సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాలలో రేషన్ డీలర్లు నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని 5 రూపాయలకు కొనుగోలు చేస్తూ నిరుపేదలను మోసం చేస్తున్నారు వాళ్ళ ఇష్టారాజ్యంగా నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు నిరుపేదలకు మాయమాటలు చెప్పి కొనుగోలు చేస్తున్నారు అసలైన నిరుపేదలు రేషన్ బియ్యం అందక అల్లాడుతున్నారు ఇదేమిటని అడిగే నాధుడే కరువైనాడు వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మండల ఉన్నత అధికారుల నుండి పోలీసులు గాని రెవెన్యూ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తుంది రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు వాళ్లకు అండగా ఉండబట్టే ఈ దందా నిరంతరం కొనసాగుతోంది తక్షణమే ఈ దందాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దందాను కొనసాగుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకొని రేషన్ డీలర్ల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం లేనియెడల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం