BJP Leadership Vacuum in Pargi
పరిగి బీజేపీ సారథి ఎవరు?
పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.
పరిగి(వికారాబాద్): పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు. పార్టీలో ఏళ్లనుంచి కొనసాగుతున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయకపోయినా కమలం గుర్తు 16వేలకుపైగా ఓట్లు సాధించించింది. లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఇటీవలి పురపాలక ఎన్నికల్లోనూ ఉనికి చాటింది. రెండు వార్డుల్లో గట్టి పోటీనిచ్చింది. కొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడారు. పోలైన ఓట్లలో తొమ్మిది శాతం(1,659) సాధించింది. అయితే నాయకత్వలోపం సమస్యగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. గతంలో ఎప్పు
డూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పది వేలలోపే ఓట్లు పడేవి. అయితే క్రమంగా పార్టీ బలపడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.
