తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వుడు చేయబడిన స్థానాలు 12 నియోజక వర్గలు. ఈసారి విధానసభ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టంకట్టనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైనది. ఆదివాసి, గిరిజన స్థానంలో భీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు టికెట్లు కేటాయించకపోవడం, గతంలో టికెట్ ఆశించి బంగ పడ్డవారు ఈసారి టికెట్ దక్కుతుందనుకున్న ఆశతో ఉన్నారు. దక్కని వారు రాత్రి రాత్రి పార్టీని మారి నూతన పార్టీలో కండువా కప్పుకుని కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఎస్టీ ప్రత్యేక వర్గాల స్థానాలు ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో -ములుగు, ఖమ్మం, జిల్లాలో భద్రాచలం, పినపాక, వైరా, ఇల్లందు అశ్వారావుపేట, నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గలు ప్రత్యేకంగా ఎస్టీలకు రిజర్వు కలవు. ఈసారి త్రీముఖ పోటీ 12 స్థానల్లో ఉండే అవకాశం కలదు. ఇటు కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చి గెలిచే ప్రయత్నాలు ఆరంభించినది. భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. 2018 లో ఎన్నికల్లో కాంగ్రెస్ 5, తెరాస 5, తెదెపా 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుసుకున్నారు.
భాజపా పార్టీ: మిషన్ 12 పేరిట ఎస్టీ నియోజక వర్గాల్లో కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని, మోది, అమిత్ షా కేంద్ర నేతల ద్వారా ప్రచారం చేయడం, ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఈ రిజర్వ్ చేయ వర్గాల్లో గెలుపుకు అస్త్రంగా మలుచుకుంటున్నట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ: వ్యూహాల్లో భాగంగా గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, భారాస ఇవ్వని మిగిలిన వారికి పోడు భూములకు పట్టాల జారీ, భూమిపై హక్కులు, గిరిజన బందు పథకము, ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల ఏజెన్సీ ఏరియాలో అభివృద్ధి తదితర అంశాల్ని ప్రచారంగా వాడుకుంటుంది.
భారాస పార్టీ: రాష్ట్రంలో గల గూడంలను మరియు తండాల్ని గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం, పోడు భూములకు పట్టాలి ఇవ్వడం, ఆదివాసి భవన్ గిరిజన భావన్ల ఏర్పాటు, జోడేఘాట్లో కోమరం భీం స్మరక స్థూపం ఏర్పాటు మరియు గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసినది ఈ తదితర అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో ప్రచారంగా వాడుకుంటుంది.
12 ఎస్టీ నియోజక వర్గాల్లో గెలుపు ఓటములు:
బోథ్ యోజవర్గం: అదిలాబాద్ జిల్లాలో గల ఎస్టీ రిజర్వు స్థానం ఈ నియోజకవర్గం పూర్తిగా అదిలాబాద్ జిల్లాలో కలదు. బోథ్ తలమడుగు, తాంసి, గుడిహత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, సోనాల, భీంపూర్ మండలాలతో ఈ నియోజకవర్గం కలదు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాథోడ్ బాపూరావు గెలుపొందారు అనిల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పై . 2018 ఎన్నికల్లో రాథోడ్ బాపురావు టిఆర్ఎస్ నుండి సోయం బాపూరావు కాంగ్రెస్ పైన గెలిపొందారు. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో భాజపా నుండి సోయం బాపురావు ప్రస్తుతం ఎంపీ, టిఆర్ఎస్ నుండి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుండి వెన్నెల ఆశోక్/ గజేంద్ర పోటీ చేస్తున్నారు. మరి గెలుపు ఎవరిదో ఏపార్టీదో.
ఆసిఫాబాద్: ఈ నియోజకవర్గంలో ఆదివాసుల గొండు, కోలాం, పర్థాన్ ఓటర్లు ఎక్కువగా ఉండడం ఇతర గిరిజనులు తక్కువ ఉండడం 2014 ఎన్నికల్లో కోవలక్ష్మి టిఆర్ఎస్ నుండి అత్రం సక్కు కాంగ్రెస్ పై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది అత్రం సక్కు కాంగ్రెస్ నుండి కోవలక్ష్మి టిఆర్ఎస్ పైల విజయం సాధించారు. అలాగే 2023లో బిజెపి నుండి ఆత్మారాం, కాంగ్రెస్ నుండి శ్యాం నాయక్, భారస నుండి కోవ లక్ష్మీకి టికెట్లు కేటాయించినారు. మరి ఇందులో గెలుపు గుర్రాలేవో చూడాలి.
ఖానాపూర్:
మూడు జిల్లాల్లో ఈ నియోజక వర్గం కలదు. ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం మండలాలలు. 2014 ఎన్నికల్లో రేఖా నాయక్ టిఆర్ఎస్ రితీష్ రాథోడ్ టిడిపి పై విజయం సాధించారు. అలాగే 2018 ఎన్నికల్లో రాథోడ్ రమేష్ పై రేఖ నాయక్ కాంగ్రెస్ పై తెరాస గెలుపొందారు. ప్రస్తుతము 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో రేఖా చేరారు టిఆర్ఎస్ టికెట్ రానందున.2023 ఎన్నికల్లో రాథోడ్ రమేష్ బిజెపి నుండి వేడమ బోజ్జు పటేల్ కాంగ్రెస్ నుండి జాన్సన్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుంచి బలబలాలకు సిద్ధమవుతున్నారు.
ములుగు:
ఈ నియోజకవర్గంలో ఆదివాసులైనటువంటి కోయ, లంబడీలు సగం సగం ఓటర్లు కలవు. ఫలితాలు చైన్ సిస్టం లో ఓటర్ ఫలితాలు లిస్తూన్నారు. 2014లో టిఆర్ఎస్ నుండి చందులాల్ పి.వీరయ్య కాంగ్రెస్ పై గెలవగా, 2018 ఎన్నికల్లో సీతక్క కాంగ్రెస్ నుండి చందులాల్ టిఆర్ఎస్ పై గెలుపొందారు. మరి 2028లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి సీతక్క బీజేపీ నుండి ప్రహల్లాద్ నాయక్, భిఆర్ఎస్ నుండి బడే నాగజ్యోతి ఓటర్ ముందుకు వస్తున్నారు ఓటర్లు సీతక్క వైపే మొగ్గు చూపిస్తున్నారు!.
మహబూబాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో 2014, 2018లో శంకర్ నాయక్ మాలోత్ కవిత కాంగ్రెస్ బలరాం నాయక్ కాంగ్రెస్ లపై గెలుపొందారు. 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున శంకర్ నాయక్ కాంగ్రెస్ తరపున డా.మురళి, బిజెపి నుండి హుస్సేన్ నాయక్ పోటీ పడుతున్నారు. రెడ్య నాయక్ సహకారం శంకర్ నాయక్ కు ఉండడం వల్ల మరి హేట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి.
డోర్నకల్ :
ఈ నియోజక వర్గంలో లంబాడి గిరిజనుల ఓటర్లు ఎక్కువ ఉండడం రెడ్యానాయక్ 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆఎస్ పై గెలుపొందారు. 2023లో రెడ్యానాయక్ భిఆర్ఎస్ తరఫున, రామచంద్రునాయక్ కాంగ్రెస్ నుండి, భూక్య సంగీత బిజెపిలకు బీఫారములపై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం పోటీలో ఓటరులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.
భద్రాచలం:
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత భద్రాచలం నియోజకవర్గం నుండి కొన్ని గ్రామాలు ఏపీలో కలపడం జరిగింది 2014 ఎన్నికల్లో సిపిఎం నుండి సున్నాం రాజయ్య టిడిపి అభ్యర్థి పరమేశ్వరమ్మ పై భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. 2018 వీరయ్య కాంగ్రెస్ నుండి తెల్ల వెంకటేశ్వర్ టీఆర్ఎస్ పై గెలుపోందినారు. 2023 ఎన్నికల్లో బీఫాంలో అందుకున్న వారిలో భిఆర్ఎస్ నుండి తెల్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుండి పోదాం వీరయ్య సిట్టింగ్, బిజెపి నుండి కుంజ ధర్మారావు, సిపిఎం నుండి కారం పుల్లయ్య పోటీల్లో కలరు. ప్రజలు ఎవరి వైపో చూడాలి. భద్రాది సీతరాములవారు ఎవరిని కరునిస్తారో.
పిన పాక:
మణుగురు, పాల్వంచ తదితర మండలాలు ఈ నియోజకవర్గంలో కలవు. ఎక్కువగా ఆదివాసీలైన కోయలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్లు వైకాపా డి.శంకర్ టిఆర్ఎస్ పై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ నుండి పి.వెంకటేశ్వర్ టిఆర్ఎస్ మిద గెలుపొందారు. ఇక్కడ నుండి టిఆర్ఎస్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. 2023 ఎన్నికలలో భీఆర్ఎస్ నుంచి రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుండి భాజపా నుండి పోడియం బాబురావు పోటీలో గలరు.
వైరా:
భిఆర్ఎస్ ఇక్కడ నుండి ప్రస్తుతము గెలవాలని ప్రయత్నిస్తుంది రెండుసార్లు ఓటమి చెందినది. 2014 ఎన్నికలలో మదన్ లాల్ వైకాపా, టిడిపి అభ్యర్థి బాలాజీపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా మదన్లాల్ టిఆర్ఎస్ పై కక్ష తీర్చుకున్నాడు. 2023 విధాన సభ బరిలో టిఆర్ఎస్ నుండి మదన్లాల్ కాంగ్రెస్ నుండి రాందాస్, సిపిఎం నుండి భూక్య వీరభద్రం పోటీలో కలరు.
ఇల్లందు:
బయ్యారం, ఇల్లందు, సింగరేణి మండలాలు ఈ నియోజకవర్గంలో కలవు. 2014 ఎన్నికల్లో కోరం కనకయ్య కాంగ్రెస్ నుండి భానోత్ హరిప్రియ టిడిపి పై గెలుపొందారు. 2018 లో హరిప్రియ నాయక్ కాంగ్రెస్ నుండి కోరం కనకయ్య టిఆర్ఎస్ పైన గెలుపొందారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కనకయ్య, భిఆర్ఎస్ నుండి హరిప్రియ నాయక్, బిజెపి నుండి రవీంద్ర నాయక్ పోటీలలో కలరు మరి ఓటర్లు ఎటువైపు.
అశ్వరావుపేట: దమ్మపేట, కుక్కనూరు, చుండ్రుగొండ, ములకాలపల్లి మండలాలు ఈ నియోజకవర్గంలో కలవు. 2014లో తాటి వెంకటేశ్వర్లు వైకాపా నుండి మెచ్చ నాగేశ్వరరావు టిడిపిపై గెలుపోందగా, 2018 ఎన్నికల్లో మెచ్చ నాగేశ్వరరావు టీడిపి నుండి పోటీ చేసి తాటి వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ ను ఓడించారు. మరి 2023 ఎన్నికల్లో భిఆర్ఎస్ నుండి మెచ్చ నాగేశ్వరావు కాంగ్రెస్ నుండి ఆదినారాయణ సిపిఎం నుండి పిట్టల అర్జున్ బరిలో కలరు.
దేవరకొండ:
ఈ నియోజకవర్గంలో చింతపల్లి, గండ్లపల్లి, చందంపేట్, పి అడిశర్లపల్లి మండలాలు కలవు. ఇక్కడ నుండి 2014లో రమావత్ రవీంద్ర నాయక్ సిపిఐ నుండి మరియు 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి ఇతనే గెలుపొందారు. బెల్యా నాయక్ టిడిపి బాలునాయక్ కాంగ్రెస్లపై రెండుసార్లు విజయం సాధించారు. మరి మూడోసారి గెలుపు కొరకు ఎదురుచూస్తున్నారు. 2023 ఎన్నికల్లో భిఆర్ఎస్ నుండి రవీంద్ర నాయక్, కాంగ్రెస్ నుండి ఎన్.బాలు నాయక్, బిజెపి నుండి కే లాల్ నాయక్ పోటీపడుతున్నారు వామపక్ష పార్టీల మద్దతు ఎవరికి ఉంటే వారి వైపే గెలుపు ఉంటుంది.
ఆదివాసి/ గిరిజనుల డిమాండ్లు:
1). ఐదవ వ షెడ్యూల్డ్ ఏరియాలో వలస బినామీ వ్యవస్థ రద్దు చట్టంను తీసుకు రావాలి.
2) జీఓ 03 కి చట్టబద్దత కలిపించాలి.
ఏజెన్సీ లోని 29 శాఖలలోని జీఓ లన్నింటిని కలిపి చట్టం చెయ్యాలి.
3) ఏజెన్సీ డిఎస్సీ ఏర్పాటు చెయ్యాలి.
4) పోడు భూములకు వారసత్వపు హక్కునిస్తూ రిజిస్ట్రేషన్స్ సౌకర్యం కలిపించాలి.
5)ఏజెన్సీ లో
ట్రైబల్ చట్టాలపై అవగాహన లేని అధికారుల్ని తొలగించాలి.
6)ట్రైబల్ ఆటనమస్ జిల్లాలను ఏర్పాటు చెయ్యాలి.
7)ప్రతి ఐటిడిఎ పరిధిలో ట్రైబల్ చట్టల పై అవగాహన సదస్సులు ఏర్పాటు కోసం సెంటర్స్ ఏర్పాటు చేయాలి.
8) 1/70, పేసా, అటవీ హక్కుల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
9)సాదాబైనామాల ద్వారా మార్చిన దొంగ పట్టాలను రద్దు చెయ్యాలి.
10)ఏజెన్సీ లో జీఓ 59 ,గృహహాలక్ష్మి…ధరణీలను రద్దు చెయ్యాలి
11) ప్రతి ఐటిడిఎ పరిధిలో ట్రైబల్ కోర్ట్ లను ఏర్పాటు చేయాలి.
12) ఎల్టీఆర్ కేసులను త్వరిత గతిన పరిష్కరించాలి.
13) షెడ్యూల్ 5 వ ఏరియా లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ట్రైబల్ సహయ కేంద్ర లను సెల్ ను ఏర్పాటు చేయాలి.
14) గుర్తింపుకు నోచుకోని నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలను 5వ షెడ్యూల్డ్ ఏరియా గా గుర్తించాలి.
15) 5వ షెడ్యూల్డ్ ఏరియాను జోనల్ పరిధిలో నుండి తొలగించాలి.
16) జోనల్ స్థాయి ఉద్యోగాలన్నింటిని అదివాసీలతో భర్తీ చేయడానికి
ప్రత్యేక ఉద్యోగ చట్టాన్ని తీసుకు రావాలి.
17) ట్రైబల్ విద్య పాలసీ ప్రకటించాలి.
18) ఆశ్రమ పాఠశాలలన్నింటిని గురుకులాలుగా మార్చాలి.
19) ప్రతి గురుకులాన్ని సిబిఎసిగా మార్చాలి.
20) ప్రతి మండలంలో అంతర్జాతీయ ఆదిమజాతి పాఠశాలల లను ఏర్పాటు చేయాలి.
21) ప్రతి ఐటిడిఎ పరిధిలో
బిజినెస్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి.
22) ప్రతి ఐటిడిఎ లో
ఆదిమజాతి కల్చరల్ సొసైటీ ల ను ఏర్పాటు చెయ్యాలి.
23) ట్రైబల్ యూనివర్సిటీ లాగే
గిరిజన ఐఐటీ,ఎన్ఐటి, ఐఐఐటీ లను ఏర్పాటు చేయాలి.
24) ఆదివాసి సివిల్స్ సర్వీసుని కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి..
25) 1వ షెడ్యూల్ ఏరియా లో ప్రతి గ్రామ పంచాయతి నీ, ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు గా మార్చాలి.
26) ప్రతి గ్రామం పంచాయతీ, ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు లో కోయ,నాయకపోడ్,కోలాం డెవలప్మెంట్ ఆఫీసర్స్ నీ నీయమించాలి
27) ప్రతి గ్రామంపంచాయతి ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు లో ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు మెంబెర్స్ నీ నీయమించాలి
28) ప్రతి అభివృద్ధి కార్యక్రమం ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు నిర్ణయం మేరకు జరగాలి
29) విద్య, ఆరోగ్య, ఉపాధి అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్యాచరణ చేయాలి
30) రాష్ట్ర, కేంద్ర, సబ్ ప్లాన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు ఖాతా లో జామచేయాలి.
31) గ్రామం పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు , అభివృద్ధి, ప్రణాళికలు ఓటు హక్కు ఉన్నా ప్రతి ఆదివాసీ ఉమ్మడి నీర్ణయం ప్రకారం జరగాలి.
32) గ్రామ పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా రైతులకు ఉచిత కరెంటు, వేవసాయ పనిముట్లు,విత్తనాలు, ఎరుపులు అంధీంచాలి.
33) గ్రామం పంచాయతి ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మహిళలకు, స్వయం ఉపాధి, చిన్న కుటీర పరిశ్రమలకి ప్రోత్సాహం అందించాలి..
34) ఐటిడిఎకి స్వయంప్రతి పత్తి హోదా ఇవ్వాలి, గ్రామ పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు లు ఐటిడిఎల అధీనం లో ఉండాలి
35) ప్రతి గ్రామం పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా, షెడ్యూల్ ప్రాంత అక్రమ వలసల నీరోధం కొరకు, ఇన్నర్ లైన్ పర్మిట్, అమలు చేయాలి.
36) గ్రామ పంచాయతీ ట్రైబల్ డెవలప్మెంట్ బోర్డులు, స్వయం నిర్ణయఅధికారాలు ఇవ్వాలి, భారత రాజ్య హక్కులు చట్టాలు అమలు పరీరక్షణ బాధ్యత ఇవ్వాలి. మరి వీరి డిమాండ్స్ ను ఏ పార్టీలు నెరవేరుస్తాయో చూడాలి.
డా.తూము విజయ్ కుమార్, విశ్లేషకులు చరవాణి 9492700653