జమిలి సాధ్యమే!నా!?

https://epaper.netidhatri.com/view/390/netidhathri-e-paper-28th-september-2024%09

బిజేపి కల నెరవేరేనా!

బిజేపి రాజకీయ వ్యూహం ఫలించేనా!

ఇతర రాజకీయ పార్టీలు కనుమరుగు జరుగునా!

కేంద్రం ఆధిపత్యం కోసం ఆరాటమా?

రాష్ట్రాల హక్కులను కాలరాయడమా?

సమాఖ్య స్పూర్తికి విఘాతం కాదా!

పదేళ్లుగా ఎందుకు చేయలేదు!

బలహీనపడుతున్న దశలో బిజేపి ఎందుకు ముందుకు తీసుకొస్తున్నట్లు!

దేశంలో జరుగుతున్న అతి ప్రదానమైన అంశాలలో జమిలి ఎన్నికలు, తిరుపతి లడ్డూ. ఈ రెండు విషయాలు దేశ రాజకీయ వ్యవస్ధను, సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. తిరుపతి లడ్డూ అన్నది ఏపి రాష్ట్రానికి పరమితన చర్చగా మారినా, జమిలి ఎన్నికలు మాత్రం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. గత పది సంవత్సరాలుగా చెబుతూ వస్తున్న బిజేపి, కేంద్ర ప్రభుత్వం ఎలాగైన జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా వుందనే తెలుస్తోంది. గత పది సంవత్సరాలుగా దేశంలో చర్చకు తెరతీసి ఇంత కాలం బిజేపి ఎందుకు ఆగిందన్నదానిపై ఎవరి వద్ద సమాదానం లేదు. కాని ఇప్పుడు మాత్రం జమిలీ ఎన్నికలు తెరమీదకు తెచ్చి కేంద్ర ప్రభుత్వం తేనెతుట్టెను కదిపిందనే చెప్పాలి. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక కూడా చాల రోజు క్రితమే ఇచ్చారు. కాని గత ఎన్నికల ముందు జమిలీ ప్రస్తావన బిజేపి తేలేదు. వచ్చే ఎన్నికలకు జమిలీ ఎన్నికలు నిర్వహ్తిమని ఎక్కడా చెప్పలేదు. కాని మూడోసారి కేంద్రంలో బిజేపి ప్రభుత్వం కొలువు తీరిన వందరోజులకు ముందుకు ఈ ప్రకటన చేశారు. వెంటనే కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం కూడా తెలిపారు. కాని జమిలీ ముందున్న సవాళ్లు ఏమిటన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. బిజేపి అనుకోగానే, కేంద్రం నిర్ణయం చేసినంత మత్రాన జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం వుందా? అసలు రాష్ట్రాల అభిప్రాయం అవసరంలేదా? వచ్చేపార్లమెంటు సమావేశాలలో కేంద్రం జమిలీ ఎన్నికల బిల్లు పాస్‌ చేసుకుంటే సరిపోతుందా? అందుకు మూడొంతుల రెండు మెజార్టీ అవసరం లేదా? సాధారణ మెజాఈ్ట చాలా? అన్న అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సాంకేతికపరమైన అంశాలను ఇప్పటి వరకు వెల్లడిరచలేదు. కాని మేధావి వర్గాలలో మాత్రం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ అనగానే సరిపోతుందా? సాద్యా సాధ్యాలపై చర్చలు అవసరం లేదా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమౌతున్నాయి. కేంద్రం జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర క్యాబినేట్‌ తీర్మాణానికి ముందే కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికీ జమిలీ మీద అదే అభిప్రాయానికి కట్టుబడి వుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఇటీవలే అధికారంలోకి వచ్చాయి. అందలో తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటివి వున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో జమిలీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తామంటే దేశం ఒప్పుకుంటుందా? ఆయా రాష్ట్రాలు వ్యతిరేకతను తెలియజేయకుండా వుంటాయా? ఇదిలా వుంటే తాజాగా హర్యానా, జమ్ము కాశ్మీర్‌ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. నవంబర్‌ నెలలో మహరాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాలలోనూ ఎన్నికలు జరగాల్సి వుంది. నిజంగా జమిలీ ఎన్నికలు త్వరలో తీసుకొస్తమనుకుంటే కేంద్రం ఆయా రాష్ట్రాల ఎన్నికలను ఎందుకు వాయిదా వేయలేదు. దానిపై కూడా కేంద్రం సమాదానం చెప్పాలి. కేంద్రం ఒక వేళ జమిలీ ఎన్నికలు తేవాలనుకున్నా, 2021లో జరగాలిసన జనాభా లెక్కలు కరోనా మూలంగా ఆగిపోయాయి. ఆ లెక్కలను ఆదారం చేసుకొని 2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి వుంది. దాంతో పార్లమెంటు స్ధానాలు పెంచాల్సివస్తుంది. పైగా రాష్ట్రాలలోనూ అసెంబ్లీ స్ధానాల పెంపు కూడా అనివార్యమౌతుంది. విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా 2026లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో కూడా అసెంబ్లీ స్దానాలు పెరుగుతాయి. కాకపోతే నియోజకవర్గాల పునర్విభన వల్ల దక్షిణాదిన పార్లమెంటు సీట్లు తగ్గుతాయని తెలుస్తోంది. దక్షిణాదిలో జనాభా నియంత్రణ బాగా జరిగింది. కాని ఉత్తరాధిన జరగలేదు. దాంతోఉత్తరాదిన జనాభా విపరీతంగా పెరిగింది. అందుకు అనుగుణంగా కూడా పార్లమెంటుస్దానాలు పెరిగే అవకావం వుంది. అవి బిజేపికి అనుకూలంగా మారే అవకాశం వుందని బిజేపి ఆలోచన. మన దేశం రాష్ట్రాల సమాఖ్య అని భారత రాజ్యాంగం 2 అధికరణ స్పష్టంగా చెబుతోంది. కేంద్రం అన్నది ఒక మిధ్య అనేది రాష్ట్రాల అభిప్రాయం. రాష్ట్రాల ప్రభుత్వాల విధివిధానాలు వేరు. కేంద్రం విధివిధానాలు వేరు. వాటిని రెండిరటీని కలిసి, సాగేదే సమాఖ్య రాజ్యాంగ వ్యవస్ధ. దేశం విషయంలో ఒకే దేశం..ఒకే ఎన్నిక అన్నది మంచిదే. ఆహ్వానించాల్సిన అంశమే. కాని సమాఖ్య స్పూర్తిని అది దెబ్బతీస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మన దేశంలో ఏక కేంద్ర పాలన ఒక్కటే లేదు. రాష్ట్రాల పాలనతో పాటు కేంద్ర పాలన సాగాలి. కాని రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర పెత్తనాన్ని ఇతర రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? అన్నది ఒక అంశమైతే…బిజేపి కల నెరవేరుతుందా? అన్నది కూడా ఇక్కడ మడిపడి వుంది. సహజంగా జాతీయ రాజకీయాలపై వుండే ఆలోచన, రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో భిన్న అభిప్రాయాలు వుంటాయి. ప్రజలు ఒకే సారి జాతీయ,రాష్ట్రాల ఎన్నికలు ఏక కాలంలో వచ్చినంత మాత్రాన ఒకే పార్టీకి పట్టం కడతారన్నది ఆశించడంలో తప్పు లేదు. కాని బిజేపి అత్యాశపడుతుందన్నది ఇతర పార్టీల వాదన. ఏది ఏమైనా బిజేపి గత పదేళ్లుగా చెబుతున్నట్టు జమిలి ఎన్నికలు తెచ్చేందుకు అవసరమైన తొలి అడుగుపడిరది. గతంలోనే మాజీ రాష్ట్రపతి రాంనాద్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమటి కూడా వేశారు. ఆ కమిటి నివేదిక సమర్పించారు. దాంతోపాటు కేంద్ర క్యాబినేట్‌ జమిలి ఎన్నికల అంశాన్ని ఆమోదించింది. కాని ఇది చట్టరూపంగా మారాలి. పార్లమెంటు ఆమోదం పొందాలి. మనదేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటి ఆమోదం అవసరం లేదనుకున్నప్పుడు పార్లమెంటులో మూడొంతుల మెజార్టీతో బిల్లు రావాలి. అది సాధ్యమా? కాదా?అన్నది ఇప్పుడే చెప్పే అంశం కాకపోయినా, జమిలి ఎన్నికలు సాధ్యమా? కాదా? అన్నది మాత్రం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. అసలు జమిలి ఎన్నికల వల్ల బిజేపికి కలిగే లాభమేమిటన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం వుంది. గతంలో దేశంలో జమిలీ ఎన్నికలు జరగలేదా? జరిగాయి. కాని అవి ఇంత కాలం సాగలేదు. 1952 నుంచి 1967 వరకు దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. కాని తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు మొదలైంది. రాజకీయ పార్టీల ప్రాభవం పెరిగింది. ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతూ వచ్చింది. 1967 వరకు కాంగ్రెస్‌కు ఎదురులేకుండాపోయింది. బిజేపి అప్పటికి కేంద్రంలో లేదు. జనతా పార్టీగా వున్నప్పటికీ దాని ప్రభావం తర్వాత కాలంలో కనుమరుగైంది. అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీయే గెలుస్తూ వచ్చింది. ఒకేసారి ఎన్నికలు జరగుతూ వచ్చాయి. ఎప్పుడైతే కాంగ్రెస్‌ పతనం జాతీయ స్ధాయిలో మొదలైందో అప్పటి నుంచి జమిలి ఎన్నికలకు స్ధానం లేకుండాపోయింది. కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఒకే పార్టీకి దేశ ప్రజలంతా గుండుగత్తగా ఓట్లేస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ స్ధాయిలో కాంగ్రెస్‌ తర్వాత ఎక్కువ స్ధానాలు గెల్చుకొని కేంద్రంలో ప్రతిపక్ష హదా పొందింది. కేంద్ర పెత్తనంతో విసిగి పోయిన ప్రజలను ప్రాంతీయ పార్టీలను ఆదరించడం మొదలు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీల హవా క్రమంతా కనుమరుగైంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా అలాగే దెబ్బతిన్నది. రాష్ట్రాల ఆత్మగౌరవం ముందు జాతీయ పార్టీల రాజకీయ వల పనిచేయదని అనేకసార్లు రుజువైంది. అయితే కాంగ్రెస్‌ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థం చేయాలన్నా, కాంగ్రెస్‌ ముక్తు భారత్‌ చేయాలన్నా జమిలీ ఎన్నికలే శరణ్యమని బిజేపి బలంగా నమ్ముతోంది. అంతే కాకుండా ఈసారి కేంద్రంలో 400 సీట్లు గెలుస్తామని విశ్వసించిన బిజేపి పదేళ్ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇదిలాగే కొనసాగితే బిజేపికి భవిష్యత్తు ప్రశ్నార్ధకమౌతుందన్న ఆందోళన బిజేపిలో నెలకొన్నది. అందుకే కేంద్రంలో మూడోసారి అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది కూడా రేపు జరగబోయే ఎన్నికలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే తప్ప ఆచరణసాధ్యం కాని అంశమని కాంగ్రెస్‌ కొట్టిపారేస్తోంది. ఎట్టిపరిస్ధితుల్లో జమిలికి తాము సహకరించమని కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఇక ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికలకు ఒప్పుకుంటాయా? రాజకీయ ఉప్పెన తెస్తాయా? అన్నది చూడాల్సి వుంది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా తన ఉనికికి ప్రమాదం తెచ్చుకునే నిర్ణయాలు తీసుకోవు. అయితే కేంద్రం జమిలి ఎన్నికలు తేవడం అంటే బిజేపి అత్యాశకు నిదర్శనమని అనేవారు కూడా వున్నారు. పైగా కోరికోరి కొరివితో తలగోక్కోవడం అంటే కూడ ఇదే అని రాజకీయ పార్టీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!