Oats or Muesli: Which Is Better for Weight Loss
మ్యూస్లీ, ఓట్స్లలో ఏది మంచిది?
మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్, మిల్లెట్స్, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి.
మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్, మిల్లెట్స్, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. వీటిల్లో కొన్నిసార్లు తీయటి రుచి కోసం చక్కెర, బెల్లం, తేనె లాంటివి కూడా చేర్చుతారు. వీటివల్ల మ్యూస్లీలో అధిక క్యాలరీలు, అధిక పిండి పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ. ఓట్స్ విషయానికొస్తే, ఎటువంటి అదనపు పదార్థాలను చేర్చరు. కాబట్టి సాదా ఓట్స్ను నీటిలో లేదా పాలలో ఉడికించి తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీలు అదే పరిమాణంలో ఉండే తీయటి మ్యూస్లీ కంటే తక్కువ ఉంటాయి.
