తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి:
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కెర్ల సహదేవ్ తల్లి కక్కర్ల కాంతమ్మ ఇటీవల మరణించడంతో సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మామిడాల తిరుపతిరెడ్డి,గంజి విజయపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ జాటోత్ హమ్యా నాయక్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ సర్పంచ్ తమ్మడపల్లి సంపత్,నాయకులు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.