంతో వద్దని మొండికేస్తున్నారు. లేని పోని రాద్దాంతం చేస్తున్నారు. మొత్తం మిల్లర్ల వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారు. మిల్లర్లకు చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో రైతులు ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు వుంది. ఏ రాష్ట్రానికైనా వెళ్లి ధాన్యం అమ్ముకునే వీలుంది. అలాంటప్పుడు ప్రభుత్వానికి , రైతుకు మధ్య దళారులు అవసరం లేదు. దళారీ వ్యవస్ధ ప్రైవేటు రంగంలో వుంటుంది. కాని ప్రభుత్వమే దళారీ వ్యవస్ధను ప్రోత్సహించడం వల్ల అటు రైతు లాభపడడం లేదు. ఇటు ప్రభుత్వానికి బకాయిలు వసూలు కావడం లేదు. రూపాయి ఖర్చు లేకుండా ఏటా దళారులు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడ్డారు. డిపాజిట్ల విషయంలో ప్రీగా వడ్లు తీసుకోవడం అలవాటు చేసుకుకున్న దొంగ మిల్లర్లకు మింగుడు పడడం లేదు. కాని అసలైన మిల్లర్లు తమకు మిల్లింగ్‌ చార్జీలు చాలంటున్నారు. అందువల్ల దొంగ మిల్లర్లకు కిలో వడ్లు కూడా ఇవ్వొద్దని మిల్లర్లు కోరుతున్నారు. రాష్ట్రంలో సుమారు రెండు వేలకు పైగా మిల్లులున్నాయి. అందులో రా రైస్‌ మిల్లర్లు, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లకు వేరువేరు సంఘాలున్నాయి. కాని ఈ రెండు వ్యవస్ధలను మేనేజ్‌ చేసే దళారీలుగా చెలామణి అవుతున్న దొంగ మిల్లర్లకు అసలు మిల్లులే లేవు. అలా చెలామణి అవుతున్న వారిలో నాలుగు ఏజెన్సీలకు చెందిన వాళ్లు ఐదు వందల వరకు వుంటారు. దొంగ మిల్లర్లకు అసలు మిల్లులే లేనందున వారికి వడ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి వడ్లు ఇచ్చినా మళ్లీ మిల్లింగ్‌ చేయాల్సింది అసలైన మిలర్లే. అందుకని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ ఈసారి నుంచి ఖచ్చితంగా అసలైన మిల్లర్లకే వడ్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. అమలు చేయాలి. దొంగ మిల్లర్లకు ఇప్పుడు ముకు తాడు వేయకపోతే బకాయిలు మరింత పెరిగిపోతాయే తప్ప తగ్గవు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. వాటిని తీర్చడం వారికి కూడా గగనమే. ఎందుకంటే తేరగా వచ్చిన సొమ్ములు ఖర్చు చేశామని చెబుతారు. కాని ఆస్దులు దాగి వుంటాయి. వాటి లెక్కలు తీయడం ఎవరి వల్ల కాదు. అందుకే ముందు దొంగ మిల్లర్లను ఏరివేయాలి. దొంగమిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. సహజంగా ఇంటి పన్ను చెల్లించని వారి మీద మున్సిపల్‌ అధికారులు జులం చూపిస్తారు. ఆదాయపు పన్ను చెల్లించని వారి ఇంటి మీద మూకుమ్ముడి దాడులు చేస్తారు. మరి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ వున్నారని తెలిసినా మిల్లర్లను ఎందుకు వదిలేస్తున్నారు. ఏదో ఒక ఏడాది సమస్య కాదు. పదేళ్లుగా ప్రభుత్వానికి వేల కోట్లు బాకీ పడిన దళారీ మిల్లర్లను ఇంకా ఎంత కాలం ఉపేక్షిస్తారు. పదేళ్లుగా బకాయిలు వసూలు చేయకుండా నిర్లక్ష్యం చేయడమే తప్పు. వారిని ఉపేక్షించి మీన మేషాలు లెక్కిస్తున్నారు. మన దేశమే వ్యవసాయాదారిత జీవనం. సాగు ఆదాయాన్ని అప్పనంగా మింగుతున్న మిల్లర్లను ప్రభుత్వాలుఎందుకు వదిలేస్తున్నాయి. ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడుతున్న మిల్లర్ల నుంచి పదేళ్లుగా బకాయిలు వసూలు చేయకుండా సివిల్‌సస్లప్‌ అధికారులు ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు? దొంగ మిల్లర్లను ఇప్పటికైనా కట్టడి చేస్తారా? వారి నుంచి బకాయిలు చేస్తారా? లేకుంటే గత ప్రభుత్వంలాగానే వదిలేస్తారా? పాలకులు మారినా, అదికారులు దొంగ మిల్లర్లకు కొమ్ముకాస్తూనే వుంటారా? అధికారికంగా ప్రభుత్వ సొమ్మును లూటీచేస్తున్నవారిని ఉపేక్షిస్తారా? ఇంకా కళ్లు మూసుకొని నటిస్తుంటారా? అన్న ప్రశ్నలు ఏకంగా అసలైన మిల్లర్ల నుంచే వినిపిస్తున్నాయి. ఈ మాటలు సివిల్‌ సప్లయ్‌ అదికారులకు వినిపిస్తున్నాయా? లేదా అన్నది తేలాల్సివుంది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తారా? లేక యదావిదిగానే తమ పనితాము చేస్తామని కళ్లు మూసుకుంటారా? వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *