ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి దుర్మార్గం.
`అటు ఒత్తిళ్లు..ఇటు పెనాల్టీలు!
`టెండర్ ప్యాడి దళారీ వ్యవస్థను పోషించడం ఎందుకు!
`బకాయిలు చెల్లించే సమయంలో టెండర్ ప్యాడి మూసుడెట్లా!
`దేశంలో ఏ రాష్ట్రంలో లేని టెండర్ ప్యాడి విధానం తెలంగాణలోనే ఎందుకు?
`మిల్లర్లు ఎదుర్కొంటున్న మద్దెల దరువులు!
`చెల్లించే వారి చేతులు కట్టేసి..బలవంతంగా పెనాల్టీలేస్తారా?
`టెండర్ ప్యాడీ మూలంగా నలిగిపోతూ నష్టపోతున్న మిల్లర్లు.
`చెల్లింపుల్లో ఆలస్యమైందని పెనాల్టీలేస్తామనడం ఎట్లా!
`విచిత్రమైన టెండర్ ప్యాడీ విధానాలు.
`మిల్లర్ల మీద టెండర్ ప్యాడీ పెత్తనమెందుకు!
`టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్థను పోషించడమెందుకు!
`ప్రభుత్వ ఖజాను నుంచి టెండర్ ప్యాడీ వ్యవస్థను బతికించుడెందుకు!
`రైతులు, మిల్లర్ల మధ్య టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్థ ఎందుకు!
`టెండర్ ప్యాడీ మూలంగా రైతు నష్టపోతున్నాడు.
`మిల్లర్లు నలిగి నష్టాల బారిన పడుతున్నారు.
`ఖజానాకు టెండర్ ప్యాడీ గండికొడుతున్నారు.
`ఇన్ని రకాల టెండర్ ప్యాడీని ఎందుకు కొనసాగిస్తున్నారు.
`ప్రభుత్వానికి విసృతమైన సివిల్ సప్లయ్ విభాగముంది.
`దానిని పర్యవేక్షించేందుకు, మిల్లర్లను నియంత్రించేందుకు విజిలెన్స్ వ్యవస్థ వుంది.
`టెండర్ ప్యాడీ కనుసన్నల్లో విజిలెన్స్ పనిచేయడమేమిటి?
`టెండర్ ప్యాడీ మీద నియంత్రణేది.
హైదరాబాద్,నేటిధాత్రి:
తగ్గాల్సిన సమస్యలు పోను పోను పెరుగుతుంటే ఎవరికైనా ఇబ్బందే..తెలంగాణ మిల్లర్ల పరిస్ధితి కూడా అలాగే వుంది. సమస్యలు పరిష్కామౌతున్నాయనుకుంటున్న ప్రతిసారి ఏదోఒక సమస్య మళ్లీ వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ మధ్య తెలంగాణలో వున్న మిల్లర్ల బకాయిలన్నీ దాదాపు వసూలుచేశారు. అందుకు ఆ శాఖ కమీషనర్ చౌహన్‌ను ఎందుకైనా అభినందించాల్సిందే. ఎందుకంటే పదేళ్లకు పైగా మిల్లర్ల వద్ద వేలాది కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయారు. ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి చేసినా వాటి వసూలు సాధ్యం కాలేదు. అప్పటి పాలకులు కూడా వసూలుకు చిత్తశుద్ది ప్రదర్శించలేదు. దాంతో ప్రభుత్వానికి అందాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువైన తర్వాత సివిల్ సప్లైశాఖకు కమీషనర్‌గా చౌహన్‌ను నియమించారు. అప్పటి నుంచి ఆయన బకాయిల వసలూ మీద దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా చౌహాన్ మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండానే వసూలు చేయించారు. విడతల వారిగా అవకాశం కల్పించారు. మొత్తానికి మిల్లర్ల నుంచి వేల కోట్లు వసూలు చేయించారు. ఇంకా కొన్ని వందల కోట్లు బకాయిలు మిగిలి వున్నాయి. వాటిని కూడ చెల్లించడానికి మిల్లర్లు అందరూ సిద్దం వున్నారు. కాని ఇక్కడే కొందరు అధికారులు, టెండర్ ప్యాడీ దారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మిల్లర్లను ఇబ్బందులకు గురి చేయాలిన చూస్తున్నారు. దాంతో మిల్లర్లకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వేధింపులు ఎక్కువౌతున్నాయి. ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నారు. మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా వున్నప్పటికీ టెండర్ ప్యాడీకి చెందిన దళారులు మూలంగా మిల్లర్ల మీద మరింత అదనపు బారం పడేలా వుంది. మిల్లర్ల మీద పెనాల్టీలు విధించాలిన మధ్య దళారీ వ్యవస్ధ అయిన టెండర్ ప్యాడీ మిల్లర్లను ముప్పు తిప్పలు పెట్టాలనుకుంటోంది. దాంతో మిల్లర్లు మద్దెల దరువునుకు ఎదుర్కొనే పరిస్ధితులు సృష్టించబడుతున్నాయి. మేం బకాయిలు చెల్లిస్తాం మహా ప్రభో అని మిల్లర్లు అంటుంటే వారి చేతులు కట్టేసినంత పనిచేస్తున్నారు. వారు బకాయిలు చెల్లిస్తామంటుంటుంటే ఇప్పుడు వద్దన్నారు. వెసులుబాటు కల్పించినట్లు నమ్మించారు. ఇప్పుడు ఒత్తిడికి టెండర్ ప్యాడీ దళారులు సిద్దమౌతున్నారు. టెండర్ ప్యాడీ క్లోస్ అయ్యిందని పెనాల్టీ విధించేందుకు సిద్దమౌతున్నట్లు మిల్లర్లుకు సమాచారం అందింది. అంతే తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్లు లబో దిబో మంటున్నారు. తాము సంతోషంగా వున్నాం. బకాయిలన్నీ పూర్తిగా చెల్లిస్తామని చెప్పినప్పుడు టెండర్ ప్యాడీ మూలంగా వసూలు ఆలస్యమైంది. ఇప్పుడు మెడమీద కత్తిపెట్టినట్లు పెనాల్టీలతో సహా వసూలు చేస్తామని చెబుతున్నట్లు సమాచారం. దాంతో మిల్లర్లు తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. తప్పు మిల్లర్ల వైపు నుంచి జరిగితే నిజంగానే పెనాల్టీలతో సహా వసూలు చేసుకోవచ్చు. కాని తాము బకాయిలు చెల్లిస్తామని చెప్పినా తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ మిల్లర్లనే దోషులు చేయాలనుకుంటున్నారు. ఇది ఎట్టిపరిస్ధితుల్లో ఒప్పుకునే పరిస్ధితి లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. తమ హక్కులను పూర్తిగా టెండర్ ప్యాడీ విధానం వల్ల కోల్పోతున్నామని అంటున్నారు. అయినా ప్రభుత్వానికి,మిల్లర్లకు మధ్య ఈ టెండర్ ప్యాడీ దళారులెందుకు? వారి పెత్తనమెందుకు? ఆ వ్యవస్ధ ఎందుకు? వారి చేత మాకు లేనిపోని ఇబ్బందులెందుకు? అని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. చెల్లింపులు చేస్తామంటూ తాము ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వసూలు చేసుకోకుండా, బలవంతంగా పెనాల్టీలు వేసి మిల్లర్లను నష్టాలల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం…ఇదెక్కడి దుర్మార్గమని మిల్లర్లు నిలదీస్తున్నారు. ప్రభుత్వం అనవసరంగా మధ్య ధళారుల మూలంగా అబాసు పాలౌతుందని మిల్లర్లు వాదిస్తున్నారు. మధ్య దళారుల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటున్నారు. అంతే కాదు ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్యాడీ విదానం అనేది దేశంలో ఎక్కడా లేదు. ఏ రాష్ట్రంలోనూ లేదు. పొరుగున వున్న ఏపిలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఈ పెంట మిల్లర్ల మీద రుద్దడం జరిగిందంటున్నారు. అలా టెండర్ తీసుకున్న మధ్య ధళారుల మూలంగా మిల్లర్లు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఇబ్బందుల పాలౌతున్నారు. కష్టాలకు గురౌతున్నారు. మిల్లులు మూసుకునే పరిస్ధితిని టెండర్ ప్యాడీ దళారులు సృష్టిస్తున్నారని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బకాయిలు చెల్లించే సమయంలో టెండర్ ప్యాడీ గడువు ముగియడమేమిటో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. బకాయిలు అందరూ చెల్లించేందుకు సిద్దమౌతుంటే ఆలస్యమైందని పెనాల్టీలు చెల్లించాల్సిందే అని మిల్లర్లను బెదిరించడమేమిటని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు మిల్లర్ల మీద టెండర్ ప్యాడీ పెత్తనమేమిటని వాళ్లు నిలదీస్తున్నారు. అసలు ప్రభుత్వం టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్ధను పోషించడమెందుకంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య టెండర్ ప్యాడీ వ్యవస్ధ అవసరం లేనిది. అర్దం లేనిది. అనవసరంగా కోట్లాది రూపాయలు చెల్లిస్తూ, ప్రభుత్వం టెండర్ ప్యాడీ వ్యవస్ధను పోషించాల్సిన అవసరం లేదంటున్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య సివిల్ సప్లై వ్యవస్ధ వుంది. ఆ వ్యవస్దతోనే దేశంలోని అన్ని రాష్టాలలోనూ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరుగుతోంది. కాని ఒక్క తెలంగాణలోనే ఈ వ్యవస్ధ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? ఎవరి మేలు కోసం వచ్చింది? ఏ రకంగా చూసినా ప్రభుత్వానికి టెండర్ ప్యాడీ వ్యవస్ధ వల్ల నష్టమే తప్ప రూపాయి లాభం లేదు. టెండర్ ప్యాడీ మూలంగా అటు రైతు నష్టపోతున్నాడు. ఇటు మిల్లర్లు నలిగిపోతున్నారు. ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. కేవలం పర్యవేక్షణ తప్ప పని లేని టెండర్ ప్యాడీని కోట్లాది రూపాయలు చెల్లించి ప్రభుత్వం మేపాల్సిన పనిలేదు. టెండర్ ప్యాడీ మూలంగా ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. అలాంటి టెండర్ ప్యాడీని ప్రజా ప్రబుత్వం కూడా ఎందుకు నిర్వహిస్తోందని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో సివిల్ సప్లైకి విసృతమైన యంత్రాంగముంది. ఆ యంత్రాంగం చాలు. దానికి అనుబంధంగా విజిలెన్స్ విభాగం వుంది. ఈ రెండు వ్యవస్ధలు పటిష్టంగానే వున్నాయి. అయినా కొత్తగా టెండర్ ప్యాడీ తెచ్చిపెట్టారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మిల్లర్లు ఏదైనాపొరపాటు చేస్తే నియంత్రించేందుకు విజిలెన్స్ వ్యవస్ధ వుంది. అలాంటి విజిలెన్స్ వ్యవస్ధను కూడా ఆడిరచేందంతగా ప్యాడీటెండర్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. విజిలెన్స్ వ్యవస్ధ కూడా ప్యాడీ టెండర్ కనుసన్నల్లో పనిచేస్తోంది. ప్యాడీ టెండర్ చెప్పినట్లు విజిలెన్స్ విభాగం పనిచేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమే జరుగుతోంది. రైతులనుంచి వడ్లు సేకరించడానికి ప్రత్యేకంగా టెండర్ ప్యాడీ దళారీ వ్యవస్ధ అవసరమే లేదు. ఆ వ్యవస్ధను కూర్చోబెట్టి మేపాల్సిన అవసరం లేదు. వారికి పారితోషికం కింద కోట్లాదిరూపాయలు చెల్లించాల్సినపనిలేదు. ఆ వ్యవస్ధకు చెల్లిస్తున్న దానిని తమకు చెల్లిస్తే చాలు. అటు రైతు నుంచి కోతలకు కూడా పెద్దగా ఆస్కారం వుండదు. ఇటు మిల్లింగ్‌లోనష్టాలకు తావుండదు. ఆ వ్యవస్ధకు అనవసరంగా చెల్లించే సొమ్మును రైతులకు, మిల్లర్లకు పంచినా బాగుంటుంది. లేకున్నా ఇబ్బంది కూడా లేదు. అనవసరంగా టెండర్ ప్యాడీని ఫోషిస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. రైతుల నుంచి వడ్లు సేకరించడం కోసం టెండర్ ప్యాడీ వ్యవస్ధ ముందుస్తుగా ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేస్తున్నది లేదు. కాని వడ్లు వచ్చిన తర్వాత పర్యవేక్షన పేరుతో మిల్లర్ల మీద పెత్తనం సాగిస్తున్నది. మిల్లర్ల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఈ మాత్రం దానికి టెండర్‌ప్యాడీ విధానమెందుకు? నేరుగా మిల్లర్లే ప్రభుత్వానికి చెల్లింపులు సాగిస్తే సరిపోతుంది. గతంలో ఇదే విదానం అమలులో వుండేది. అన్ని రాష్ట్రాలలోనూ ఇదే అమలు జరుగుతోంది. ఇప్పటికెనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టిపెట్టాలని మిల్లర్లు కోరుతున్నారు.