నేటి ధాత్రి కథనాలతో రేషన్ బియ్యం కాంటా, ప్రతి డీలర్ కు రెండు నుండి ఆరు సంచులు అదనం.!?
పుష్కరకాలంగా పక్కదారి పట్టించిన రేషన్ బియ్యం సివిల్ సప్లై కాంట్రాక్టర్ జిసిసి అక్రమంగా తరలించుకుంది తెలుగులోకి వాస్తవం.?
సివిల్ సప్లై కమిషనర్ ఫుడ్ కమిషన్ ఇకనైనా చర్యలు తీసుకోరా దీనికి డీలర్లే సాక్ష్యం.!?
సివిల్ సప్లై జిసిసి నిర్లక్ష్యంతో హమాలీలకు మూడు నెలలుగా కమిషన్ లేక పండుగ కు పస్తులే.
మహాదేవపూర్-నేటిధాత్రి;
రేషన్ బియ్యం సరఫరాలో సివిల్ సప్లై తో పాటు జిసిసి స్టేజ్ వన్ టూ కాంట్రాక్టర్ల కుమ్మక్కు ఒకటి రెండు సంవత్సరాల నుండి కాకుండా పుష్కరకాలంగా సుమారు 15 సంవత్సరాలుగా కేవలం సంచుల పేరుతో తూకం లేకుండానే సరఫరా చేయడం వరంగల్ లేదా ఇతర గోదాముల నుండి స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ద్వారా వచ్చిన రేషన్ బియ్యం లారీల్లో వస్తున్న బియ్యం బస్తాలు 600 బస్తాలు వాటిలో బియ్యం నిలువ 2 9 9 6 2 అనే గణాంకాలను సివిల్ సప్లై అధికారులు అందిస్తూ పుష్కరకాలంగా ఆడుతున్న నాటకం. నేటి ధాత్రి వరుస కథనాలతో సంచలన వాస్తవాలు సివిల్ సప్లై స్టేజ్ 1 2 కాంట్రాక్టర్లు గిరిజన సహకార సంస్థ పర్యవేక్షణలో రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న ఎం ఎల్ ఎస్ కేంద్రం నిర్వాహకులు పుష్కరకాలంగా చేసిన అక్రమాలు దొడ్డి దారిన పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన వాస్తవాలు సాక్షాలుగా నేడు తెరపైకి రావడం జరిగింది. ఎమ్మెల్యేస్ కేంద్రంగా సాగుతున్న అవినీతి మాత్రం సాక్షాలతో బట్టబయలు కావడం జరిగింది. కానీ సివిల్ సప్లై అధికారులతో పాటు స్టేజ్ 1 2 కాంట్రాక్టర్ల వ్యవహారం బయటపడాలంటే కమిషనర్ మరియు ఫుడ్ కమిషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగుతూనే రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడుతుంది.
పుష్కరకాలంగా మరిచిపోయిన తూకం, ఆ రేషన్ బియ్యం ఎవరు బుక్కారు.!?
సంవత్సరాల తరబడి సివిల్ సప్లై శాఖ మహదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లతోపాటు ప్రభుత్వ వసతి గృహాలకు అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి పాఠశాలలకు అలాగే అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసిన దొడ్డు మరియు సన్న బియ్యం పుష్కరకాలంగా కేవలం 50 కిలోల సంచి పేరుతో లక్షల కింటల్లా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ప్రతి సంచిలో సుమారు 6 నుండి 8 కిలోల రేషన్ బియ్యం తరుగు ఉన్నప్పటికీ 50 కిలోల సంచి పేరుతో సరఫరా చేస్తూ లెక్క లేనటువంటి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరిగింది. తూకంలో తక్కువ వచ్చిన రేషన్ బియ్యం మాత్రం రేషన్ డీలర్లు అలాగే వసతి గృహాల్లో వచ్చింది అదృష్టం అంటూ పాలెం గట్టి ఎక్కించుకోవడం జరిగింది. రేషన్ బియ్యం అంతర్గతంగా బుక్కుతున్నారన్న సమాచారం నేటి ధాత్రి విశ్లేషణలో పలు ఆసక్తికరమైన సమాచారాలు తెలవడంతో నేటి ధాత్రి రేషన్ బియ్యం పక్కదారిపై కథనాలను ప్రారంభించడం జరిగింది. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని అనేక సంచలన వాస్తవాలను తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. నేటి ధాత్రి కథనాలతో ఉలిక్కిపడ్డ సివిల్ సప్లై మహాదేవపూర్ ఎంఎల్ఎస్ కేంద్రం వద్ద తూకం వేస్తూ డీలర్లకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడం ప్రారంభించింది. కానీ పుష్కరకాలంగా సి డబ్ల్యూ సి నుండి అలాగే ఇతర గోదాముల నుండి రవాణా అయినటువంటి రేషన్ బియ్యం కూత విధిస్తూ అనేక సంవత్సరాలుగా అందించిన తూకంలో మాత్రం లెక్క ప్రకారం ఇవ్వడం జరిగిందని రాయించుకున్న అధికారులపై అలాగే పక్కదారి పట్టిన రేషన్ బియ్యాన్ని ఎవరు బుక్కారు అనేది సివిల్ సప్లై కమిషనర్ అలాగే ఫుడ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ తేల్చాల్సిన అవసరం ఉంది.
నేటి ధాత్రి కథనాలతో రేషన్ బియ్యం కాంటా, ప్రతి డీలర్ కు రెండు నుండి ఆరు సంచులు అదనం.!?
నేటి ధాత్రి కథనాలతో పుష్కరకాలంగా మరిచిపోయిన తూకం వ్యవహారం తిరిగి ప్రారంభం కావడంతో రీసన్ డీలర్ల ఆనందానికి అంతులేకుండా పోయింది. సుమారు 15 సంవత్సరాలుగా ప్రతి రేషన్ డీలర్ కు 60 కిలోల నుండి రెండు కింటల్లా 75 కిలోల రేషన్ బియ్యం ప్రతినెల తక్కువ రావడం ప్రశ్నించే పరిస్థితి లేకపోవడం పలు డీలర్లు తమకు అన్యాయం జరుగుతుందని చెబితే సివిల్ సప్లై అధికారులచే రీసన్ షాపుల్లో తనిఖీలు చేసి కేసులు పెట్టించడం లాంటి పనులు చేపడుతూ సివిల్ సప్లై అధికారులు స్టేజ్ వన్ స్టేజ్ టు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఇన్ ఎల్ ఎస్ కేంద్రం జి సి సి సహకారంతో అనేక సంవత్సరాలుగా లెక్కలేనంత రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన విషయం వాస్తవాలతో నేడు తెరపైకి రావడం జరిగింది. ఈరోజు రేషన్ డీలర్లకు అందిస్తున్నటువంటి రేషన్ బియ్యం తూకం వేయడంతో సుమారు ప్రతి డీలర్కు రెండు నుండి ఎనిమిది బస్తాలు ఎక్కువగా రావడం జరుగుతుందని నేటి ధాత్రికి మహదేవ్పూర్ మండలం తో పాటు చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లు తెలపడం జరిగింది. రేషన్ డీలర్లు అనేక సంవత్సరాల నుండి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం కూత తబ కుటుంబానికి అనేక ఇబ్బందులు తీసుకువచ్చిందని నేడు తమకు అందాల్సినటువంటి రేషన్ బియ్యం తూకం వేయడంతో కూత లేకుండా తమకు అందడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
పుష్కరకాలంగా పక్కదారి పట్టించిన రేషన్ బియ్యం సివిల్ సప్లై కాంట్రాక్టర్ జిసిసి అక్రమంగా తరలించుకుంది తెలుగులోకి వాస్తవం.?
నేటిదాత్రి అక్రమ రేషన్ బియ్యం రవాణా కథనాలు ప్రచురించకుంటే నేటి వరకు సివిల్ సప్లై అధికారులు స్టేజ్ 1 కాంట్రాక్టర్ అలాగే స్టేజ్ టు కాంట్రాక్టర్ తో పాటు ఎంఎల్ఎస్జిసిసి అంత కుమ్మక్కై కేవలం సంచుల లెక్కలు వేస్తూ అమాయక రేషన్ డీలర్లకు ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు యధావిధిగా రేషన్ బియ్యం సరఫరా కొనసాగింపచేసేది. కానీ పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని తూకం లేకుండానే రేషన్ బియ్యం సరఫరా తోపాటు స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎంఎల్ఎస్ కేంద్రానికి తరలిస్తున్న రేషన్ బియ్యం లో పెద్ద మొత్తంలో కోత విధించి లారీల్లో సంచులు తరలిస్తున్నారని వాస్తవాలను సాక్షాలతో నేటి ధాత్రి తెరపైకి తీసుకురావడం జరిగింది. నీటి ధాత్రి ప్రచురించిన ప్రతి కథనం అక్షర సత్యాలుగా కావడం పుష్కరకాలంగా 5 మండలాలకు సంబంధించిన రేషన్ బియ్యం సరఫరాలో కేవలం బస్తాలు 50 కిలోల రేషన్ బియ్యం ఉన్నాయని సరఫరా చేస్తూ ఆన్లైన్ తమ్మింగ్లో మాత్రం కిలోల చొప్పున డీలర్లు మరియు ఇతర ప్రభుత్వ పాఠశాల వసతి గృహాలకు సంబంధించిన నిర్వాహకులతో వేలు ముద్ర చేసుకొని వేల కింటల్లా రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం గత నెల వరకు కొనసాగింది. దానికి సాక్ష్యాలు నేడు రేషన్ బియ్యం తూకం వేసి అందించడం ప్రతి డీలర్కు రెండు నుండి ఆరు బస్తాలు ఎక్కువ రావడం ప్రత్యక్ష సాక్ష్యం. రేషన్ బియ్యం సరఫరాలు సిడబ్ల్యుసి నుండి ప్రారంభమై సివిల్ సప్లై అధికారుల ప్రోత్సాహంతో స్టేజ్ వన్ స్టేజ్ టు అలాగే ఇన్ ఎల్ ఎస్ జి సి సి కేంద్రంగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరిగిందని వాస్తవం సాక్షాలతో రుజువై ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది.
సివిల్ సప్లై కమిషనర్ ఫుడ్ కమిషన్ ఇకనైనా చర్యలు తీసుకోరా దీనికి డీలర్లే సాక్ష్యం.!?
మహదేవ్పూర్ ఎంఎల్ఎస్ కేంద్రంగా ఐదు మండలాలకు సంబంధించిన ప్రభుత్వ అలాగే రేషన్ డీలర్లకు రేషన్ బియ్యం సరఫరా విషయంలో అనేక సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయని తూకం లేకుండానే కేవలం సంచుల లెక్కతో రేషన్ డీలర్లకు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలకు అంగన్వాడీ కేంద్రాలకు పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సరఫరా కొనసాగించడం ఎంఎల్ఎస్ కేంద్రంగా సర్పరాజ్ అయిన రేషన్ బియ్యం సంచుల్లో అంతులేనటువంటి రేషన్ బియ్యం కోత ఉండడం అనేక సంవత్సరాలుగా లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులకు ప్రశ్నించే పరిస్థితి లేకుండా సివిల్ సప్లై అధికారుల ఒత్తిళ్లకు బలి అవుతూ సుమారు 15 సంవత్సరాల పుష్కర కాలాన్ని ఇటూ లబ్ధిదారులు రేషన్ డీలర్లు ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలు వారు పడ్డ ఇబ్బందులు ఎన్నో, చివరికి నీటి ధాత్రి రేషన్ బియ్యం పక్కదారి సివిల్ సప్లై అధికారులతో పాటు కాంట్రాక్టర్లు ఇన్ ఎల్ ఎస్ జి సి సి చేస్తున్న ఆగడాలను బహిర్గతం అనంతరం ఎం ఎల్ ఎస్ కేంద్రంలో తూకం ద్వారా రేషన్ బియ్యాన్ని అందించడం ప్రారంభించడంతో కాస్త ఊరట లభించింది. అనేక సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న క్రమంలో వాస్తవాలను సాక్షాలను తెరపైకి తీసుకువచ్చినప్పటికీ కూడా సివిల్ సప్లై కమిషనర్ అధికారులపై చర్యలకు ఆదేశించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. కేవలం కాగితాలపై అలాగే సంచుల లెక్కలు సాఫీగా ఉన్నాయని సివిల్ సప్లై అధికారులతో పాటు ఇన్ ఎల్ ఎస్ కేంద్ర నిర్వాహకులు తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా స్టేజ్ 1 2 కాంట్రాక్టర్లు అనేక సంవత్సరాలుగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం జరిగిందన్న వాస్తవం నేడు బహిర్గతం కావడం జరిగింది. ఇప్పటికైనా తక్షణమే పుష్కరకాలంగా తూకం వేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ బియ్యం సరఫరా చేయడానికి కారణమేమిటని ప్రజానికం సివిల్ సప్లై అధికారులకు ప్రశ్నించక తప్పడం లేదు. 15 సంవత్సరాల నుండి బస్తాల పేరుతో రవాణా చేసిన రేషన్ బియ్యానికి పెద్ద మొత్తంలో గండిపెట్టి పక్కదారి పట్టించిన అధికారులపై తక్షణమే సివిల్ సప్లై కమిషనర్ ఫుడ్ కమిషన్ ఆఫ్ తెలంగాణ తోపాటు నేషనల్ ఫుడ్ అథారిటీ వెంటనే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సివిల్ సప్లై జిసిసి నిర్లక్ష్యంతో హమాలీలకు మూడు నెలలుగా కమిషన్ లేక పండుగ కు పస్తులే.
రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన సివిల్ సప్లై మరియు జిసిసి అధికారులకు హమాలీలకు ఇబ్బందులు పెట్టడం పెద్ద లిక్కీని కాదు . సుమారు మహాదేవపూర్ ఎంఎల్ఎస్ పరిధిలో ఉన్న ఇరవై ఒక్క హమాలీలకు గత మూడు నెలలుగా కమిషన్ లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నట్లు తెలుస్తుంది. కేవలం ఎం ఎల్ ఎస్ గోదాం నుండే వారికి జీవన ఆధారంగా ఉండడంతో మరి ఇతర పనులకు వెళ్లే పరిస్థితి వారికి ఉండకపోవడం మరోవైపు మూడు నెలలుగా కమిషన్ రాకపోవడంతో కుటుంబ వారి ఇబ్బందులు చెప్పుకోలేని గా ఒకేసారి రావడంతో సతమతం కావడం జరుగుతుంది. మరోవైపు మరికొన్ని రోజుల్లో దసరా పండుగ సమీపిస్తున్న క్రమంలో ప్రస్తుతం మూడు నెలలుగా తమకు కమిషన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఒకవైపు అయితే మరోవైపు దసరా పండుగ రావడం హమాలీలకు మరింత ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు తట్టుకుంటూ కూడా నేడు హమాలీలు తమ పనిని కొనసాగిస్తున్నారు. జిసిసి మరియు సివిల్ సప్లై అధికారులు మూడు నెలలుగా హమాలీలకు కమిషన్ అందించకపోవడానికి కారణం ఏమిటి జిసిసి తోపాటు సివిల్ సప్లై అధికారులకు మూడు నెలలుగా జీతాలు లేవా ఒకవేళ వారికి జీతాలు లేకుంటే వారి కుటుంబ పరిస్థితి ఏలా ఉంటుంది, మా బాధలు వారికి ఇలా అర్థమవుతుంది అంటూ హమాలీలు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే కమిషనర్ తమకు కమిషన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.