`గులాబీ రేకులు పీకించుకొని?
`కారుకు సొట్టలేయించుకొని?

`ఎన్ని ఓడిపోతున్నా ఎన్నికలు ఎన్నికలు అంటున్నారు?
`అన్ని ఎన్నికలలో ఓడిపోతున్నారు?
`ఎందుకు ఓడిపోతున్నారో సోయి రావడం లేదు?
`గ్రౌండ్ కదిలిపోతున్నా గుణం రావడం లేదు?
`మార్పు తో మొదలైన ఓటమి నుంచి ఒక్కసారి కూడా బైట పడలేదు?
`వచ్చేది మనమే అనుకుంటూ పగటి కలలు కాంటూనే వుండండి?
`రెండేళ్లయినా జనం ముందుకు రాకండి?
`ఎన్నికలోచ్చినప్పుడే కనిపించండి?
పల్లెల్లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్జోరు స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి దాకా బిఆర్ఎస్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తేలుతోంది. బిఆర్ఎస్ ప్రచారం చూసి నిజమని నమ్మిన కాంగ్రెస్‌లో కూడా మొదటి విడత పలితాలు మరింత విజృంబించేందుకు దోహదపడుతున్నాయి. కాని పల్లెల్లో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వుందని పదే పదే బిఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టినట్లు సమాదానమిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కారును ఓడిరచి కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ క్షేత్ర స్దాయిలో వున్న పరిస్దితిని బేరీజు వేసుకుంటూ పగటి కలలు కనకుండా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజలకు భరోసా కల్పించాలి. అంతేగాని మేమున్నాం..మేముంటాం..మేమే వస్తాం..అంటూ కల్లబొల్లి కబర్లు చెబితే అంత సులువుగా నమ్మడానికి తెలంగాణ జనం సిద్దంగా లేరు. అదికారంలో వున్నంత కాలం జనం దగ్గరకు రాలేదు. ప్రతిపక్షంలో వున్నా జనం ముఖం చూడడం లేదు. బిఆర్ఎస్ను ఎలా నమ్మమంటారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా ఆ పార్టీ నేతలు జనం మాటలు వినిపించుకోవడం లేదు. జనానికి చేరువ కావడం లేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతోంది. ఇచ్చిన హమీలు కూడా ఏవీ అమలు చేయడం లేదని ప్రజలకు తెలుసు. ప్రభుత్వానికి తెలుసు. అయినా కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ జనంలో వుంటుంది. జనం కోసం పనిచేస్తుంది. ఇచ్చిన హమీల అమలు చేయకపోయినా, జనానికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వమంటే కేవలం ఎన్నికల హమీలంటూ నాలుగు పనులు కాదు. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతగా అమలు చేయగలిగే నాయకులు కూడా వుండాలి. అదే కాంగ్రస్ బలం. ఆ విషయం ఇంకా తెలియక బిఆర్ఎస్ నాయకులు ఇంకా ఆకాశంలోనే విహరిస్తున్నారు. కోతులు కోయమంటే ఇక ఆగరు. జనంలోకి రమ్మంటే ఎక్కడో ఒక దగ్గర ఓ సభ పెట్టడం కాదు. ప్రజల మధ్య తిరగాలి. ప్రజా సమస్యలు తెలుసుకునే నాయకులు వుండాలి. ఏదో జిల్లాల పర్యటనలు అంటూ నాలుగు గోడల మధ్య జిందాబాద్‌లు కొట్టించుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటే ఓట్లు పడవు. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినసీట్లలో సగం కూడా రాలేదు. దానికే బిఆర్ఎస్ నేతలు సంకలు గుద్దుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన సర్పంచ్లన్నా, బిఆర్ఎస్కు ఎక్కువ వస్తే ప్రజా వ్యతిరేకత వున్నట్లు. కాని బిఆర్ఎస్కు వచ్చిన సర్పంచ్లకన్నా, సగం ఎక్కువ వచ్చిన కాంగ్రెస్‌దే పై చేయిగా మిగిలింది. కోతలు కోయమంటే బిఆర్ఎస్ నాయకులు ఇక నోరు ఆగదు. జనం మాత్రం ఇంకా ఆ కోతలు మెచ్చడం లేదన్నది తెలుసుకోవడం లేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఇక మనమే గెలిచేది. మెజార్టీ ఎంత అన్నదే లెక్కేసుకోవాలి అనుకుంటూ కలలుగన్నారు. ఏమైంది. బొక్క బోర్లా పడ్డారు. సిట్టింగ్ సీటును కోల్పోయారు. ఇంకా బుద్ది రావడం లేదు. పంచాయితీ ఎన్నికలు మావే..గెలిచేది మేమే..మెజార్టీ సీట్లన్నీ మాకే అంటూ రెండు సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. పంచాయితీ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతోందని పదే పదే సవాలు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఆ సవాలు ఎక్కడికిపోయింది? సర్పంచ్‌లు ఎందుకు గెలవడం లేదు? ఎన్నికలు ఎన్నికలు అని సవాలు చేసి మరీ కాంగ్రెస్ చేత గులాబీ రేకులు పీకించుకుంటున్నారు. పదే పదే కారుకు సొట్టలు పడేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కారు షెడ్డుకుపోయింది? ఇక రాదు? అని పదే పదే చేస్తున్న హేళననే బిఆర్ఎస్ నిజం చేసుకుంటోంది. కేవలం జేజేలు కొట్టించుకోవడానికి తప్ప జనం గోడు వినేందుకు బిఆర్ఎస్ నాయకులు లేరని తేలిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలౌతోంది. ప్రజల్లో వున్న వ్యతిరకతను క్యాచ్ చేసుకోవడంలో బిఆర్ఎస్ పూర్తిగా విఫలమౌతోంది. పదే పదే సవాళ్ల మీద సవాళ్లు చేసి పరువు తీసుకుంటోంది. ఓడిపోయిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ అదికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించి చేతులు ముడుచు కూర్చుంటే సరిపోతుందా? అదికారంలో వున్న పార్టీ ఏదైనా అదే చేస్తుంది? బిఆర్ఎస్ అదికారంలో వున్నప్పుడు అధికార దుర్వినియోగం చేయకుండానే పదే పదే గెలుస్తూ వచ్చారా? అధికారంలోవున్న పార్టీ అన్ని రకాల వ్యవస్దలను వినియోగించుకుంటుంది. మెజార్టీ స్దానాలు గెల్చుకుంటుంది అని తెలిసినా పదే పదే ఏతులు ఎందుకు కొట్టాలే..బొక్కా బోర్లా ఎందుకుపడాలే? ప్రభుత్వం ఎన్నికలు పెట్టినప్పుడే కొట్లాడాలి. కాని పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం ఎందుకు? జోరు మీదున్న కాంగ్రెస్ ముందు డీలా బిఆర్ఎస్ పదే పదే తేలిపోతోంది. జూబ్లీ గెలుపు తర్వాత కాంగ్రెస్ పెంచిన స్పీడ్ కారు అందుకోలేకపోతోంది. జూబ్లీహిల్స్‌లో ఓడినా, పల్లెజనం అండగా వుంటారని బిఆర్ఎస్ పార్టీ అంచనా వేసింది. కాని పల్లె కూడా ఎదురు తన్నింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తోంది. ఇటు కాంగ్రెస్‌ను ఎదిరించలేక బిఆర్ఎస్ అగ్ర నాయకత్వం నివ్వెరపోతోంది. ఇలాంటి పరిసి ్దతి వస్తుందని ఎప్పుడూ ఊహించని బిఆర్ఎస్ కలలో కూడా ఊహించలేదు. అదికారంలో వున్నప్పుడు ఇలాంటి పరిస్దితి ఎదురౌతుందని ఊహించలేదు. అప్పుడే అంచనా వేసుకుంటే ఈ పరిస్దితి వచ్చేది కాదు. జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని కలలు గన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ వ్యూహాలను అంచనా వేయడంలోనే పదే పదే వి ఫలమౌతోంది. వరి ధాన్యం కొనుగోలు సొమ్ము వెంటనే ఖాతలో జమ చేస్తారని బిఆర్ఎస్ అనుకోలేదు. వరికి బోనస్ కూడా అందుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోందని బిఆర్ఎస్ గుర్తించలేదు. ఇన్ని రకాలుగా ఏక కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు కనిపిస్తున్నా బిఆర్ఎస్ అర్దం చేసుకోవడం లేదు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్దితిలోకి బిఆర్ఎస్ నెట్టి వేయబడుతోంది. ఊరిపి సలపని పరిస్ధితుల్లోకి బిఆర్ఎస్ పార్టీ వెళ్లిపోతోంది. తెలంగాణలో ఎన్నడూ అనుభవించనంత ముప్పెట దాడి బిఆర్ఎస్ అనుభవిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతగా బిఆర్ఎస్ దాడిని చవి చూడలేదు. కారణం అప్పుడు బిఆర్ఎస్ను ఎవరు ఏమన్నా, తెలంగాన సమాజం స్పందించేది. ఉద్యమ సంస్ధలు ఓన్ చేసుకునేవి. బిఆర్ఎస్ పార్టీకి,నాయకులకు అండగా నిలిచేవి. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ఎందుకంటే బిఆర్ఎస్ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ. పైగా అది టిఆర్ఎస్కాదు. బిఆర్ఎస్. ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టుకున్నారో అప్పుడే తెలంగాణ వాసనలు పోయాయి. ఆ మూలాలు కూడా దెబ్బతిన్నాయి. టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చీ రావడంతోనే ఉద్యమ కారులను దూరం పెట్టింది. ఉద్యమ ద్రోహులకు పార్టీలో చోటు కల్పించింది. ఉద్యమ నాయకులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చింది. ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వాళ్లకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వంలో అనుభవం పేరుతో తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని అందలమెక్కించింది. దళితుడే తొలి ముఖ్యమంత్రి అని తొలి మోసానికి కేసిఆర్ తెర తీశాడు. అప్పటి నుంచి తెలంగాన ఉద్యమ కారులకు అన్యాయంచేయడం మొదలు పెట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను పక్కన పెట్టి ఎన్నికల రాజకీయ వ్యూహాలను అనుసరిస్తూపోయారు. పనిలోపనిగా కాలేశ్వరం నిర్మాణం చేసి జనాలను మరిపించాడు. పదేళ్ల తర్వాత తరం మారింది. కేసిఆర్ దశ కిందికు జారింది. ఇక అంతే లేవలేని పరిస్దితి తెచ్చుకున్నది. వరస ఓటములు ఎదురౌతున్నా బిఆర్ఎస్ అగ్రనేతల్లో అహం తగ్గలేదు. క్షేత్రస్దాయి సమస్యలు గుర్తించలేదు. ప్రజలు తమవైపే వున్నారన్న భ్రమల్లో నిన్నటి దాకా వున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా గండెలు అదిరిపోయేలాంటి ఓటమి మరోసారి ఎదురయ్యే సరికి గుండెలు బాదుకుంటున్నారు. నోరు తెరవకుండా ఏడుస్తున్నారు. ఇలా వరస దెబ్బలు తింటున్న బిఆర్ఎస్కు దేవనపల్లి కవిత కూడా ఆ పార్టీ నేతలకు కొరకరాని కొయ్యలాగా మారిపోయింది. ఆమె చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక కూడా బిఆర్ఎస్ సతమతమౌతోంది. ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వం చతికిలపడిపోతోంది. అటు గెలిచిన ఉత్సాహంతో వున్న కాంగ్రెస్ రాజకీయంగా దూకుడు పెంచెంది. ఒక్క గెలుపుతో కాంగ్రెస్‌లో జోష్ నిండిరది. నిన్నటి దాకా పంచాయితీ ఎన్నికలకు వెళ్లడానికి ముందూ వెనుక ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ ఇక సై అంటే సై అన్నది . ఎన్నికల కోసం కాలు దువ్వింది. పంచాయితీ ఎన్నికలలో కూడా గెలుస్తూ కారును చిత్తు చిత్తు చేస్తోంది. .
