“ఖాకీ”లో మానవతా దృక్పథం..
ఇంతేజార్గంజ్ మహిళా కానిస్టేబుల్ హృదయాన్ని కదిలించిన ఘటన.
“నేటిధాత్రి”, వరంగల్.
దేశాయిపేట పీహెచ్‌సీ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ నవనీత ఒక “ఉదార” ఉదాహరణగా నిలిచారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడి ప్రాంతంలో ఉన్న నిరుపేద వృద్ధులు దయనీయ పరిస్థితి కళ్లారా చూసిన ఆమె, చలించిపోయి తన వంతుగా వారికి దుస్తులు అందజేశారు.
సాధారణంగా “ఖాకీ” కఠినత్వానికి ప్రతీకగా కనిపించినప్పటికీ, “నవనీత” చూపిన మానవతా హృదయం “ఖాకీ వెనుక దాగి ఉన్న సేవాస్ఫూర్తిని” బయటపెట్టింది. ఈ సందర్భంగా ఇంతేజార్గంజి పోలీసు స్టేషన్ ఎస్సై సందీప్, ట్రైనీ ఎస్ఐ తేజ, స్థానికులు మహిళా కానిస్టేబుల్ ను అభినందించారు.
ఈ స్ఫూర్తిదాయక చర్యతో పోలీస్ వ్యవస్థ కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాక, సమాజానికి అండగా నిలబడే మానవతా సహచరులుగా ఉన్నారనే విషయం మరోసారి రుజువైంది.
నేటిధాత్రి తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ..
