BRS Flag Will Fly in Zahirabad and Kohir: MLA Manik Rao
అయ్యో.. పాకిస్థాన్ టీమ్‌కు ఎలాంటి గతి పట్టింది.. పాక్ క్రికెటర్లు అలాంటి ప్రదేశంలో నడుస్తున్నారేంటి..
కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ కోసం శ్రీలంకలో ఉంది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం కొలంబోలో జరగబోయే మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Pakistan team in Colombo).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పాక్ ఆటగాళ్లు, సిబ్బంది బస్సు నుంచి దిగి, అపరిశుభ్రంగా కనిపిస్తున్న ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ కోసం వెళ్తున్నారా లేదా ప్రాక్టీస్ నుంచి హోటల్‌కు తిరిగి వస్తున్నారా అనే విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ లేదు. పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘పాక్ క్రికెట్ జట్టుకు కొలంబోలో శ్రీలంక, ఐసీసీ అందించిన ఆతిథ్యం ఇది. వారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది’ అని కామెంట్ చేశారు
