జమ్మికుంట: నేటిధాత్రి
దళిత బంధు రెండో విడత బాధితులు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజక వర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ నియోజక వర్గంలో ప్రారంభించారు.సుమారుగా 17862 మందిని లబ్ధిదారులు గా గుర్థించి మొదటి విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేసింది రెండో విడత విడుదల చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో రెండో విడత ఆగిపోయింది. ఎన్నికలు అయిపోయాక ఇస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక కూడా ఇవ్వడం లేదని ఎన్నో సార్లు అధికారులను కలిసిన ఎవరు స్పందించక పోవడంతో ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేశామని చేసిన కూడా ఫలితం లేకపోయిందని పార్లమెంట్ ఎన్నికల సమయంలో అన్ని పార్టీ తరఫున అభ్యర్థులను కలిసిన చేస్తామని చెప్పడం తప్ప ఎవరూ చేయలేదని మంగళవారం రోజున జమ్మికుంట నుంచి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టమని లబ్ధిదారులు అన్నారు ఈ కార్యక్రమంలో కోలుగూరి సురేష్ మంద రాజేష్ కోలుగూరి నరేష్ రామంచ రాకేష్ అకినపల్లి ఆకాష్ మంద వేణు ఇనుగాలా బిక్షపతి కోడెపాక రక్షిత్ దసరాపు నాగరాజు రామంచ శ్రీకాంత్ గాజుల శ్రీనివాస్ సరిత జీడీ అరుణా తదితరులు పాల్గొన్నారు
మా గోడు వినేది ఎవరు మా గోస తీర్చేది ఎవరు
