https://epaper.netidhatri.com/
`ఓ కేసులో ఏ వన్ ముద్దాయి రవికి టిక్కెట్ ఆఫర్ వెనుక ఆంతర్యమేమిటి?
` 119 నియోజకవర్గాలలో శేరి లింగంపల్లి పై ఫోకస్ ఎందుకు?
`లోగుట్టు పై అనేక వదంతులు?
`దళిత మహిళ బిజెపి సీనియర్ నాయకురాలు కాంచన హత్యాయత్నం కేసులో ఏవన్ ముద్దాయి రవి?
`రవికి టిక్కెట్ కోసం అరవింద్ వ్యాఖ్యలు, ట్విట్లు!
`మద్దతుగా కొండా ట్విట్లు?
`శేరి లింగంపల్లి బిజేపి లో కలకలం!
`శేరి లింగంపల్లి లో అరవింద్ పెత్తనంపై పార్టీ శ్రేణుల మండిపాటు!
`కొండా విశ్వేశ్వర రెడ్డి మద్దతు పై తిరుగుబాటు!
హైదరాబాద్,నేటిధాత్రి:
టిక్కెట్ల అమ్మకాలలో జాతీయ పార్టీలు బిజేపి, కాంగ్రెస్ పోటీ పడుతున్నట్లున్నాయి. గెలిచేంత సీన్ లేని నాయకులకు లేని పోని అశలు కల్పించి కోట్లు వెనకేసుకుంటున్నారని సమాచారం. తాజాగా శేరి లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బిజేపిలో ఎంపి. అరవింద్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బిజేపి లో రవి అనే వ్యక్తిపై ఎంపి. ధర్మపురి అరవింద్ ప్రత్యేక శ్రద్ద కనబర్చారు. ఆయనకు మద్దతుగా కూడా మాట్లాడారు. రవి కు టిక్కెట్ ఇస్తే గెలుస్తాడంటూ అరవింద్ చెప్పుకొచ్చారు. రవి నియోజకవర్గంలో పాద యాత్ర నిర్వహించినట్లు, సుమారు 45000 మంది కొత్త ఓటర్లను నమోదు చేయించినట్లు చెప్పారు. ఎంపి. అరవింద్ వ్యాఖ్యలకు మద్దతుగా మాజీ ఎంపి. కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విట్ల సమాచారం చేరవేశాడు. అసలు రవి అనే వ్యక్తి సొంత పార్టీకి చెందిన ఓ దళిత మహిళా నేత మీద హత్యాయత్నం చేసిన కేసు నమోదైవుంది. ఏవన్ ముద్దాయిగా వున్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో వుంది. సొంత పార్టీ నేతపైనే 307 క్రిమినల్ కేసు వున్న వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలని అరవింద్ రెకమెండ్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. బిజేపి పార్టీ శ్రేణులే అరవింద్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. నిజానికి అక్కడ కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్న వాళ్లు చాలా మంది నాయకులు వున్నారు. వాళ్లందరినీ కాదని అరవింద్ కేవలం రవి యాదవ్ కు మద్దతు పలకడం వెనుక పెద్ద మతలబే వుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ లో 119 అసెంబ్లీ స్థానాలలో లేని శ్రద్ద ఒక్క శేరి లింగంపల్లి లోనే ఎందుకనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇదిలా వుంటే అరవింద్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విట్లు కూడా సంచలనంగా మారాయి. ఈ ఇద్దరు రవి కు మద్దతుగా ప్రకటనలు చేయడం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే అరవింద్, విశ్వేశ్వర రెడ్డి మద్దతు పలుకుతున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి. మరో విశేషమేమంటే నాకైతే టిక్కెట్ రాకుంటే వాళ్ల సంగతి చూస్తా? అని ఈ ఇద్దరినీ ఉద్దేశించి రవి కొంత మంది ఆంతరంగికుల మధ్య అన్నట్లు సమాచారం. ఈ విషయం ఆ నోట, ఈనోట బైటకు రావడంతో అసలు విషయం రచ్చ రచ్చ అవుతోంది. ఆ ఇద్దరు నేతలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది.
నిత్యం సత్య వచనాలు వల్లించే ధర్మపురి అరవింద్ తన అసలు రంగు బైటపెట్టుకున్నారు.
గత ఎన్నికల సమయంలో పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి తూచ్ అన్నాడు. వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని నమ్మించి గెలిచాడు. పసుపు బోర్డు కన్నా గొప్పది తెచ్చానన్నాడు. వరంగల్
కేసముద్రం లో వున్న స్పైసీ బోర్డు లోని ఒక వింగ్ ను తెచ్చి పెట్టి రైతులను నమ్మించాడు. ఇక ఈసారి జనాన్ని నమ్మించలేనని తాజాగా మళ్ళీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పసుపు బోర్డు ప్రకటన చేయించాడు. దానికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు. ఇటీవల కాంగ్రెస్ లో టిక్కెట్ల అమ్మకాలపై వచ్చిన ఆరోపణలపై అరవింద్ సుద్దులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాను శేరి లింగంపల్లి విషయంలో వివాదం మూట గట్డుకుంటున్నారు. ఇప్పుడేం చెబుతారో చూద్దాం..
ఇక మరో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఎంతో నీతి వంతమైన సుద్దులు చెబుతున్నాడు.
గతంలో ఎంపిగా బిఆర్‌ఎస్ లో వున్నప్పుడు మిషన్ భగీరథ పథకం పనులు చేశారు. కొన్ని పనులను సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. అందులో బాల సుబ్బయ్య అనే వ్యక్తి పనులు పూర్తి చేసినా అతనికి బిల్లులు చెల్లించలేదు. ఇప్పటికీ బాల సుబ్బయ్య అనే వ్యక్తిని కొండా విశ్వేశ్వర రెడ్డి తిప్పుకుంటూనే వున్నాడు. బిల్లులు ఇవ్వకుండా బెదిరిస్తూనే వున్నాడు. పైకి మాత్రం నిత్యం నీతి సూత్రాలు వల్లిస్తూనే వుంటారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా మూటలు అప్పగించిన వారికి టిక్కెట్ల రికమెండేషన్ కూడా ఇప్పుడో రాజకీయమైపోయింది.