ప్రజాసమస్యలకు ప్రాధాన్యం ఎక్కడ? చౌకబారు వార్తలతో విశ్వసనీయత కోల్పోతున్న మీడియా

`అత్యుత్సాహ ప్రదర్శన అనర్థాలకు చేటు

`సెలబ్రిటీల జీవితం వారి సొంతం. మీడియాకెందుకు?

`కళాకారులలోని కళను గౌరవించే స్థాయికి ఎదగాలి

`నిష్పక్షపాత వైఖరే విశ్వసనీయతకు గీటురాయి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇటీవలి కాలంలో పరిశీలిస్తే తెలుగు మీడియాకు వార్తలేవీ లేనట్టు కేవలం ఎవరో ఒక సెలబ్రిటీ లేదా మరే ఇతర వివాదాస్పద అంశాలను మరీ మరీ లాగా పీకి రీడర్స్‌ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. సెన్సేషన్‌, టీఆర్‌పీ రేటింగ్స్‌ అనేవి అరిగిపోయిన రికార్డులై పోయాయి. ఇటువంటి చౌకబారు వార్తల వల్ల జర్నలిజం విశ్వసనీయతను కోల్పోక తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలకుఏం అవసరమో అదే వార్తలుగా ప్రచురితమయ్యేవి. కానీ నేడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానివైపు జర్నలిజం మరలడంతో పాటు నెలకొన్న విపరీతమైన పోటీ క్రమంగా విలువల హన నానికి దారితీస్తోంది. వార్తలు, విశ్లేషణల నుంచి వార్తా కథనాలు అక్కడినుంచి మార్కెట్‌ ఓరియంటెడ్‌ న్యూస్‌ స్థాయికి జర్నలిజంలో చోటుచేసుకున్న మార్పులు ఇప్పుడు కొన్ని విపరీత పోకడలకు దారితీస్తున్నాయి. విషాదం, హాస్యం, ప్రకృతి విపత్తు, ప్రమాదాలు, రాజకీయాలు వంటి అంశాలపై న్యూస్‌ ఛానల్స్‌లో ప్రసారమయ్యే వార్తల్లో కొన్ని సందర్భాల్లో యాంకర్ల హావభావాలు, భాషో చ్ఛారణ వార్తకు అనుగుణంగా లేకపోవడం కూడా వీక్షకులకు వార్తలపట్ల ఆసక్తి తగ్గిపోవడానికి కారణమవుతోంది. అంతేకాదు ప్రతి అంశంలో ‘అతి’ సెన్సేషన్‌కు ప్రాధాన్యమివ్వడం కూడా జర్నలిజం ప్రజల్లో తన విశ్వసనీయతను కోల్పోతున్నది.
ప్రపంచ వ్యాప్తంగా వార్తలపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుండం పబ్లిషర్స్‌కు ఒక పెను సవాలుగా నిలిచిందని రాయటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్ట్‌`2023 వెల్లడిరచింది. పైన పేర్కొన్న కారణాలే వీక్షకులు, చదువరుల సంఖ్య తగ్గడానికి కారణమని చెప్పక తప్పదు. విచిత్రమేమంటే కొన్ని రకాల వార్తలు తమ మూడ్‌ను చెడగొట్టడమే కాకుండా, విపరీతమైన ఉద్వేగానికి లోను చేచేస్తున్నాయని 32% మంది చెప్పినట్లు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. నిజంగా కొన్ని వార్తలు అసంబద్ధంగా చూడాల్సినంత అవసరం లేనివిగా కూడా వీక్షకులు పరిగణిస్తున్నారు. అంతేకాదు వార్తల్లో విశ్వసనీయతపై సానుకూలత వ్యక్తం చేసిన వారు కేవలం 40% మంది మాత్రమే. వీరి సంఖ్య కూడా ఏటా తగ్గిపోతుండటానికి మీడియా స్వయంకృతాపరాథమే కారణం. ఇక మనదేశం విషయానికి వస్తే 2022లో వార్తలపై విశ్వసనీయత వ్యక్తం చేసివారు 41% వుంటే, 2023లో 3% తగ్గి 38%కు చేరింది. ఇన్ని జరిగినా మనదేశంలో దూరదర్శన్‌, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ది హిందూ, ది ఎకనామిక్‌ టైమ్స్‌ వంటి పత్రికలు తమ విశ్వసనీయతను నిలుపుకుంటూ రావడం విశేషం. వీటిపై వీక్షకులు, చదువరుల్లో విశ్వసనీయత 60%కు పైగానే వుంటోంది. ఇక స్థానిక భాషా పత్రికల్లో దైనిక్‌ భాస్కర్‌ విశ్వసనీయత విషయంలో తొలి పది స్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. సోషల్‌ మీడియా వేదికల విషయానికి వస్తే యూట్యూబ్‌ (56%), వాట్సాప్‌ (47%), ఫేస్‌బుక్‌ (39%)లు ప్రాచుర్యం విష యంలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ట్విట్లర్‌ 20% స్కోర్‌ చేసింది.
2022 నుంచి మనదేశంలో మొత్తంమీద వార్తలను షేర్‌ చేసుకోవడమనేది క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆన్‌లైన్‌ వార్తలు చూసేవారి సంఖ్య కూడా 2022తో పోలిస్తే 2023లో 12% తగ్గింది. అంటే 2022లో ఇది 84% వుండగా 2023నాటికి 72%కు పడిపోయింది. అదేవిధంటా టెలివిజన్‌ ఛానల్స్‌ పరిస్థితికూడా ఆశాజనకంగా లేదు. 2022లో 59% పర్సంటేజ్‌ పాయింట్స్‌ (పి.పి.) వుండగా 2023లో ఇది 49%కు పడిపోయింది. ఇక ప్రింట్‌ మీడియా విషయానికి వస్తే 2022లో 49% పీపీ నమోదు కాగా 2023 నాటికి 40%కు పడిపోయింది. విచిత్రమేమంటే చాలామంది వీక్షకులు ఆన్‌లైన్‌ డిబేట్‌లను ఇష్టపడటంలేదు. ఇవి విష ప్రచారానికే దోహదం చే స్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. 28% మంది ఈ ఆన్‌లైన్‌ చర్చల్లో నెగెటివిటీ అధికంగా వుంటోందని దాన్ని బాగా తగ్గించాలని కోరగా మరో 33% మంది ఈ చర్చలు విషపూరిత అంశాలను బాగా తగ్గించాలని అభిప్రాయపడ్డారు. ఇక మొత్తం మార్కెట్ల విషయానికి వస్తే తాము పూర్తిగా మీడియానుంచి విమర్శలను ఎదుర్కొంటున్నామని చెప్పేవారు మనదేశంలో 62% మంది వున్నారు. ఈ పరిశోధనలో తేలిన మరో ముఖ్య విషయమేంటంటే మీడియాలో విమర్శలు శృతిమించుతున్న కొద్దీ అవి ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతున్నాయి. అంతేకాదు అనవసర విషయాలు అంటే, ఎవరో ఒకరిద్దరు వ్యక్తుల విషయాలపై దృష్టిని ప్రధానంగా కేంద్రీకరించడం కూడా ప్రజల్లో మీడియా పట్ల విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.
మోహన్‌బాబు కుటుంబ సమస్యలు, ఇటీవల అల్లు అర్జున్‌ జైలుకు వెళ్లడం వంటి సంఘటనలకుమీడియా విపరీత ప్రచారం ఇచ్చింది. మోహన్‌ బాబుది ఆయన కుటుంబ సమస్య. ఇక అల్లు అర్జున్‌ విషయానికి వస్తే ఆయన ఒక థియేటర్‌కు వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందడం, పిల్లవాడు కోమాలోకి వెళ్లడం జరిగింది. దురదృష్టవశాత్తు మీడియా ఎంతసే పూ అల్లు అర్జున్‌పై దృష్టి పెట్టింది తప్ప బాధిత కుటుంబం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇందుకు ఎవరు బాధ్యులు ఎవరు కాదన్నది కోర్టు తేలుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన విషయం చాలా ముఖ్యం. దీన్ని మీడియా పెద్దగా ఫోకస్‌ చేయలేదు. ‘అక్కడ చని పో యింది మహిళ. మరో పిల్లవాడు కోమాలో వున్నాడు. ఈ సంఘటనను పట్టించుకోకుండా ప్రభుత్వం వుండలేదు. తప్పుచేసిన వారికి శిక్షతప్పదు’ అని అన్న ఆయన వ్యాఖ్యలు చాలా ము ఖ్యం. ఆయన ఇక్కడ బాధ్యతాయుతంగా స్పష్టంగా వ్యవహరించారు. మరి మీడియా ఏం చేసింది? బాధితులను వదిలేసి అల్లు అర్జున్‌ వెంటపడిరది. ఇది ఆయనకూ ఇబ్బందికరమే. ఇక్కడ మీడియా విపతీర ప్రచారం వల్ల ఆయన ఇబ్బంది పడితే, అసలు పట్టించుకోని బాధిత మహిళ కు టుంబం మరోవిధంగా బాధపడిరది. ఆ కుటుంబం కూడా అనవసర వత్తిళ్లకు గురయ్యే అవకా శం వుంటుంది. అటువంటి పరిస్థితి మీడియా సృష్టించకూడదు. అల్లు అర్జున్‌ వెంటపడటం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం? లేదా మోహన్‌బాబు కుటుంబం విషయంలో అత్యుత్సాహం ప్రద ర్శించడం వల్ల ఎవరికి లాభం? అనవసరంగా అయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టే అయింది కదా! పట్టించుకోకపోతే వారి కుటుంబ సమస్య మరోవిధంగా పరిష్కారమయ్యేదేమో? రెచ్చగొట్టే రాతలు రాసినందువల్ల ఇప్పుడు కేసు పోలీసుల దాకా వెళ్లింది. ఇందులో ఎవరు ఎమేర పావు కున్నారంటే, సున్నా అనే చెప్పాలి!
ఒక సినిమా లేదా వ్యాపారం విషయంలో మీడియా కచ్చితంగా వ్యవహరించాలి. వ్యాపారి తన వ్యాపార లాభం చూసుకుంటాడు. ఒక సినిమా తీసేది ప్రజా ప్రయోజనం కోసం కాదు. వ్యాపారలాభం కోసం! అందుకోసం వారు అనురించే మార్గాలు వారికుంటాయి! దానివల్ల ప్రజలకు ఒరి గేదేమీ వుండదు. అనవసర అతి ప్రచారాలు కల్పించి సినిమావారిని గొప్పగా చూపించడం వల్ల ఒరిగేదేమీ వుండదు. నటులను కళాకారులుగా గౌరవించే స్థాయికి మీడియా ఎదగాలి తప్ప, అనవసరంగా అతిచేస్తూ జర్నలిజం విలువలను నాశనం చేయకూడదు. సినిమా యాక్టర్లు, ఇతర త్రా సెలబ్రిటీల విషయంలో మీడియా నిగ్రహం పాటించాలి. వాళ్లేమీ దేవుళ్లు కాదు. సాధారణ మనుషులు, ఒక జర్నలిస్టు తన వృత్తిలో ఉన్నవిధంగానే వారూ కళాకారులుగా తమ వృత్తిలో కొనసాగుతున్నారంతే! ఇటువంటి పనులవల్ల టీఆర్‌పీ రేటింగ్‌లు పెరగవు కానీ అథ్ణపాతాళంలోకి వెళతాయి. దాంతోపాటు మీడియా తన విలువను తానే పోగొట్టుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!