కలుపుతున్నారా! విడదీస్తున్నారా!!

https://epaper.netidhatri.com/view/410/netidhathri-e-paper-21st-october-2024%09

మిల్లర్ల మధ్య అగాధం పెంచుతున్నారా!

`సబ్‌ కమిటీ మిల్లర్లందరినీ ఏకతాటిపైకి తేస్తుందా లేదా!

`రా రైస్‌ మిల్లర్లు వేరు, బాయిల్డ్‌ మిల్లర్లు వేరు.

`రెంటికీ వేరు వేరు సంఘాలున్నాయి.

`బాయిల్డ్‌ మిల్లర్ల యూనియన్‌తో చర్చలు జరిపితే సరిపోతుందా!

`రా రైస్‌ మిల్లర్లతో చర్చలు చేయరా!

`డిఫాట్లర్లు ఎక్కువగా బాయిల్డ్‌ మిల్లర్లే వున్నారు.

`వారితో మాత్రమే చర్చలు జరిపి ఏం సంకేతాలు పంపిస్తున్నారు.

`హాలు సరిపోదని బాయిల్డ్‌ మిల్లర్ల సమావేశంతో మమ అనిపించారు.

`రా రైస్‌ మిల్లర్లు అడిగితే రేపు పిలుస్తామన్నారు.

`ఆ రేపు వెళ్లిపోయి వారం రోజులకొస్తోంది.

`ప్రభుత్వం వడ్లు సేకరించే పని మొదలు పెట్టింది.

`తెలంగాణలో రా రైస్‌ మిల్లర్ల సంఖ్య ఎక్కువ.

`బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు తక్కువ.

`తక్కువ సంఖ్యలో వున్న యూనియన్‌ తో చర్చలతో ఏం సందేశమిస్తున్నారు.

`కమీషనర్‌ తో చర్చలకు హజరైన యూనియన్‌ లీడర్లే వేల కోట్ల బకాయిలు న్నారు.

`డిఫాల్టర్లకు వడ్లు ఇవ్వము అని మళ్లీ వారితోనే చర్చలు జరిపడాన్ని సబ్‌ కమిటీ ఎలా సమర్థించుకుంటుంది.

`సబ్‌ కమిటీ నిర్ణయం మిల్లర్ల మధ్య మరింత దూరం పెంచదా!

`ఆధిపత్యపోరుకు దారి తీయదా!

`హాలు చిన్నదన్న సాకుతో రా రైస్‌ మిల్లర్లను దూరం పెడుతారా!

`వారిని కూడా పిలిచి మాట్లడలేరా!

`కమీషనర్‌ నిర్ణయం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది.

`మంత్రులను రాజకీయంగా ఇబ్బందుల పాలు చేస్తుంది.

`మిల్లర్ల తో మాట్లాడితేనే వారి సమస్యలు మంత్రులకు తెలుస్తుంది.

`కమీషనర్‌ మాత్రమే జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

`ప్రతిపక్షాలకు మళ్ళీ ఆయుధమిచ్చినట్లౌతుంది.

`ప్రభుత్వం విమర్శల పాలౌతుంది.

`పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

`రెండు రకాల మిల్లర్ల సమావేశం మంత్రుల సాక్షిగా జరగాలి.

`ఏక కాలంలో ఒకే వేదికపై సమస్యలు వినాలి.

`రా రైస్‌ మిల్లర్ల సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

`మిల్లర్ల వ్యవస్థలో ఆధిపత్య దోరణికి పుల్‌ స్టాప్‌ పడాలి.

`మొత్తంగా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు కావాలి.

`మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.

`దళారులు దోచుకుపోకుండా చూడాలి.

`మిల్లర్ల మధ్య విభజన లేకుండా సమన్వయపర్చాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో జరిపే చర్చల్లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. మిల్లర్ల మధ్య అగాధాలకు కారణమౌతున్నాయి. వారి మధ్య దూరం మరింత పెంచేందుకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో మిల్లర్లు రెండు రకాలు. మిల్లర్లతో సబ్‌ కమిటీ సాగించిన చర్చల్లో వారిని కలుపుతున్నారా? విడదీస్తున్నారా? అన్న సందేహాన్ని మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కమీషనర్‌ చర్యలు పరోక్షంగా సబ్‌ కమిటీకి చెడ్డపేరు తెచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రా రైస్‌ మిల్లర్లు, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు వున్నారు. రెండు దశాబ్ధాల క్రితం వరకు బాయిల్డ్‌ రైస్‌ మిల్లులే తెలంగాణలో ఎక్కువగా వుండేది. కాని ఇప్పుడు రా రైస్‌ మిలర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రా రైస్‌ మిల్లుల సంఖ్యతో పోల్చితే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు నాలుగో వంతు కూడా వుండవు. కాని యూనియన్‌ మాత్రం బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల చేతిలోనే వుంది. ఆ విషయంలో ఎప్పుడూ రా రైస్‌ మిల్లర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లను మాత్రమే పిలిచారు. వారితో కమీషనర్‌ చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రా రైస్‌ మిల్లర్లు మాతో సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పుడు కమీషనర్‌ చెప్పిన సమాధానం విని రా రైస్‌ మిల్లర్లు ఆశ్యర్యపోయారట. మిల్లర్లతో సమావేశానికి అవసరమైన హాలు చిన్నది కావడం వల్ల బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లను మాత్రమే ఆహ్వానించడం జరిగిందన్నారట. పైగా ఒకటి రెండు రోజుల్లో రా రైస్‌ మిల్లర్లతో కూడా సమావేశం వుంటుందని చెప్పి పంపించారట. కాని ఇంత వరకు రా రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదు. సబ్‌ కమిటీ పేరుతో ఎలాంటి సమచారం అందలేదంటున్నారు. అసలు సమావేశానికి హాలే సమస్య అయినప్పుడు ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. ఏ హోటల్‌లోనైనా సమావేశం నిర్వహించుకోవచ్చు. మిల్లర్లతో ప్రభుత్వం జరిపే చర్చల్లో రహస్యం ఏమీ లేదు. రహస్య మంతనాలు చేసేదేమీ వుండదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎక్కడైనా మిల్లర్లతో సమావేశం నిర్వహించుకోవచ్చు. అంతే కాదు ప్రజా భవన్‌లో వేలాది మంది కూర్చునే హాల్స్‌ కూడా వున్నాయి. అక్కడ ఏర్పాటు చేసినా సరిపోయేది. కాని కేవలం హాల్‌ పేరు చెప్పి రా రైస్‌ మిల్లర్లను సబ్‌ కమిటీ పిలవకపోవడాన్ని రా రైస్‌ మిల్లర్లు తప్పు పడుతున్నారు. తమకు ప్రభుత్వంలో గుర్తింపు లేదా? అని ఆందోళన చెందుతున్నారు. రేపే మీతో సమావేశం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన కమీషనర్‌ నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రైతులు రైతువేదికల వద్ద వడ్లు అమ్ముతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇంకెప్పుడు తమతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం బకాయిదారులైన మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. దానిపై అధికారిక ప్రకటన కూడా చేసింది. మళ్లీ డిఫార్టర్లు ఎక్కువగా వున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లనే చర్యలకు ఆహ్వానించడం వెనుక ఉద్దేశ్యమేమిటని రా రైస్‌మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలకు హాజరైన బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల ప్రతినిధులే డిఫార్టర్లలో వున్నారని అంటున్నారు. సబ్‌ కమిటీతో సమావేశమైన మిల్లర్లు నాయకులే ప్రభుత్వానికి వేల కోట్లు బాకీ వున్నారన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారితో చర్చలు జరిపి ప్రభుత్వం ఏం సందేశం పంపుతోందని రా రైస్‌ మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి బాకీ పడిన మిల్లర్లలో ఎక్కువ శాతం బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లే అధికంగా వున్నారని తెలుస్తోంది. ఎక్కువగా వున్న రా రైస్‌ మిల్లర్లలో తక్కువ డిఫాల్టర్లు వుంటే, తక్కువ సంఖ్యలో వున్న బాయిల్డ్‌ రైస్‌ మిలర్లలో ఎక్కువ డిఫాల్టర్లు వున్నారని అంటున్నారు. అలాంటి సమయంలో అసలు డిఫాల్లర్లను చర్చలకు పివడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరపాలనుకుంటే రెండు రకాల మిల్లర్లతో ఏక కాలంలో సమావేశం నిర్వహించాలి. కాని కేవలం బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లనే సమావేశానికి ఆహ్వానించడంతో రా రైస్‌ మిల్లర్ల మీద అపోహలు ఏర్పడే ప్రమాదముంది. డిఫార్టర్లు రా రైస్‌ మిల్లర్లు వున్నారనే సంకేతాలు వెళ్లే అవకాశం వుంది. అందుకే తాము కూడా ప్రభుత్వంలో జరిగే చర్చల్లో పాల్గొంటే ఈ విషయం సబ్‌ కమిటీకీ తెలిసేదని రా రైస్‌ మిల్లర్లు వాపోతున్నారు. ఇక్కడ కూడా తమకు అన్యాయమే జరగడం బాదాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి చేసిందా? లేక తెలియక చేసిందా? అదే స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. కమీషనర్‌ మిల్లర్లకు పిలుపులో ఈ వివక్షత ఎందుకు ప్రదర్శించారన్నదానిపై వివరణ కావాలని రా రైస్‌ మిల్లర్ల కోరుతున్నారు. ఈ సీజన్‌లో ఇక రా రైస్‌ మిల్లర్లతో సమావేశం లేదని చెప్పదల్చుకుంటే ఆ విషయమైనా స్పష్టంగా చెప్పాలని కోరుతున్నారు. ఒక వేళ మిర్లర్లలో రెండు రకాలు వున్నాయని తెలిసినా, యూనియన్‌ పరంగా ఒకే వర్గాన్ని పిలిస్తే సరిపోతుందని అనుకున్నారా? లేక ఆ యూనియన్‌లోనే అన్ని రకాల మిల్లర్లు వున్నారన్న సమాచారంతో చర్చలకు పిలిచారా? తెలియాల్సిన అవసరం వుందన్నారు. ఎందుకంటే అటు రా రైస్‌ మిల్లర్ల సంఘం వేరు. ఇటు బాయిల్డ్‌ రైస్‌ సంఘం వేరుగా వున్నాయి. ఏ రకమైన మిల్లర్లు వారి సమస్యలను వ్యక్తం చేస్తారు. వారి వారి సమస్యలు వేరుగా వుంటాయి. ఒకరి సమస్యలు మరొకరు ప్రస్తావించే అవకాశం వుండదు. రాదు. అలాంటప్పుడు రెండు యూనియన్లకు ఏక కాలంలో పిలుపులు రావాల్సి వుండే. కాని రాలేదు. ప్రభుత్వానికి రా రైస్‌ మిల్లర్లు తమను కూడా చర్చలకు పిలవాలని కోరారు. అయినా ప్రభుత్వం నుంచి గాని, సబ్‌ కమిటీ నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. రేపు మీతో సమావేశమౌతామని కమీషనర్‌ చెప్పి ఇప్పటికి వారం రోజులు దాటిపోతుంది. అయినా ఎలాంటి స్పందన రాలేదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా సబ్‌ కమిటీ సమావేశం మూలంగా రెండు యూనియన్ల మధ్య మరింత దూరం పెరిగే అవకాశం వుంది. ఇది తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇరు వర్గాలకు నష్టమే జరుగుతుంది. పైగా రెండు యూనియన్ల మధ్య అగాధానికి దారి తీస్తుంది. ఆధిపత్యపోరుకు మరింత ఆజ్యం పోసినట్లౌతుందంటున్నారు. ప్రభుత్వం రెండు యూనియన్ల మధ్య సయోధ్య కుదిర్చాల్సిన సమయంలో సబ్‌ కమిటీతో జరిగిన చర్చలకు బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల సంఘానికే ప్రాధాన్యతనిచ్చినట్లైంది. వారికి పెద్ద పీట వేసినట్లైంది. ఇది రెండు యూనియన్లపై ప్రభావం చూపుతుందని రా రైస్‌ మిల్లర్లు అంటున్నారు. నిజానికి మిల్లర్ల సమస్యలు మంత్రులకు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. కాని కమీషనర్‌కు తెలిసే అవకాశం లేదు. మంత్రులకు నేరుగా మిల్లర్లతో ప్రజా సంబంధాలు, రాజకీయ సంబంధాలుంటాయి. దాంతో ఎప్పటికప్పుడు వారి వారి సమస్యలు మంత్రుల దృష్టికి వెళ్ల అవకాశం వుంటుంది. మిల్లర్లతో సమావేశంలో కమీషనర్‌ మాత్రమే జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాన్ని మిల్లర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రతిపక్షాలకే ప్రభుత్వమే ఆయుధం అందించినట్లౌతుంది మిలర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం విమర్శలపాలౌతుంది. పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం వుంది. రెండు రకాల మిల్లర్ల యూనియన్‌ ప్రనిధులతో ఏక కాలంలో మంత్రుల సాక్షిగా సబ్‌ కమిటీ సమావేశం సాగాలని రా రైస్‌ మిల్లర్లు కోరుతున్నారు. కేవలం బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల సమస్యలు ఒక్కటే తెలుసుకుంటే సరైంది కాదు. రా రైస్‌ మిల్లర్ల సమస్యలు కూడా అదే వేదిక మీద తెలుసుకుంటే బాగుండేందని అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే మిల్లర్ల మధ్య వుండే ఆధిపత్యపోరుకు కూడా తెరపడే అవకాశం వుండేంటున్నారు. రెండు రకాల మిల్లర్ల ఏక కాల సమావేశంలో అసలు బకాయి దారులు ఎవరు? ఎవరెవరు ఎంతెంత బకాయిలు వున్నాయన్న సంగతి కూడా అప్పుడే వెలుగులోకి వచ్చే పరిస్దితి వుండేది. కాని సబ్‌ కమిటీని తప్పు దోవ పట్టించి ఇలాంటి సమావేశం నిర్వహించడం మూలంగా బకాయిలు పేరుకుపోయిన వారిలో భయం లేకుండాపోయే ప్రమాదం వుంది. అందువల్ల ఇప్పటికైనా సబ్‌ కమిటీ గాని, కమీషనర్‌గాని రా రైస్‌మిల్లర్లను కూడా పిలిచి చర్చలు జరిపితే బాగుంటుందని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *