`చిత్రపురి బండారం బైట పడుతుందా!
`చిత్రపురిలో తొలిసారి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు!
`తెలంగాణ సినీ కార్మికులకు జరిగిన అన్యాయంపై ‘‘చంద్రబోస్ బుసలు కొట్టేనా’’?
`తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయం మీద ‘‘సుద్దాల’’ ‘‘కారాలుమిరాలు’’ నూరగలడా?
`తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడతారా!
`హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో సొంత ఇల్లు వున్న వారిని గుర్తించి, చిత్రపురిలో ప్లాట్స్ రద్దు చేస్తారా!
`సినీ పెద్దలు కొట్టేసిన ఫ్లాట్స్ తిరిగి స్వాధీనం చేసుకుంటారా?
`నాలుగు అసోసియేషన్లు చేసిన అక్రమాలను బైటపెడతారా?
`‘‘ఫేక్ ఐడి’’లు సృష్టించి ఫ్లాట్స్ కట్టబెట్టిన వారి వ్యవహారం తేల్చుతారా?
`ఫేక్ ఐడిలతో ఫ్లాట్స్ తీసుకున్న వారివి రద్దు చేస్తారా?
`విచ్చలవిడిగా జరిగిన అమ్మకాలపై వివరాలు వెలుగులోకి తెచ్చి చర్యలు తీసుకుంటారా?
`వారిపై కేసులు నమోదు చేసేంత ధైర్యం చేస్తారా?
`ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారా.!
`తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా!
`తెలుగు సినిమా ముసుగులో తెలంగాణ కార్మికులకు జరిగిన ద్రోహం వెలికితీస్తారా?
`జివోలను అనుసరించి ముందుకు సాగుతారా?
`తెలంగాణ సినీ కార్మికుల హక్కులు కాపాడతారా!
`తెలంగాణ సినీ కార్మికులకు రక్షణగా వుంటారా?
`న్యాయంగా తెలంగాణ కార్మికులకు చెందాల్సిన ఫ్లాట్స్ ఇప్పిస్తారా!
`ఇప్పటి వరకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తారా!
`గతంలో తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయంపై నిలదీస్తారా!
`సినీ పెద్దలను ఎదిరించేంత సాహసం చేస్తారా?
`సినీ పెద్దలను నిలదీసి తెలంగాణ కార్మికులకు న్యాయం చేస్తారా?
`1989 నుంచి జరిగిన అవకతవకలను తవ్వి తీస్తారా?
`చేతులు మారిన కోట్ల రూపాయల లెక్కలు బైటకు తీస్తారా?
`జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తారా!
`గతంలో జరిగిన తప్పులను సవరించి, తెలంగాణ కార్మికుల పక్షాన నిలుస్తారా!
`కళ్లు మూసుకుంటే కాలం గడుస్తుందని కాలయాపన చేస్తారా!
`ఇంత పెద్ద బాధ్యతను సినీ అవకాశాల కోసం వాడుకుంటారా?
`సినీ పెద్దలను నిలదీసేంత శక్తి ఈ ఇద్దరిలో వుందా?
`చిత్రపురిలో ప్రతి తెలంగాణ కార్మికుడికి ప్లాట్ అందడానికి కృషి చేయగలరా!
`తమ సినీ అవకాశాల కోసం తెలంగాణ కార్మికులను తాకట్టు పెడతారా?
`తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తారా?
`తెలంగాణ సినీ కార్మిక లోకాన్ని ఏకం చేస్తారా?
`సినీ పెద్దలు చెప్పినట్లు తలూపి, అంతా సవ్యంగానే వుందని తేల్చుతారా!
`అన్యాయాల పరంపర కొనసాగిస్తారా?
తెలంగాణ సినీ లోకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వం గొప్ప శుభవార్తను ప్రకటించింది. చిత్రపురి అనేది తెలుగు సినిమా ముసుగులో తెలంగాణ కార్మికులకు తీరని అన్యాయం చేసే వ్యవస్ధగా మారిపోయింది. మేము లేకుంటే తెలుగు సినిమానే లేదు. మేము హైదరాబాద్ రాకుంటే హైదరాబాద్‌కు ఇంతటి పేరే లేదన్నంత అహంకారాన్ని ప్రదర్శించి, ఇంత కాలం పెత్తనం చేసిన వారి ఆగడాలకు చరమగీతం పాడే సమయం వచ్చింది. నిజానికి ఇది గత పదేళ్ల క్రితమే జరగాలి. కాని సినీ లోకమంటే ఆంద్రా పెద్దలే అన్న భ్రమలో తెలంగాణ సినీ జనాన్ని విస్మరించిన గత పాలకులు చేసిన పొరపాటును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కారు సరిదిద్దే ప్రయత్నం చేసింది. తెలంగాణ సినీ లోకం ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడిరది. అది కూడా అస్తిత్వాన్ని నిలిపేందుకు వేదిక ఏర్పాటు చేసినట్లైంది. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే వున్నాయి. వాటికి సమాధానం దొరకాల్సిన అవసరం వుంది. 1994 నుంచి ఇప్పటి వరకు చిత్ర పురికి సంబంధించిన విషయంలో తెలంగాణకు చెందిన కార్మిక లోకానికి తీరని అన్యాయం జరిగిందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. తెలంగాణ కార్మికులు ఎంత గొంతు చించుకున్నా పట్టించున్నవారు లేదు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్నవారు లేదు. వారికి జరిగిన అన్యాయాన్ని ప్రశి ్నంచిన వారు లేదు. వారికి సంఫీుభావంగా ప్రకటించిన సినీ పెద్దలు ఎవరూ లేరు. తెలంగాణ కార్మికులకు ఎలా అన్యాయంచేయాలని చూసిన వారే తప్ప, వారికి కూడా న్యాయంగా దక్కాల్సిన ఇండ్లు దక్కాలని కనీసం మదిలో తలిచిన వారు కూడా లేదు. ఇవి కఠోర వాస్తవాలు. ఎవరైనా కాదని చెప్పినా అంతరాత్మను మోసం చేసినట్లే అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ కళాకారులకు జరిగిన అన్యాయం సవరించేందుకు, వారికి న్యాయం జరిగేందుకు పోగొట్టుకున్న చోటే వారికి ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు రేవంత్ సర్కారు నడుంబిగించింది. అందుకే తొలిసారి చిత్రపురి హౌజింగ్ సొసైటీ ఫైవ్ మెన్ కమిటీలో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులైన సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్‌లను నియమించింది.
ఈ ఇద్దరు సినిమాల పరంగా ఉద్దండులే. తెలుగు బాషాపాండిత్యంలో అగ్రగణ్యులే. అయితే తెలుగు సినీ పెద్దలను ఎదిరించే సత్తా ఈ ఇద్దరిలో వుందా? అన్నది కూడా తెలియాలి. గతంలో సినీ పెద్దల ఆశీస్సులు, అండదండలతోనే గత కమిటీలు తెలంగాణ కార్మికులకు తీరని అన్యాయంచేశారు. ఇప్పుడు తెలుగు సినీ పెద్దలను కాదని, వారిని ఎదిరించి, వారి ఆదేశాలను పక్కన పెడతారా? లేక తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలను అమలు చేస్తారా? అన్నది ఇప్పుడు పరిశ్రమలో జరుగుతున్న చర్చ. చిత్రపురి సొసైటీలో కమిటీ సభ్యులుగా వున్నా వారు సినీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేయాలి. లేకుంటే వారికి పాటలు రాసే అవకాశాలు రాకుండాపోతాయని కూడా సీమాంద్రకు చెందిన సినీ పెద్దలు ఇప్పటికే అంటున్నట్లు సమచారం. మా గీత దాటి వాళ్లు చిత్రపురిలో గీతలు గీసేంత ధైర్యం చేస్తారా? చూద్దామని అంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ సినీ నిర్మాతలు, దర్శకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ కొనసాగుతున్న వారిలో ఈ ఇద్దరూ వున్నారు. తెలుగు సినిమాకు చెందిన ఓ నాలుగు కుటుంబాల కనుసన్నల్లోనే చిత్ర పరిశ్రమ అంతా నడుస్తోందన్నది జగమెరిగిన సత్యమే. వారి సినిమాలకు పాటలు రాయకపోతే, ఇతర సినిమా అవకాశాలు కూడా ఈ ఇద్దరికీ రావు. చిత్రపురి వేరు, సినిమాలు వేరు అని ఈ ఇద్దరు చెప్పినా ఎవరూ నమ్మరు. కాని మేం ఇక భవిష్యత్తంతా చిత్రపురిలో తెలంగాణ కార్మికులకు న్యాయం కోసమే త్యాగం చేస్తామని చెప్పగలరా? ఎందుకంటే చిత్రపురి పేరుతో ఎంత దోపిడీ జరిగిందో అందరికీ తెలుసు. చిత్రపురిలో జరిగిన అక్రమాలపై ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియంది కాదు. ఎవరికి వారు తమ పెద్దనం వెలగబెడుతూ, తమ అనుచరుల కోసం, తమ ఆదాయంకోసం ఎలా అడ్డదారులు తొక్కారో వింటూనే వున్నాం. దానికి తోడు తెలంగాణ సినీ కార్మికులకు పనిగట్టుకొని, పగపట్టినట్లు ఎలా అన్యాయానికి గురి చేశారో చూస్తూనే వున్నాం. వాటిని సరి చేయగలిగేంత శక్తి మాకు వుందని ఈ ఇద్దరూ ప్రకటించగలరా? అన్నది కూడా వేచి చూడాలి.
తెలంగాణ కార్మికులకు న్యాయం చేయాలని చిత్తశుద్దితో పనిచేస్తే మాత్రం ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన వారౌతారు. తెలంగాణ సినీ కార్మికుల నుంచి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటిని ముందు ఇద్దరు సభ్యులు అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. ఇప్పటికైనా తెలంగాణ సినిమా మొదలౌతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నవారి ఆశలు కూడా తీరేలా ఈ ఇద్దరి పని తనం కూడా వుండాలంటున్నారు. తెలంగాణ సినీ కార్మికుల సొంత ఇంటి కల నెరవేరాలని కోరుకుంటున్నారు. తెలంగాణకు చెందిన సినీ నటుడు స్వర్గీయ. ప్రభాకర్‌రెడ్డి ఆశయాలు ఇంత కాలానికైనా నెరవేరుతాయని ఆశిస్తున్నారు. ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే తెలంగాణ కార్మికులకు న్యాయం జరగాలి. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. వారి సొంతింటి కల నెరవేరాలి. ఈ ఇద్దరు చూపే చొరవ మీద కూడా కార్మికుల ఆశలు ఆధారపడి వుంటాయి. అందుకే ఆది నుంచి చిత్రపురిలో జరిగిన అవకతవకలను వెలికి తీయాలి. జరిగిన అక్రమాలను వెలుగులోకి తేవాలి. తెలంగాణ సినీ అస్ధిత్వం నిలబడాలి. ఎందుకంటే చిత్రపురిలో ఇప్పటి వరకు జరిగిన కేటాంపుల్లో సుమారు 90శాతానికి పైగా అనర్హులే లబ్ధిదారులయ్యారని తెలంగాణ సినీ సమాజం లెక్కలతో సహా వెల్లడిస్తోంది. చిత్రపురిలో పాగా వేసిన నాలుగు అసోసియేషన్లు చేసిన దుర్మార్గాల మూలంగా అసలైన కొంత మంది ఆంద్రా కళాకారులకు కూడా అన్యాయం జరిగింది. వారికి కూడా న్యాయం జరగాలి. ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ సినీ కార్మికులకు పూర్తి న్యాయం చేకూరాలి.
సినీ పెద్దల ముసుగులో చిత్రపురిలో ఎంతో మంది ప్లాట్స్ కొట్టేశారు. కార్మికుల స్ధానంలో వారు పాగా వేశారు. ఒక్కొక్కరు తమ అనుచరుల పేరుతో పదలు సంఖ్యలో ప్లాట్స్ కొనుగోలు చేశారు. పైపెచ్చు ఫేక్ ఐడెంటిటీ కార్డులు తయారు చేసి, అసలు సినిమాకు సంబంధం లేని వారికి కూడాకట్టబెట్టారు. తర్వాత వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. ఇప్పుడు చిత్రపురిలో వుంటున్న సినీ కార్మికులు కేవలం పది శాతానికి మించరు. ఇలా సినిమాకు సంబంధం లేని వారికి ప్లాట్స్ కట్టబెట్టిన వారిని సంగతి తేలుస్తారా? అంతే కాకుండా జీవో నెంబర్. 658 ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనీసం వంద జగాల స్ధలం వున్నా, ఎలాంటి సొంత ఇల్లు వున్నవారైనా సరే చిత్రపురిలో ప్లాట్స్ తీసుకునేందుకు అనర్హులు. కాని ఆ జీవోను తుంగలో తొక్కి, ఏకంగా విల్లాలను తలపించేలా రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నవారు 220 మంది వున్నారు. సుద్దాల అశోక్ తేజా కూడా ఈ జీవోకు విరుద్దంగానే చిత్రపురిలో ప్లాట్ తీసుకున్నారన్న వార్తలున్నాయి. అవి నిజమా? అబద్దామా? కూడా సుద్దాల తెలియజేయాలి. అప్పుడు తప్పు చేసిన ఇతరులు కూడా వెలుగులోకి వస్తారు. వారిని నుంచి ప్లాట్స్ తిరిగి స్వాదీనం చేసుకునే అవకాశం వుంటుంది. లేకుంటే అలా అర్హత లేని వారికి ప్లాట్స్ తీసుకున్నవారు కూడా సుద్దాల వైపు వేలు చూపించే అవకాశం ఎదురౌతుంది. ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకం కూడా వమ్ము అవుతుంది. గత రెండేళ్ల క్రితమే సుద్దాల అశోక్ తేజ చిత్రపురిలో ఇల్లు తీసుకున్నాడన్న ప్రచారం వుంది. అది కూడా అక్రమమే అని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తారా? సినీ అవకాశాల కోసం వారు కూడా సినీ పెద్దలకు వంత పాడుతారా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పతన్నమౌతున్నాయి. వాటికి కూడా సమాధానం చెప్పగలగాలి. సినీ పెద్దలను ఎదిరించేంత సాహసం చేస్తే తప్ప ప్రభుత్వం వారికి అప్పగించిన బాధ్యతను పూర్తి చేసే అవకాశం వుంటుంది. నిజంగా ప్రభుత్వ ఆశయాన్ని నిలబెడితే భవిష్యత్తు తెలంగాణ సినిమాకు దారులు వేసిన వారౌతారు. తెలంగాణ సినిమాను నిలబెట్టిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. తెలంగాణ కార్మిక లోకం దృష్టిలో దేవుళ్లుగా కొలువబడుతారు. లేకుంటే ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్‌ది బెస్ట్.