రైతులకు చుక్కలు చూపించిన ధరణి
భౌతిక రికార్డులకు డిజిటల్ రికార్డులకు పొంతనలేదు
చిన్న పొరపాటుకు కూడా కలెక్టర్‌నే కలవాలంటే ఎట్లా?
పనులు వదులుకొని రైతులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి
ప్రభుత్వ నిర్వాకానికి లబోదిబో మంటున్న రైతులు
రేవంత్ సర్కార్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు
కొత్త చట్టం అమల్లోకి వస్తే బాధలనుంచి గట్టెక్కుతామన్న ఆశ
హైదరాబాద్,నేటిధాత్రి:
కొత్త రెవెన్యూ చట్టం భూభారతి (ఆర్వోఆర్‌ా2024) బిల్లు గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వ స్తుంది. డిసెంబర్ 18న శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్వోఆర్‌ా2024 బిల్లును ప్రవేశపెట్టడం, 20వ తేదీన శాసనసభలో, 21న శాసన మండలిలో చర్చలు జరిగిన తర్వాత బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను రెవెన్యూశాఖ అధికార్లు పూర్తిచేశారు. ఇక సాగుభూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల సేవల పోర్టల్ ధరణి…నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్ఫ ర్మేటిక్ సెంటర్ చేతికి వచ్చాయి. జనవరి 1వ తేదీన ఈ పోర్టల్‌ను సంస్థ పూర్తిస్థాయిలో నిర్వ హించింది. గత ప్రభుత్వ హయాంలో 2020 నవంబర్ 2వ తేదీనుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ను ఐఎఫ్‌ఎల్‌ఎస్, దాని అనుబంధ సంస్థ టెర్రా ఐఏసీఎస్‌లు నిర్వహిస్తూ వచ్చాయి. ఈ విదేశీ సంస్థలను తొలగించి స్వదేశీ నిర్వహణలోకి ఈ పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. ఈమేరకు నవంబర్ నెలాఖరుతో టెర్రా ఐఏసీఎస్‌తో ఒప్పందా న్ని ముగించింది. ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో ప్ర భుత్వం మార్పులు చేసింది. దీనికి సంబంధించిన లోగో మరియు ఇతర వివరాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత లోగో ఖరారు చేసి, ప్రారంభించే తేదీని నిర్ణయిస్తారు.
తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ యాక్ట్`2020 ప్రకారం ‘ధరణి’ పేరుతో ఆన్‌లైన్ రికార్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ధరణిపై భూయజమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పట్టేదార్ పాస్‌పుస్తకాలు అందకపోవడం లేదా రిక ర్డుల్లో తమ భూములు, పేర్ల వివరాలు తప్పుగా నమోదు కావడంతో రైతులు గగ్గోలు పెట్టారు. ఈ పొరపాట్ల వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మరి ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా మార్చివేస్తామని, సమస్యలను పరి ష్కరిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ ప్రభుత్వం ధరణి పోర్టల్ వల్ల ఏర్పడిన సమస్యలపై ని యమించిన సబ్`కమిటీ మొత్తం 123 సమస్యలనుగుర్తించింది. భూమి కొనుగోలుదార్లు, రైతులకు నిద్రలేని రాత్రులనే ధరణి మిగిల్చింది. దిగువ స్థాయిలో అప్పిలేట్ అథారిటీ లేకపోవడం మరిన్ని సమస్యలు సృష్టించింది. నిజానికి ఈ 123 సమస్యల్లో సింహభాగం మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మొత్తం బాధ్యతను కలెక్టర్‌కే అ ప్పగించడంతో చిన్నా, పెద్దా సమస్యలన్నీ పెండిరగ్‌లో పడిపోయాయి. చిన్న సమస్య పరిష్కారానికి కూడా కలెక్టర్ వద్దకే పరిగెత్తాల్సి రావడం గ్రామాల్లోని చిన్న,సన్నకారు రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ధరణిపోర్టల్‌లో వచ్చిన తప్పులు లేదా పొరపాట్లు లేదా ఇతరత్రా చిన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా తమకు అధికారం లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురైనమాట వాస్తవం. అదీ కాకుండా పాత పద్ధతే వుంటే ఈ గొడవ వుండేది కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆవిధంగా చిన్న పొరపాట్లకు సంబంధించి వేలాది కేసులు అట్లా పెండిరగ్‌లో పడిపోయాయి. అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియని పరిస్థితి! ఇక మ్యుటేషన్ విషయానికి వస్తే దాన్ని దిగువ స్థాయి అధికార్లకు వదిలేస్తే సరిపోయేది. ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం కకపోతే వారికి ఎగువన రెవెన్యూ డివిజన్ స్థాయి లో మరొక లేయర్ అధికార్లకు సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించాల్సింది. ఇక నాలాల ఆక్రమణల విషయం కూడా స్థానిక అధికార్ల స్థాయిలోనే పరిష్కరించవచ్చు. ఆ విధానమే లేకుండా మొత్తం ఏకబిగిన కలెక్టర్, సీసీఎల్‌లపైనే మొత్తం భారం పెట్టడంతో ప్రతి చిన్న సమస్య పీటముడి పడిరది. అప్పుడు రైతులు తమ వ్యవసాయపనులు ఇతర కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలా, ప్రభుత్వం చేసిన నిర్వాకానికి కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగాలా? అన్న పరిస్థితి ఏర్పడిరది.
ధరణి సమస్యలను గుర్తించడానికి ఒక స్వచ్ఛంద సేవాసంస్థ పైలెట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పది గ్రామాల్లో సర్వే చేసింది. ఈ గ్రామాల్లో 2114 మంది రైతులు ధరణి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. అంతేకాదు 4465 ఎకరాలు సర్వే నెంబర్లకు కూడా ధరణివల్ల లేనిపోని సమస్యలు వచ్చినట్టు స్పష్టమైంది. ‘లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెంన్స్ టు ఫార్మర్స్’ (లీఫ్) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ తాము సేకరించిన సమస్యాత్మక సమాచారాన్ని రెవెన్యూ అధికార్లకు గత సెప్టెంబర్ నెలలో అందజేసింది. ఈ సంస్థ తొలి దశలో ఆయా గ్రామాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, రెండో దశలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి రెవెన్యూ అధికార్ల దృష్టికి తీసుకెళ్లడం, మూడో దశలో రైతులకు సమస్య పరిష్కారంలో సహకరించడం అనే రీతిలో ఈ సంస్థ పనిచేసింది.
భూముల సమగ్ర సర్వే చేపట్టకుండానే ధరణి పోర్టల్‌లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేస్తూ వచ్చారని, ఫలితంగా చాలామంది భూయజమానులైన రైతుల పేర్లు పోర్టల్‌లో కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనివల్ల రైతుబంధుకు అర్హులైన రైతులకు రైతుబంధు మొ త్తం వారి ఖాతాల్లో జమకాలేదు. మరికొంతమంది రైతులు ధరణి రాకముందే తమ భూములను తనఖాకు పెట్టిన సందర్భాలున్నాయి. వీరు రుణాలు చెల్లించిన తర్వాత ధరణి పోర్టల్‌లోని పొర పాట్ల కారణంగా తమకు పాస్‌పుస్తకాలు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు భూభారతి పోర్టల్‌లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
నిజానికి గత మూడేళ్ల కాలంలో ధరణి పోర్టల్ వల్ల అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. బౌతికంగా వున్న రికార్డులకు, డిజిటల్ రూపంలో ధరణిలో పేర్కొన్న రికార్డులకు అసలు పొంతనే లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూ యజమానులు అయోమయంలో పడటమే కాదు, తమ సమస్యను ఎవరికి చెప్పుకో వాలో కూడా తెలియని పరిస్థితికి లోనయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ము కోవడానికి వీల్లేకుండా పోయింది. సమస్యను నియమిత కాలావ ధిలో పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఫలితంగా రెవెన్యూ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ధరణి పుణ్యమాని కోర్టుల్లో మూ లుగుతున్నాయి. నిరుపేద రైతులు తమ సమస్యలను వినిపించుకునే అవకాశమే లేకుండా పో యింది. ఈ నేపథ్యంలోనే ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్తచట్టాన్ని రూపొందించింది. వ్యవసాయేతర భూ ములను కూడా ఈ చట్ట పరిధిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడమే కాదు, సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం కూడా దీన్ని ముఖ్యోద్దేశం. ప్రస్తుత ప్రభుత్వం భూములను రీసర్వే చేయడం ద్వారా ధరణిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి ఉద్యుక్తమైంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏవిధంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.