
Pawan Fans in London
మీ రూల్స్ ఎవరికి చెప్పారు.. ఎక్కడ పెట్టారు..
అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్ థియేటర్లో ఫాన్స్ చేసిన హంగామా ట్రోలింగ్‌కు గురైంది
ఇండియన్ చిత్రాలకు ఓవర్సీస్లో క్రేజ్ ఎక్కువ. అందులోనూ తెలుగు చిత్రాలకు మరీ ఎక్కువ. తాజాగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ ఓవర్సీస్లో భారీ స్థాయిలో విడుదలైంది. అభిమానులు ప్రతి చోటా కోలాహలం చేశారు. అయితే అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో మంచిగా ఉన్నా.. పలు సందర్భాలో పరువు తీసే విధంగా ఉంటాయి. యూకేలోని సినీ వరల్డ్ థియేటర్లో (UK Cine world Theater)ఫాన్స్ చేసిన హంగామా ట్రోలింగ్‌కు గురైంది. ‘హరిహర వీరమల్లు’ (HHVM)చిత్రం ప్రొజెక్షన్ జరుగుతుండగా ఆ అభిమాని సృష్టించిన హంగామా ఇంటర్నెట్ అంతా వైరల్ అయింది. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 25న లండన్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో హరిహర వీరమల్లు చిత్రం షో జరుగుతోంది. తొలిరోజే లండన్ సమీప ప్రాంతాల అభిమానులు అంతా ఆ ధియేటర్‌కి చేరుకున్నారు. తమ అభిమాన హీరోని తెరపై చూడగానే ఉత్సాహం ఆపుకోలేక రంగు కాగితాలు స్క్రీన్ పై చల్లుతూ ఎంజాయ్ చేశారు.
ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ‘థియేటర్ సిబ్బంది సరిగ్గా స్పందించారు’ అంటుంటే, మరికొందరు ‘‘అభిమానులు అత్యుత్సాహం వల్ల ఇతరులకు అసౌకర్యం కలిగింది’’ అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ‘ఇది ఇండియా కాదు’ అనే మాట ఇప్పుడు ట్రెండింగ్ ట్యాగ్‌గా మారింది.