సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా అడ్డుకుంటుందా?

గతంలో నీటిని ఆయుధంగా వాడుకున్న చరిత్ర చైనాది

నీటి వాడకంపై అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయని చైనా

నీటి వాడకంపై దానికి పూర్తిస్వేచ్ఛ

దౌత్యం తప్ప మరో పరిష్కారం లేదు

కొన్ని పరిమితుల్లో ఈ నదుల నీటిని ఆపగలదు

అయితే భౌగోళిక స్వరూపం చైనాకు పెద్దగా అనుకూలించదు

డెస్క్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ దాడుల తర్వాత మనదేశం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవరకు ఈ ఒప్పందంపై మాట్లాడే ప్రసక్తే లేదని భారత్‌ తెగేసి చెప్పింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిరది. సింధ్‌లో నీటికోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇంటిపై దాడిచేశారు. తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసుల్ని చితకబాదారు. సింధ్‌ రాష్ట్రానికి నీరు రాకుండా, పంజాబ్‌ అడ్డుకుంటుండటం సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇదిలావుండగా ‘మాకు సింధూజలాలను ఆపితే భారత్‌ ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ’ పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వారిలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. గతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్య లు చేయడం గమనార్హం. ఇటువంటి దుస్థితికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ పాలకుల వైఖరే! పహల్గామ్‌లో ఉగ్ర దాడులకు పాల్పడి వుండకపోతే ఈ దుస్థితి ఏర్పడివుండేది కాదు. పాక్‌ను శిక్షించడానికి భారత్‌సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కూడా మనదేశాన్ని బెదిరిస్తున్నది తప్ప, ఉగ్రవాదులను శిక్షిస్తామని కాని లేదా ఉగ్రవాదం నుంచి వైదొలగుతామని గాని చెప్ప డంలేదు. ఎందుకంటే అదొక ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం. అటువంటి ధూర్త దేశానికి ఈ శిక్ష సరైందే! ఇక మరో దౌర్భాగ్యదేశం చైనా. ఎంతసేపూ ఎప్పుడో శతాబ్దాలనాటి లెక్కలు చెబుతూ, ఇతర దేశాల భూభాగాలన్నీ తమవేనని వాదించే ఒక మూర్ఖ దేశం! నిరంతర కాలగమనంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటికి అనుగుణంగా మనల్ని మనం మలచుకొని జీవించడమే ఉత్తమ మార్గం! దీన్ని వదిలేసి ఇతరదేశాల భూభాగాలను తమవేనంటూ కాలగతిలో కలిసిపోయిన చరిత్రను చూపుతూ వర్తమానాన్ని అశాంతిమయం చేసుకుంటున్న దేశం ఒక్క చైనా మాత్రమే! దాని పాలకుల సిద్ధాంతాలు అటువంటివి!!

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సింధూనది ఒప్పందాన్ని మనదేశం నిలిపేయడం వల్ల, పాకి స్తాన్‌లోకి సింధూనది దాని ఉపనదుల ప్రవాహం నిలిచిపోయింది. నిజానికి ఈ సింధూ, సట్లెజ్‌ నదుల పుట్టుక స్థానాలు చైనా ఆధీనంలోని టిబెట్‌లో వుండటంతో ఈ సమస్య ఒక సంక్లిష్ట కో ణంలోకి మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధూనదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే సట్లెజ్‌, బీయాస్‌, రావి నదుల నీటిని మనం వాడుకోవచ్చు. అదే పశ్చిమాన ప్రవహించే సింధూ, జీలం, చీనాబ్‌ నదుల నీటిని పాక్‌ వినియోగించుకోవాలి. పహల్గామ్‌ దాడితో ఈ ఒప్పందాన్ని మనదేశం నిలిపేసింది. ఈ చర్యవల్ల పాకిస్తాన్‌కు చుక్కనీరు పోవడంలేదు. ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లో జన్మించిన సింధూ, సట్లెజ్‌ నదీ ప్రవాహాలను మనదేశంలోకి రాకుండా చైనా అడ్డుకునే అవకాశముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు ధూర్త దేశాల మధ్య స్నేహం ‘తేనెకంటే తియ్యనైనది’ కాబట్టి!

ఈ నదుల పుట్టుక స్థానాలు

మానససరోవరం సరస్సుకు సమీపంలోని సెంగ్‌ ఖబాబ్‌ హిమానీనదం సింధూనదికి జన్మస్థానం.ఇది కైలాస పర్వతానికి కూడా దగ్గరిగానే వుంటుంది. ఐదువేల మీటర్ల ఎత్తులో జన్మించిన ఈ నది టిబెట్‌ గుండా ప్రవహించి మనదేశంలోని లద్దాఖ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జన్‌స్కర్‌, సయోక్‌ఉపనదులు ఇందులో కలుస్తాయి. ఆ తర్వాత మనదేశంగుండా ప్రవహించి, పాక్‌లోకి ప్రవేశి స్తుంది. ఆవిధంగా సుమారు 3180 కిలోమీటర్ల దూరం ప్రవహించిన సింధూనది చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన సింధూ నాగరికత ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే పరిఢవిల్లింది. ప్రస్తుతం ఈ నది భారత్‌, పాకిస్తాన్‌లకు జీవనాడి వంటిది. ఎన్నో జలవిద్యుత్‌ కేంద్రాలు దీనిపై నిర్మించారు. కొన్ని లక్షల ఎకరాల సాగుకు ఈ నది నీరే ఆధారం. 

ఇక సట్లెజ్‌ నది, రాక్షస్‌తాల్‌కు సమీపంలోని లంగ్‌ఛన్‌ ఖబాబ్‌ హిమానీనదంలో పుడుతుంది. 4600 నుంచి 5వేల మీటర్ల ఎత్తున వుండే ఈ గ్లేసియర్‌ నుంచి టిబెట్‌ గుండా ప్రవహిస్తుంది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిప్కిలా పాస్‌ గుండా ప్రవేశించడానికి ముందు ఈ నదిలో స్పిటీ ఉపనది ఇందులో కలుస్తుంది. తర్వాత ఇది కిన్నర్‌ కైలాష్‌ ప్రాంతం గుండా ప్రవహించి పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రంలోనే భక్రా ప్రాజెక్టును మనదేశం నిర్మించింది. ఈ ప్రాజ ెక్టుకు ప్రదాన నీటివనరు సట్లెజ్‌! చివరకు పాక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇది సింధూనదిలో కలుస్తుంది. మొత్తం 1450 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పంజాబ్‌కు గుండె వంటిదని చెప్పడంలో సందేహం లేదు. 

ఈ నదుల ప్రవాహాన్ని చైనా ఆపగలదా?

సాంకేతికంగా చెప్పాలంటే ఈ రెండు నదుల నీటిని చైనా ఆపగలదు. సెంగే త్సాంగ్‌పో, నగరి షికాన్వే జలవిద్యుత్‌ కేంద్రాలను, సింధూనది జన్మస్థానం వద్ద నిర్మించింది. ఇక సట్లెజ్‌ నదిపై జడా గోర్జ్‌ బ్యారేజ్‌ను కూడా నిర్మించింది. ఈ నిర్మాణాల ద్వారా చైనా మనదేశంలోకి ఈ రెండు నదుల నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు. ఇప్పటికే చైనా తమదేశంలోని నదులపై ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. ముఖ్యంగా ‘సౌత్‌`నార్త్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు’ ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ఇంకా చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకింద నదీ జాలాలను తమదేశంలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే ఇప్పటివరకు సింధు, సట్లెజ్‌ నదులపై ఇటువంటి నీటి తరలింపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 2017లో బ్రహ్మపుత్రానదికి సంబంధించిన వరద సమాచారాన్ని భారత్‌ అందించని రీతిలో, ఈ నదుల ప్రవాహ సమాచారాన్ని మనదేశంతో పం చుకోకపోవచ్చు. ఈ రెండు నదుల విషయంలో ఇప్పటివరకు ఆటువంటి చర్యకు పూను కోలేదు. నీటిని భౌగోళిక రాజకీయ ఉపకరణంగా గతంలో చైనా కొన్నిసార్లు మనదేశంపై ప్రయోగించింది. 2016లో బ్రహ్మపుత్ర ఉపనది షియాకు ప్రవాహాన్ని నిలిపేసి, మనదేశానికి ఒక హెచ్చరికను పంపింది. 2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత ఈ నదినీటి ప్రవాహాన్ని నిలిపేసింది. పలితంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడిరది. గల్వాన్‌ నది సింధూనదికి ఉపనది. 2004లో పరెచునదిపై ఒక కృత్రిమ సరస్సును సృష్టించింది. పరెచు నది సట్లెజ్‌కు ఉపనది. ఈ కృత్రిమసరస్సు ను ‘నీటిబాంబు’గా చైనా ఉపయోగించవచ్చునని భయాందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. అ యితే ఇక్కడి నీటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత్‌కు అందిస్తూ పరిస్థితి చేజారిపోకుండా చైనా జాగ్రత్తపడటం విశేషం!

ప్రస్తుతం భారత్‌ సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన నేపథ్యంలో, ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లోని సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా నియంత్రించే అవకాశముందని కొందరు నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో తమదేశంలో పెరుగుతున్న నీరు, విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఈ నదీ జలాలను ఆయా ప్రాంతాలకు తరలించకూడదనేంలేదని కూడా ఈ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్ని పరిమితుల్లో మాత్రమే చేయగలదు

ఈ నదుల నీటిని భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలంటే చైనాకు కొన్ని పరిమితులున్నాయి. సింధు, సట్లెజ్‌ నదుల నీటిలో వరుసగా 10%`15% మరియు 20% మాత్రమే టిబెట్‌లో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం భూకంపాలకు ఆలవాలం కనుక, పెద్దఎత్తున డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది. అంతేకాకుండా నీటిని ఆవిధంగా నిలిపేయడం ‘హిల్సింకి’ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. చైనా తీవ్ర విమర్శలకు గురికాకతప్పదు. అయితే యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌కోర్సెస్‌ కన్వెన్షన్‌ను ఇప్పటివరకు చైనా అంగీక రించలేదు. చైనా తన నీటివనరులపై సార్వభౌమాధికారం విషయంలో ఎంతమాత్రం పట్టు సడ లించడంలేదు. దీన్ని ఆమోదించనంతవరకు నీటి ప్రవాహానికి దిగువన ఉండే దేశాలకు చట్టబ ద్ధంగా అడిగే హక్కు వుండదు. అప్పుడు దౌత్యం, ప్రపంచదేశాలు కలుగజేసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతానికి భారత్‌ చైనాల మధ్య 2002 మరియు 2018 సంవత్సరాల్లో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదీ ప్రవాహాలకు సంబంధించిన స మాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ఒప్పందాల కాలపరిమితి 2023తో ముగిసినా, చైనా సమాచారాన్ని పంచుకోవడాన్ని మాత్రం ఇప్పటివరకు ఆపలేదు. అదీకాకుండా రెండు దేశాల మధ్య ప్రత్యేకించి నదీజలాల ఒప్పందాలేవీ లేనందువల్ల, తమదేశంలో ప్రవహించే నదుల విషయంలో చైనా తనకు అనుకూలంగా పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవ కాశాలే నూటికి నూరుశాతం వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!