చేనేత కార్మికుల రాత మార్చేది ఎవరు!
పాలన మారిన కూడా చేనేత కార్మికుల రాత మార దా!
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో చాలామంది పనిచేస్తున్నారు. మనిషి జీవించాలంటే నీరు ప్రధానం ప్రపంచానికి ఆహారానందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాలను నేసే నేతన్న కూడా అంతే అవసరమనడంలో అతియోక్తి లేదు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంతవరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. మానవాళికి వస్త్రాన్ని అందించడమే కాకుండా అగ్గిపెట్టెలో పెట్టే ఆరడుగుల చీరను కూడా నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర మన చేనేత కళాకారులది చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సృష్టించడం నేతన్నకు మారుపేరు. భారతీయత సంస్కృతిక కళలతో ఒకటైన చేనేత కళ ప్రపంచానికి ఆదర్శం మరియు మన దేశానికి గర్వకారణం.
చేనేత కార్మికుల కన్నీటి గాధ.
మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక చిత్రమైంది మువ్వన్నెల జెండా నేసిన నేతలకు నేడు చేయూత కరువైంది సనాతన సంప్రదాయాలకు కనుమరుగవుతున్న తన సంప్రదాయ వారసత్వ వృత్తిని కలల కాపాడుకుంటున్న నేతన్న కలతప్పిపోయిన బ్రతుకు కీడుస్తున్నాడు. మొదటినుంచి చేనేత గొప్పదనాన్ని ఉపన్యాసాలు నుంచే చాలామంది నాయకులు వారి జీవితాలను బాగు చేసే బాధ్యత నుంచి మాత్రం తప్పించుకుంటున్నారు మూడు పూటలా కష్టపడే నేతన్న నేడు తన బిడ్డలకు ఒక్క పూట కూడా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నారు అలాంటి పరిస్థితులు రావద్దని సూరత్, భీమండి, సిరిసిల్లకు వలసలు పోతున్నారు గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. అప్పులు తీర్చలేక కుంటు పడుతున్న నేతన్నను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.
ఎదుర్కొంటున్న సమస్యలు
కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో సరైన నిధులు కేటాయింపులకు లేకపోవడం, వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్న లు వారు తయారు చేసిన లుంగీలు, చెద్దర్లు టవల్స్ నేసి చేనేత సహకార సంఘానికి అందిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి కల్పించలేకపోవడం తీవ్రస్థాపన గురవుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
కింద ప్రభుత్వం చేనేత పై విధించిన జిఎస్టి రద్దు చేయాలి సహజసిద్ధమైన నూలు చేనేత వస్తాలను జిఎస్టిలో మినహాయించకపోతే నేతన్నలకు ఉపాధి పూర్తిగా తగ్గిపోతుంది బడ్జెట్లో సరైన నిధులు కేటాయించి చేనేత కార్మికుల మీద దృష్టిపెట్టాలి. రాజ్యాంగ ప్రకారం చేనేత కార్మికులకు స్వయం ఉపాధి కల్పించాలి అంతరించిపోతున్న చేనేత కలను కాపాడు కోవాల్సిన బాధ్యత మన అందరిదీ చేనేత వస్తాను దరిద్దాం నేతన్నలు కాపాడుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానం ఎప్పుడెప్పుడా నెరవేరుతుందని నేతన్నలు 1000 కన్నులతో ఎదురుచూస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నట్లైతే చేనేత రంగం అభివృద్ధి చెందడమే కాక వారి పార్టీకి కూడా మంచి పేరు లభిస్తుందని చేనేత కార్మికులను వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత సమస్యలు గుర్తించి సమస్యలను రూపు మాపేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.