మంథని అసెంబ్లీ అధిపతి ఎవరు.!?

పార్టీలో చేర్చుకొనుటకే ప్రాధాన్యత, ప్రజల పరిస్థితుల పై ఎవరికి శ్రద్ధ.!?

ఉదయం ఓ కండువా, సాయంత్రం ప్రలోభాలకు గురయ్యారని,మరో కండువా ఇది పరిస్థితి ప్రజలు నమ్మేది ఎట్లా.!?

అందరూ మేనిఫెస్టో చూపిస్తున్నారు, చేసిన పని ఏమిటి నిరూపించుకోలేకపోతున్నారాన అనేది ప్రధాన ప్రశ్న.!?

అసెంబ్లీ ఎన్నికలు కదా ఓట్ల కొరకు భాగవతాలు ఎక్కువగా కనబడతాయి మోసపోతే గుస పడినట్టే.!?

నియోజకవర్గ ప్రజలు తమ మేధస్సును పనిలో పెట్టి ఓటు వేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో రేషన్ బియ్యానికి కూడా దిక్కు లేకుండా పోయే పరిస్థితి.!?

మహాదేవపూర్-నేటిధాత్రి;

అసెంబ్లీ ఎన్నికల నగర మోగడంతో గత నెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అలజడి ప్రారంభం కావడం జరిగిన విషయం తెలిసిందె. ఇక అభ్యర్థుల ఖరారు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమై చివరికి ప్రతి నియోజకవర్గానికి తమ అభ్యర్థులను ఖరారు చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులకు అనేక ఇబ్బందులు తలెత్తక తప్పలేదు సొంత పార్టీలోనే అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తామని రాష్ట్రంలో అనేక చోట్ల రివర్ అభ్యర్థులు రావడం సంవత్సరాలుగా కొనసాగుతున్న పార్టీలో తమకు స్థానం దక్కలేదని మరో పార్టీలోకి వెళ్లడం అక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న అభ్యర్థిపై తమకు టికెట్ ఇవ్వాలని కోరడం సుమారు 20 రోజులుగా ప్రతిరోజు ఒక సంచలన వార్తలకు సన్నివేశాలకు కుదువ లేకుండా పోయింది చివరికి అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో సంచలలాన్ని తెరపైకి తీసుకువచ్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో తూర్పు డివిజన్ మంథని అని చెప్పడంలో సందేహం లేదు.

మంథని అసెంబ్లీ అధిపతి ఎవరు.!?

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రవ్యాప్తంగా సంచలన దిశలో ఓటర్ల నాడిని పసిగట్టలేక ఈ పార్టీ అభ్యర్థికి పట్టం కడతారు అనేది 1952 నియోజకవర్గం ఏర్పాటు నుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో సంచలనాన్ని తెరలేపే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తూర్పు డివిజన్ గా పేరుగాంచిన మంథని డివిజన్ అని అంటారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి సోషలిస్ట్ పార్టీ కు విజయకేతనాన్ని అందించి తెలుగుదేశం భారత కాంగ్రెస్ తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి తో పాటు మరొక్కసారి భారత కాంగ్రెస్ పార్టీ ఇలా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎవరికి అసెంబ్లీ అధిపతిని ఎన్నుకుంటారనేది సంచలనంగా స్థిర పైకి రావడం జరుగుతుంది 1967 నుండి 202 3 ఎన్నికల వరకు మధ్యలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర సమితి విజయ కేతనాన్ని అందించి పలు తరాలుగా భారత కాంగ్రెస్ అభ్యర్థులను అసెంబ్లీ అధిపతిగా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత ఏమిటంటే 200 9  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే 42.22 33 పై 51 శాతం ఓట్లను నామమాత్రంగా తేడాతో భారత కాంగ్రెస్ అభ్యర్థి 63 వేల ఓట్ల వేసి అసెంబ్లీ అధిపతిగా ఎన్నుకోవడం జరిగింది, అలాగే 2014 విషయానికొస్తే 84 వేల ఓట్లను అందించి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కు మంథని అసెంబ్లీ అధిపతిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 2018 విషయానికొస్తే 89 వేల 0 4 5 ఓట్లు వేసి మంథని ఎమ్మెల్యేగా గెలుపు అందించడం జరిగింది. పై మూడు దశలు చూస్తే కేవలం 15 వేల నుండి 20 వేల ఓట్ల మధ్యలోనే అభ్యర్థులను తమ అసెంబ్లీ అధిపతిగా ఎన్నుకోవడం జరుగుతుందన్న విషయం స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం 2023 ఎన్నికల విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం ఓటర్ల సంఖ్య రెండు లక్షలకు పైబడి ఉంది. ఇక నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బహుజన సమాజ్ వాది తోపాటు మరికొన్ని రాష్ట్రీయ జాతీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కూడా వరిలో ఉంటారని చర్చలు జరుగుతున్నాయి. మంథని నియోజకవర్గం ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అధిపతిని ఎన్నుకోవడంలో తమ ప్రయాణం ఎటువైపు సాగిస్తారనేది ఈనెల 30వ తేదీన బహిర్గతం అవుతుంది.

పార్టీలో చేర్చుకొనుటకే ప్రాధాన్యత, ప్రజల పరిస్థితుల పై ఎవరికి శ్రద్ధ.!?

ఇక ప్రస్తుతం ప్రధాన పార్టీల వ్యవహారం ప్రజల స్థితిగతులు రాబోయే రోజుల్లో వారి అవసరాలకు భరోసా కలిగించే వాగ్దానునాలు మాత్రం ఏ పార్టీ అభ్యర్థి చేయడం లేదు. కానీ ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఏక్కడ చూసిన కుల సంఘాలు యువకులు మహిళా సంఘాల ను టార్గెట్ చేసి తమ పార్టీ కండువా కప్పడమే లక్ష్యంగా గత 20 రోజులుగా నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు పార్టీలు ఆహ్వానించడం మాత్రమే ఒక పని గా రాత్రి పగలు తేడా లేకుండా ఫలానా సంఘం ఫలానా గ్రామం ప్రజలు తమ పార్టీలో చేరారని ఫలానా పార్టీలో గతంలో కొనసాగారని సామాజిక మాధ్యమాల్లో పార్టీ కండువాలు వేస్తూ చిత్రాలను పెట్టడంలో ప్రధాన పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు పార్టీలు చేరిన వ్యక్తులు వారికి మద్దతు పలుకుతారా వారికి సంబంధించిన ఇతరులు తమ పార్టీకి ఓటు ద్వారా మద్దతు తెలుపుతారని ఊహలో ఉన్నారేమో తెలవదు కానీ ఇక్కడ చూసిన ఈరోజు ఫలానా పార్టీ నుండి వలన పార్టీలోకి వందమంది చేరడం జరిగింది వారికి సాధారణంగా పార్టీలో ఆహ్వానించారు అన్న వార్తలు తెరపైకి రావడం విశేషం. కానీ అభ్యర్థులు ఎవరు కూడా మీ గ్రామ పరిస్థితులను విద్యార్థుల అవస్థలు నిరుద్యోగుల సమస్యలు వైద్య సదుపాయంలో కలుగుతున్న ఇబ్బందులు ప్రభుత్వ కార్యాలయాల్లో పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాల పై ఏ ఒక్క ఎంఎల్ఏ గా బరిలో ఉన్న వ్యక్తి చెప్పడం లేదు అనే విషయం పార్టీ కండువా వేసుకున్న వారితో పాటు సాధారణ ఓటర్లు చెప్పుకుంటున్న మాటలు ఇవి, 30వ తేదీ ఎన్నికల రోజు వరకు ప్రధాన పార్టీలు పార్టీలు ఆహ్వాన కార్యక్రమాల్ని కొనసాగిస్తారా లేక ఓటర్లను వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఓటర్ల మనసు దోచుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

ఉదయం ఓ కండువా, సాయంత్రం ప్రలోభాలకు గురయ్యారని,మరో కండువా ఇది పరిస్థితి ప్రజలు నమ్మేది ఎట్లా.!?

తుప్పర్ల బలం లేని వ్యక్తి కూడా రాజకీయ పార్టీ కండువా కప్పుకొని తొడ కొడుతున్నాడు అంటే ఓటు వేసి తమ అభ్యర్థి నీ ఎన్నుకోవడంలో ఎంతో తెలివితేటలను చూపుతో వస్తున్న మంథని నియోజకవర్గ ప్రజలకు రోజుకొక కండువా మార్చిన బుడ్డ నాయకుల మాటలు విని ఓట్లు వేసి పరిస్థితి ఉందని అనుకుంటే ఎం ఎల్ ఏ గా పోటీ చేసే అభ్యర్థులు తమ గెలుపు పై ఆశను వదులుకోవాల్సిందే, ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి కేవలం నామమాత్రంగా ఓటర్ల తేడాతో అభ్యర్థులను ఎన్నుకుంటూ వస్తున్న పరిస్థితులు ఒకవైపు అయితే తుప్పర్ల బలం లేని నాయకులు కాసులకు ఆశపడి తమ వెంట కులం సంఘం యువకులు మహిళ సంఘాలు ఉన్నాయని కేవలం చేతులు తడుపుకొనుటకే ఉదయం ఓ పార్టీలో చేరి తిరిగి తాము కొందరు చెప్పిన మాటలకు నమ్మి వాస్తవాన్ని మరిచిపోవడం అలాగే కొందరి చెప్పుడు మాటలకు ప్రలోభాలకు గురయ్యామని నీతి సూత్రాలు చెబుతూ పార్టీ కండువాలను మార్చుకొనుటమే ఒక పనిగా పెట్టుకుని గత 20 రోజుల నుండి నేటి వరకు అదే పని కొనసాగించడం ప్రధాన పార్టీ అభ్యర్థులు నేటికీ వారి మాటలను నమ్మి 10 15 మంది పార్టీలో వస్తామంటే ఫలానా పార్టీలో జాయినింగ్ కార్యక్రమం అని ప్రారంభిస్తూ కండువా కప్పడం కొనసాగించడంలో కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే తప్ప ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో విఫలమవుతున్నారని గ్రామాల్లో ప్రజలు చెప్పుకోవడం విశేషం. ఇలాంటి నాయకులు నమ్మిన అభ్యర్థులు వారి మాటలకు ఓటర్లు ప్రభావం చూపి ఆయా ప్రధాన పార్టీలకు ఓటు వేస్తారని ఎమ్ ఎల్ ఏ బరిలో ఉన్న అభ్యర్థులు నమ్మితే ఆశలు గల్లంతే అది కూడా అనుకుంటున్నారు.

అందరూ మేనిఫెస్టో చూపిస్తున్నారు, చేసిన పని ఏమిటి నిరూపించుకోలేకపోతున్నారాన అనేది ప్రధాన ప్రశ్న.!?

మేనిఫెస్టో అంటే ఎన్నికల అనంతరం ప్రజలు వారి ఓటు హక్కును అందించి గెలుపొందిన అనంతరం ప్రజలకు అందించే పథకాలు వాటి యొక్క వివరాలు మేనిఫెస్టో ప్రణాళిక అని అంటారు అది మన అందరికీ తెలిసిందే. ప్రణాళిక మేనిఫెస్టో అనేది రేపటి రోజు భవిష్యత్తు అని కూడా విశ్లేషించొచ్చు మేనిఫెస్టో ప్రణాళిక చూస్తే బాగుంది కానీ ప్రత్యేకంగా ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో అధికారపక్షం ప్రతిపక్షం ఇద్దరూ కూడా మేనిఫెస్టో చూపిస్తున్నారు మేనిఫెస్టోలో అనేక పథకాలు ఈ పథకాలన్నీ తాము విజయం సాధించిన మరుక్షణమే అమలులోకి వస్తాయని వాగ్దానాలు చేస్తూ గడపగడపకు పత్రాలను చూపెట్టడం జరుగుతుంది. అధికారపక్షం ప్రతిపక్షం గడిచిన ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని 9 మండలాలకు సంబంధించిన ప్రజలకు ఇలాంటి వెసులుబాటు కలిగించింది ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారులకి అందించే దిశలో పని చేశారా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ఇతర అభివృద్ధి పథకాలు గ్రామాల్లో మండలాల్లో ఎంతవరకు చేశారు ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామాలకు ఆదుకోనడంలో వారి పాత్ర ఎంత అన్యాయానికి గురవుతున్న ప్రజలకు వైద్య విద్య వ్యవసాయం అభివృద్ధి ఇలాంటి విషయాల్లో పాలక పక్షం ప్రతిపక్షం ఎలాంటి కార్యాచరణ రూపొందించి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఎక్కడైనా తాము చేసిన పనిని నిరూపించుకొని ప్రజలను తమకు తిరిగి అధికారం ఇవ్వండి అని నిస్సందేహంగా అడిగే హక్కు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కదా కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా ప్రతిపక్షం అధికార పక్షం గడిచిన ఐదు సంవత్సరాల పనులను ప్రజల ముందుకు తాము నియోజకవర్గంలో ప్రజలకు గ్రామాలకు ఫలానా సమయంలో విద్యా వ్యవసాయం వైద్యం లాంటి రంగాల్లో మీకు ఆసరాగా ఉన్నామని చెప్పుకోవాలి కానీ మేనిఫెస్టో చూపెట్టి మాకు ఓటేయండి మేము ఇది చేస్తాం అనే విషయం కాస్త ఓటర్లను కూడా సందిగ్ధంలో పెడుతుందన్నది ప్రస్తుత నియోజకవర్గ ప్రజల నాడి అని చెప్పవచ్చు.

 

అసెంబ్లీ ఎన్నికలు కదా ఓట్ల కొరకు భాగవతాలు ఎక్కువగా కనబడతాయి మోసపోతే గుస పడినట్టే.!?

ఇక ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఎన్నికలు జరిగే సమయం కొద్ది రోజుల్లోనే ఉన్న క్రమంలో నియోజకవర్గం లోని అనేక పార్టీ అభ్యర్థులు ఫిదా అమాయక ప్రజలను మోసం చేయుటకు అనేక భాగవతాలను వేసే ప్రక్రియ కూడా త్వరలో ప్రజల ముందుకు వస్తాయి. అనుకోలేని రీతిలో అభ్యర్థుల చేష్టలు గాలి మాటలకు కుదువ లేకుండా పోతుంది. ప్రత్యేకంగా చేతివృత్తుల సంఘాలకు రాజకీయ నాయకుల గిరాకు ఏమాత్రం ఉండదు కానీ ఆయా కులవృత్తుల సంఘాల ప్రాంతాల్లో మాత్రం రాజకీయ నాయకులు బురిడీ కుట్టించుకొనుటకు పారలు తట్టలు నెత్తిపై పెట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాపార కులవృత్తుల కేంద్రాలకు రాజకీయ నాయకులు వారు తీరే సమయం ప్రధానంగా ఎక్కువ మోతాదులో అసెంబ్లీ ఎన్నికల్లో కనబడతాయి. ఒక సంఘం తట్ట నెత్తిపై పెట్టుకుంటే ఆ సంఘం ఓట్లు తమకే వస్తాయని భ్రమతో మాయ మాటలు చెప్పి అమాయకులను మోసం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. నియోజకవర్గ ప్రజలు కుల సంఘాలు ప్రత్యేకంగా కుల వృత్తుల వ్యక్తులు మాయమాటలను నమ్మి మూస పోయే పరిస్థితులకు దారి తీసుకోవద్దు. మేధావులుగా ఉన్న ప్రజానీకం నాడు నేడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తమ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎవరు తీరుస్తారు అనే విషయంపై విశ్లేషించి ప్రజలకు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆయుధంగా ఉన్న మీ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరముంది. మాయమాటలకు నమ్మి మోసపోతే చివరికి అమాయక ప్రజలు మాత్రమే గోసపడతారన్న విషయం నియోజకవర్గం నువ్వు నీ ప్రతి ఒక్క ఓటరు గమనించి తమ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.

నియోజకవర్గ ప్రజలు తమ మేధస్సును పనిలో పెట్టి ఓటు వేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో రేషన్ బియ్యానికి కూడా దిక్కు లేకుండా పోయే పరిస్థితి.!?

అసెంబ్లీ ఎన్నికల సమయం కొద్ది రోజుల్లోనే నియోజకవర్గ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. అన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే, నియోజకవర్గ ప్రజలు గత పరిస్థితులను అలాగే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తమ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి నుండి మొదలుకొని అనేక ప్రధాన సమస్యలు నాటి నుండి నేటి వరకు అమాయక ప్రజలకు సుఖ శాపం గా మారి ఉన్నప్పటికీ కూడా ఏ నాయకుడు ప్రజలను అక్కున చేర్చుకున్నాడు అన్న విషయం మీ యొక్క మేధస్సుతో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సమస్యలను పరిష్కరించే దిశలో ఏ నాయకుడు మీకు తోడై నడుస్తాడన్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కుల సంఘాలు గ్రామ పెద్దలు సమక్షంలో చర్చించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. గతం నుండి నీటి వరకు ఇక్కడ చూసిన పేద ప్రజలను మాయ మాటలు చిల్లర కాసులకు బానిస చేసి ఓటును లాక్కున్న నాయకులు వారి భవిష్యత్తు వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో సఫలీకృతులు అయ్యారు కానీ భారత రాజ్యాంగం అందించిన ఒక పవిత్ర ఓటు హక్కును బురిడీ మాటలతో బోల్తా కొట్టించి అమాయక పేద ప్రజల అందించిన ఓటు విలువను అమాయక ప్రజలకు మాత్రం బుక్కెడు బువ్వ మంచినీరు లాంటి అందించడంలో నాయకులు విఫలమయ్యారన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో గ్రామాల్లో గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకుల సమక్షంలో సమస్యల పరిష్కారం కొరకు ప్రశ్నించి ఓటు వేస్తే నియోజకవర్గ ప్రజల జీవితాలు బాగుపడతాయే తప్ప కాసులకు బురిడీ మాటలకు నమ్మిపోతే రాబోయే రోజుల్లో రేషన్ బియ్యానికి కూడా పేదలకు దక్కనివ్వరన్న విషయం నియోజకవర్గ ప్రజల ముందు రాక తప్పదు అన్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అని అనుకోక తప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *