Call to Protect MGNREGA Rights in Nizampet
బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి
నిజాంపేట్, నేటి ధాత్రి
ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో డి బిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కూలీల లో కలవడం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల హక్కులను హరిస్తుందని, కూలీల గొంతును నొక్కేందుకే వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని,
బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు కూలీలకు పిలుపునిచ్చారు.
సోమవారం నాడు నిజాంపేట మండలం వెంకటాపూర్ కె గ్రామంలో ఉపాధి హామీ పనుచేస్తున్న కూలీలను కలిసి చట్టానికి జరిగే నష్టాలను వివరిస్తూ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు.
కేంద్రములో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘింస్తూ కూలీల హక్కులను పూర్తిగా తీసివేస్తూ పనికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని యదవిధంగా కొనసాగించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో వామపక్షాలు, సామాజిక శక్తుల తివ్రమైన ఒత్తిడితో వచ్చిన యంజి ఎన్ అర్ ఇజిఎను తీసివేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
కూలీలకు పని హక్కులను కల్పించిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జి బిల్లు 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందన్నారు.
దేశంలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం ఐక్య పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారన్నారు.
నాటి రైతుల స్ఫూర్తితో కూలీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని హక్కులను రక్షించుకొవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 33 కోట్ల కూలీల హక్కులను కాల రాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కూలీలు ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత మధుసూదన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్, డి బిఎఫ్ మండల అధ్యక్షులు బ్యాగరీ చంద్రం, ఉపాధి హామీ కూలీలు మహిళలు పాల్గొన్నారు.
