
– మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నిరాశేన…..
– అసంతృప్తిలో మదన్ రెడ్డి అభిమానులు….
కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలు ముల మదన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ విషయంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి , మదన్ రెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డ విషయం అందరికి తెలిసిందే. చివరి నిమిషంలో బి ఆర్ ఎస్ పార్టీ అధిష్టానం నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత రెడ్డి పేరు ఖరారు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు గులాబీ అధినేత కేసిఆర్ తో మాట్లాడి మదన్ రెడ్డికి వచ్చే లోకసభ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని మదన్ రెడ్డి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మదన్ రెడ్డికి ఇవ్వకుంటే నర్సాపూర్ నియోజకవర్గం అభిమానులు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నాలు చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వకుంటే ఆయన అభిమానులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.
* ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులు…
మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ సీటు ఖరారు అవుతుందన్న ఆలోచనలు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మెదక్ ఎంపీ సీటు అభ్యర్థి ఖరారుపై మదన్ రెడ్డి అభిమానులకు నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది.