గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??
పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??
రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??
అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??
ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:
ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.