ఎవరా…’ఇసుకా’సుర?

కాటారం మలహర్ లో గుట్టు చప్పుడు కాకుండా జీరో దందా!

సహకరిస్తున్న ఆ ఇద్దరు ఎవరు?

కాటారం మలహర్ లో పట్టుకున్న లారీలు ఎవరివి?

ఒక్కో లారీకి పదివేలు తీసుకున్న అధికారులెవరు?

ఆ ఇద్దరు అధికారులు ఆ బడానేతకు ఎలా అనుచరులు?

జీరో దందా ఎవరిది…లంచాలు ఎవరి జేబుల్లోకి…

“నేటిధాత్రి” హైదరాబాద్

ఎవరు అధికారంలో వుంటే వాళ్లదే రాజ్యం…బోజ్యం. ఒక్కసారి పవర్ చేతిలోకి వస్తే చాలు అడ్డూ, అదుపూ లేని సంపాదనకు తెగబడటమే నాయకులు అలవాటు చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు, విలువలు. అధికారం మారితే ఆదాయాలు, సంపాదనలు. ఎంచుకునేవి మార్గాలు. జీరో దందాలు చేయడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. అవి ఆనవాయితీ మార్చుకుంటున్నారు. అలాంటి బాగోతం భూపాలపల్లిలో జీరో ఇసుక దందా జోరుగా సాగుతోంది. అందరికీ తెలుసు. అయినా కళ్లు మూసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జీరో ఇసుక దందా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ఎవరు అధికారంలో వుంటే వాళ్లకు వంత పాడడం, అనుకూలంగా వ్యవహరించడం అధికారులు అలవాటు చేసుకున్నారు. లేకుంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన వాటిని తవ్వి తీస్తారు. వెలుగులోకి తెస్తారు. అందుకే ఎవరు అధికారంలో వుండి తవ్వి తీసుకునే అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తుంటారు. నాలుగు పైసలు పోగేసుకుంటారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఉద్యోగాలకు ఢోకా లేకుండా చూసుకుంటారు. కానీ ప్రజా ధనం దుర్వినియోగమౌతుందన్నది మాత్రం పట్టించుకోరు. దాంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ బడా నాయకుడి అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అయితే గత రెండు రోజుల నుండి కాటారం సీఐ నాగార్జున రావు ఆరు లారీలను సీజ్ చేశారు. ఆ లారీలు సదరు నాయకుడివి అని తెలుస్తుంది. అడుగడుగునా చెక్ పోస్ట్‌లున్నా ఆ నాయకుడికి రోజుకి 15నుంచి 20 లారీలు జీరో దందాలో ఎలాంటి వే బిల్లులు లేకుండా లారీకి పదివేల రూపాయలు తీసుకుంటూ ఆ ఇద్దరు అధికారులు వదిలేస్తున్నారు ఆ నేత లారీలకు ఎలాంటి ఆటంకం వుండదు. అందుకు ఓ ఇద్దరు అధికారులు సహకరిస్తున్నారని ప్రచారం. ఆ నాయకుని వెనుక ఉన్న ఆ ఇద్దరు అధికారులు ఎవరు? ఆ రెండు మండలాల నుండి జీరో దందా ఇసుక నడిపించడానికి ఇన్ని నెలల నుండి అధికారులు ఎందుకు సహకరిస్తున్నారు. ఆ నాయకునికి ఎందుకు భయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఆ నాయకుడి పర్సనల్ ఫోన్ ఆ ఇద్దరి అధికారుల పర్సనల్ ఫోన్లు రికార్డులు తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ప్రజలు అంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇసుక జీరో దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *