అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయిన హిందువులు
మైనారిటీలకు రక్షణగా వుంటానన్న మమతా బెనర్జీ
అధికారం తప్ప బాధితుల గోడుపట్టని ప్రభుత్వం
హింసకు కారణమైనవారికి అండగా వుండటం ఎంతవరకు న్యాయం?
కేంద్ర బలగాలు వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు
బెంగాల్‌లో సమన్యాయం ఎక్కడ? కేవలం మైనారిటీ న్యాయం తప్ప!!
డెస్క్,నేటిధాత్రి:
హింసాత్మక రాజకీయాలకు, అరాచకానికి మారుపేరుగా పశ్చిమబెంగాల్ తయారైంది. వక్ఫ్‌బిల్లును పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఏప్రిల్ 8నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ముర్షిరాబాద్ జిల్లాలో ముస్లిం మెజారిటీలుగా వున్న షం షేర్‌గంజ్, సుతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. వాహనాలు, దుకాణాలు, ఇళ్లను యదేచ్ఛగా తగులబెట్టారు. రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. హిందువుల ఇళ్లపై యదేచ్ఛగా దాడులు జరగడంతో సుమారు 300 కుటుంబాలు పొరుగునే వున్న మాల్డా ప్రాంతానికి పారిపోయాయి. వీరంతా బైష్ణవ్‌నగర్‌లోని పర్లాల్‌పూర్ హైస్కూల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ధూలియాన్ ప్రాంతానికి చెందిన చాలామంది భాగీరథి నదిలో పడవల ద్వారా బైష్ణవ్‌నగర్‌కుపారిపోయారు. అల్లరిమూకలు తాగునీటి ట్యాంకుల్లో విషం కలపడమే కాకుండా, పురుషులను చితకబాది, మహిళలను వేధింపులకు గురిచేయడమే కాదు తక్షణమే ఈ ప్రాంతం నుంచి వెళ్లి పోవాలని డిమాండ్ చేయడంతో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోవాల్సి వచ్చిందని ధూలియాన్ ప్రాంత వాసులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరికొందరు పక్క రాష్ట్రమైన రaార్ఖండ్‌కు పారిపోయారు. షంషేర్‌గంజ్‌లో ఒక కుటుంబానికి చెందిన హరగోవింద్ దాస్ అనే 72ఏళ్ల వృద్ధుడు, ఆయన కుమారుడు చరణ్‌దాస్ (40)లను బయటకు ఈడ్చుకువచ్చి హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. వీరి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ దారుణంపై పోలీసులు ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడంగమనార్హం. అల్లర్లకు పాల్పడుతున్న మూకలపై పోలీసులు కాల్పులు జరిపిన ప్పుడు ఇజాజ్ అహ్మద్ (25) అనే యువకుడు గాయపడ్డట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) జావెత్ షమీమ్ తెలిపారు. ఇతడిని ఆసుపత్రి లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్‌బిల్లుపై రాష్ట్రపతి ఏప్రిల్ 5న సంతకం చేసిన తర్వాత, నాలుగు రోజులకు అంటే 8వ తేదీన ముర్షిరాబాద్‌లో అల్లర్లు జరిగినా పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు. తర్వాత ఏప్రిల్ 11న ఒక ప్రదర్శన సందర్భంగా అల్లర్లు ప్రారంభమై విధ్వంసకాండ చెలరేగింది. హిందువుల ఆస్తులు యదేచ్ఛగా లూటీలు చేయడమే కాకుండా వారి దుకాణాలను, వాహనాలను అల్లరిమూకలు తగులబెట్టాయి. గత శనివారం కలకత్తా హైకోర్టు కేంద్రబలగాలనురంగంలోకి దించాలని ఆదేశించడంతో, వాటి ప్రవేశం తర్వాత అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ విధ్వంసకాండ నేపథ్యంలో కోల్‌కతాలో బీజేపీ నేతృత్వంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. మమతా బెనర్జీ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హిందువులపై దాడులు, వారి ఆస్తుల లూటీలు జరిగాయని ఈ విధ్వంసకాండపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుసుకాంత ముజందార్ డిమాండ్ చేశారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ‘‘బంగ్లాదేశ్ నుంచి అల్లరి మూకలను కావాలనే ఇక్కడికి రప్పించి బీజేపీ ఈ విధ్వంసరచన చేసిందని, ఈ అల్లరి మూకలు తిరిగి బంగ్లాదేశ్‌కు పారిపోయాయంటూ’’ ఆరోపించింది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైంది కాకుండా, ఈవిధంగా ఆరోపించడం తృణమూల్ కాంగ్రెస్‌కే చెల్లింది. ఇదిలావుండగా పరూలియా బీజేపీ ఎం.పి. జ్యోతిర్మయి సింగ్ మహతో కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఇందులో ఆమె పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని అమల్లోకి తేవాలని కోరారు. సీనియర్ బీజేపీ నేత సుబేందు అధికారి మాట్లాడుతూ తృణ మూల్ కాంగ్రెస్ పాలనలో రాడికల్ మూకలు రెచ్చిపోతున్నాయని, ముర్షిరాబాద్ జిల్లా ఇప్పుడు వీరి హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు హిందువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లాలో ప్రాణా లు అరచేత పట్టుకొని పారిపోతున్న ప్రజల ఫోటోలను ఆయన ప్రదర్శించారు. అయితే బీజేపీ చూపిస్తున్నవన్నీ ఫేక్ ఫోటోలంటూ తృణమూల్ రాజ్యసభ ఎం.పి. సాగర్ ఘోష్ ఆరోపించారు.
అరాచకానికి కూడా ఒక హద్దుంటుంది. మమతా బెనర్జీ పాలనలో ఆ హద్దులు కూడా చెరిపేసినట్టు వర్తమాన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత నాలుగు రోజులకు అల్లర్లు చెలరేగాయంటే దీని అర్థం ఏమిటి? ఇప్పటికే సర్వభ్రష్ఠ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన మమతాబెనర్జీ ఇంకా తన పదవీకాంక్షకోసం మరెంతమంది హిందువుల ఉసుర్లు తీసుకుంటారనేది ప్రశ్న. హింసకు పాల్పడిన మూకలను అదుపులోకి తీసుకురాక పోగా, వక్ఫ్‌బిల్లును రాష్ట్రంలో అమలు చేయనని, మైనారిటీలకు రక్షణగా వుంటానని ప్రకటించా రంటే మమతా బెనర్జీని ఏమనుకోవాలి? ఒకపక్క వందలాది హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతపట్టుకొని స్వస్థలాలను వదిలేసి పారిపోతే, బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ఏకంగా అల్లర్లకు కారకులైనవారికి అండగా నిలవడమేంటి? రాజకీయంగా అభిప్రాయ భేదాలుం టే రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప, హిందువులు బలిపశువులవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ వైఖరి ఖండనార్హం. కేంద్ర బలగాలు వస్తే తప్ప అల్లర్లు సర్దుమణగలేదంటే, అల్లరి మూకలకు ప్రభుత్వం అండగా వున్నట్టేగా అర్థం? ఓట్లకోసం, అధికారం కోసం అమాయక హిందువులను బలి తీసుకోవడమేంటి? ఇంత జరిగినా బాధితులకు అండగా వుంటామన్న ఒక్క ప్రకటన కూడా మమతా బెనర్జీ నోటివెంట రాకపోవడం ఎంత విచిత్రం? పశ్చిమ బెంగాల్‌లో అసలు ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నది? ఇటీవల యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘వందమంది ముస్లింల మధ్య 50మంది హిందువులు బతకగలరా?’’ అని ప్రశ్నించారు. కుహనా సెక్యులర్ వాదులు దీనిపై నానా రాద్ధాంతం చేశారు. మరిప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నదేంటి? దీనిపై ఒక్కరూ నోరు మెదపరు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఎందుకంటే బాధితులు హిందువులు కదా! అదే ఏ ఒక్క ముస్లిం బాధపడి నా ప్రపంచమంతా కొట్టుకుపోయినంత రాద్ధాంతం చేస్తారు! అందరూ మనుషులే! అందరి ప్రా ణాలు సమానమే. దేశంలో ఎక్కడాలేని గొడవలు కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే…అది కూడా బంగ్లాదేశ్ సరిహద్దులో వున్న ముర్షిరాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వ్యవసాయ బిల్లుల విషయంలో కేవలం పంజాబ్, హర్యానాలకు చెందిన ‘రైతులమని చెప్పుకుంటున్నవారు’ ఆందోళనకు దిగారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా వీటిపై గొడవ జరగలేదు. ఎందుకంటే రైతులకు ఈ చట్టాలవల్ల కలిగే ప్రయోజనం తెలుసు. కానీ పంజాబ్, హర్యానాల్లోని దళారీలు ఇంతటి అల్లర్లకు బాధ్యులు. చివరకు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంది. కానీ నష్టపోయింది రైతులు, ప్రయోజనం పొందింది దళారీలు. ఇప్పుడు పశ్చి మ బెంగాల్‌లో అల్లర్లు, విధ్వంసకాండకు పాల్పడినవారికి పూర్తి రక్షణ, బుజ్జగింపులు కాగా హిందువులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు! ఈ ప్రాంతాల్లో స్వస్థలాల్లోనే హిందువులు బతకలేని పరిస్థితినెలకొంటే, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?
తృణమూల్ కాంగ్రెస్‌లో ఇటీవల బయల్పడిన విభేదాల నేపథ్యంలో, పార్టీపై మమతా బెనర్జీ క్ర మంగా పట్టు కోల్పోతున్నారన్న అనుమానాలు పొడచూపాయి. బీజేపీ క్రమంగా బలపడుతూ, తృణమూల్‌పై ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తున్న తరుణంలో, ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అ లర్లను సృష్టించారా? అన్నది తేలాలి. మెజారిటీ ప్రజల మనోవేదన, ఆక్రందనల నేపథ్యంలో వ చ్చే అధికారం ఆనందాన్నిస్తుందా? ప్రస్తుతం బెంగాల్ వాతావరణం చూస్తుంటే, ఒకప్పుడు కశ్మీర్ లో హిందువులు అనుభవించిన దుర్భర పరిస్థితులు గుర్తొస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు పరాకాష్టకు చేరి, దాల్చిన వికృతరూపానికి బెంగాల్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.