ప్రజా ప్రతినిధులకు లేని పారితోషకాల పద్ధతి ఆశా వర్కర్లకెందుకు

తక్షణమే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి

మద్దతు తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి

మంగపేట:- నేటి ధాత్రి

క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో నిరంతరం అన్ని రకాల ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య తెలంగాణ కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాలకు తక్షణమే పనిని బట్టి పారితోష్కాల పద్ధతిని రద్దు చేస్తూ తక్షణమే కనీస వేతన అమలు చేయాలని ఆశ వర్కర్ల మద్దతులో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగపేట మండలం చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మూడవరోజు సమ్మె మద్దతు ఆదరై మాట్లాడుతూ సమయం సందర్భం లేకుండా నిరంతరం ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేస్తూ పని చేస్తున్న ఆశలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు 30 మార్కులు కల్పించాలి 32 రకాల రిజిస్టర్లు ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఆశలకు కల్పించాలి అన్నారు కనీస వేతనం ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు నిర్వహించాలి అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు నాగమణి, ఉపాధ్యక్షురాలు కే రమాదేవి, కోశాధికారి బి సుజాత, వజ్రమ్మ, ఏ సాంబలక్ష్మి, ఎస్ శ్రీలత, ఈ సుశీల, వి నాగమణి, టి యజ్ఞమ్మ, సిహెచ్ సుగుణ, కే నాగమణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *