జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటా..

# నేను మళ్లీవస్తా .. మిగిలిన పనులు పూర్తి చేస్తా..
# నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట , నేటిధాత్రి :

నిత్యం ప్రజల కోసం సేవలు చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు నిత్యం అండగా ఉంటానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణ పాకాల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సమీక్ష సమావేశం అధ్యక్షుడు పోడేటి అశోక్ అధ్యక్షతన పట్టణంలోని ఐఎంఏ హాల్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలు,చిన్న స్థాయి నుండి వచ్చిన జర్నలిస్టులు వార్త సేకరణ కోసం ఎన్నో ఒడి దోడుకులు ఇబ్బందులను ఎదుర్కొని పనిచేస్తున్న సాధకబాధకాలు నాకు తెలుసని ప్రతి జర్నలిస్టు కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించానని ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న జర్నలిస్టుల వర్గానికి ఉచితంగా స్థలం డబుల్ బెడ్ రూముల ఇండ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే చేసిన అభివృద్ధితోపాటు ఇంకా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నాయని నేను వస్తేనే ఆ అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని తెలుపుతూ మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు. నేను చేసిన అభివృద్ధి పట్ల చర్చ జరుగుతున్నదని మళ్లీ ఎమ్మెల్యేగా నేనే వస్తా మిగిలిన పనులు పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి, జర్నలిస్టులు కిరణ్ చౌదరి, రడం శ్రీనివాస్ గౌడ్, కుండే సురేష్,ఆనందరావు, కారుబోతుల విజయ్ కుమార్ గౌడ్, గోడిశాల సదానందం గౌడ్,ఉగ్గిడి శివన్న, ఎర్రబెల్లి విద్యాసాగర్,మోహన్,సత్యనారాయణ,కొడాటి గోపాలకృష్ణ,రాజు,పోనుగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!