కష్టం మా వంతు…పదవులు మీ వంతు!
`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు
`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు
`జెండాలు మోసేది కార్యకర్తలు
`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు
`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు
`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు
`పార్టీలు మారిన వారికి పదవులు
`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు
`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు
`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి
`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి
`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే
`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే.కష్టం మా వంతు…పదవులు మీ వంతు!
`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు
`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు
`జెండాలు మోసేది కార్యకర్తలు
`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు
`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు
`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు
`పార్టీలు మారిన వారికి పదవులు
`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు
`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు
`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి
`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి
`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే
`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే
హైదరాబాద్,నేటిధాత్రి:
రాను రాను రాజకీయాలంటే యువతలో నిరాసక్తత ఎదురౌతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం లేదు. రాజకీయాలపై అందిరకీ ఆసక్తి వుండదు. ఒక ఊరులో వెయ్యి మంది వుంటే రాజకీయాలు చేసే వారు పట్టుమని పది మంది కూడా వుండరు. కాని రాజకీయ పార్టీల అభిమానులు చాలామంది వుంటారు. గతంలో రాజకీయాలంటే ఒక యజ్ఞంగా వుండేది. రాజకీయాలు చేస్తే పదవులు వస్తాయన్న ఆశ వుండేది. కాని ఇప్పటి రోజుల్లో పదవులు ఎవరికి వస్తాయో? ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో? ఎవరికి రావాల్సిన పదవులు ఎవరు పొందుతారో? ఎందుకు పొందుతారో? ఎలా పొందుతున్నారో కూడా తెలియనంత సీక్రెట్‌గా పదువులు పొందుతున్నవారున్నారు. దాంతో జెండా మోసిన కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంటోంది . రాజకీయాలంటేనే నిరాసక్తత ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా అదికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ద పదవులు పూర్తిగా భర్తీ చేయక వాటిని చూపించి, ఐదేళ్లు నాయకులను రాజకీయ పార్టీలు వంచిస్తున్నాయి. ఆ పదవి నీకే నీకే అంటూ పుణ్యకాలం పూర్తి చేస్తున్నాయి. ప్రశ్నిస్తే వచ్చేది మన ప్రభుత్వమే అప్పడు మొదటి విడతలో పదవి నీకే అంటారు. ఇలా ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్ధాలుగా సాగుతూనే వుంది. కాకపోతే ఇప్పుడు మరో రాజకీయం సాగుతోంది. గతంలో పార్టీ మారే నాయకులు పెద్దగా వుండేవారు కాదు. సిద్దాంతాలు వదలి, మరో పార్టీలో చేరేవారు తక్కువగా వుండేవారు. పదవులు రాకపోయినా సరే, అదే పార్టీలో వుంటూ వచ్చేవారు. కాని ఇప్పుడు నాయకులు, కార్యకర్తల పరిస్ధితి మారిపోయింది. ఎవరు ప్రాదాన్యతనిస్తే వారి పార్టీలోకి వెళ్తున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. మళ్లీ అధికారం మారగానే మళ్లీ నిస్సిగ్గుగా సొంత గూటికి అని చెప్పి చేరిపోతున్నారు. మళ్లీ పదవులు పొందుతున్నారు. ఇలా ఏ ఎండకాగొడుడు పట్టే నాయకులు అంతో ఇ ంతో బాగుపడుతున్నారు. పదవులు పొందుతున్నారు. నాయకులుగా వెలుగుతున్నారు. అంతే కాని ఆది నుంచి జెండా మోసిన కార్యకర్త అడుగడుగునా మోసపోతున్నాడు. రాజకీయాల్లో ఆగమౌతున్నాడు. జీవితం నాశనం చేసుకుంటున్నాడు. బైట గొప్పలు చెప్పుకోవడానికి అలవాటు పడి రాజకీయాలు వదులుకోలేకపోతున్నారు. అప్పులు చేసి నాయకుడుగా చెలామణి కావడం మానుకోవడంలేకుండా వున్నారు. నిత్యం తెల్లబట్టలేసుకోవాలి. ఉదయమే రాచ కార్యం వెలగబెట్టినట్లు ఇంట్లోనుంచి వెల్లాలి. అ ంతే ఇంట్లో వున్న వాళ్లు తింటున్నారా? తినడం లేదా? తన కోసం ఎదురుచూస్తున్నారా? లేదా? అన్న ఆలోచన వుండదు. రాత్రి దాకా నాయకులకు భజన చేసుకుంటూ వుండి రాత్రికి ఇంటికి చేరుకోవడం, మళ్లీ తెల్లారిందంటే వెళ్లిపోవడం ఇ ంతకన్నా కార్యకర్తలు చేసేదేమీ లేకుండాపోయింది. పదవులు పొంది నాలుగు రూపాయలు సంపాదిం చుకున్నది లేదు. గతంలో గ్రామ స్దాయి నుంచి, మండల,జిల్లా స్దాయి వరకు నాయకులకు ఏవో పనులు వుండేది. అభివృద్ది పేరిట విడుదలయ్యే నిధులతో చిన్నా చితకపనులు చేసేవారు. కాని ఇప్పుడు ఆపని కూడా లేదు. ఆదాయం రూపాయి రాదు. అయినా పార్టీ జెండా మోస్తూనే వుంటున్నారు. గతంలో లేని, ఇప్పుడు కొత్తగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పోలీసులు కేసులు అదనం. ఇప్పటి రాజకీయాల్లో ఇది ఒక నూతన పోకడ. రాజకీయపార్టీల కార్యకర్త ఎప్పుడు కేసులు ఎదుర్కొంటాడో తెలియదు. అదికార పార్టీపై ఏం మాట్లాడినాసరే కేసులు ఎ దుర్కొవాల్సిందే. ఏం మాట్లాకుండా వున్నా, మాట్లాడిన నాయకుడి పక్కన వున్నా చాలు కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన కాస్తో, కూస్తో బలమైన నాయకుడైతే చాలు. కేసులు వి పరీతం. అది గ్రామ నాయకుడైనా సరే, మండల స్దాయి నాయకుడైనా సరే ఎప్పుడూ ఏదో ఒక కేసు ఎదుర్కొవాల్సిందే. ఇక జిల్లాలకు,మండలాలకు మంత్రులు పర్యటనలకు వస్తే చాలు ప్రత్యర్ది పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేయాల్సిందే. బైండోవర్లు చేసి రోజుల తరబడి స్టేషన్‌లో వుంచాల్సిందే. మంత్రుల పర్యటనలు పూర్తయిన తర్వాత గాని వదిలే అవకాశం లేకుండాపోయింది. ఇన్ని నిర్భందాల మద్య రాజకీయం చేసినా, కేసులు ఎదుర్కొన్నా, పోలీసు దెబ్బలు తిన్నా, కేసులకు ఎన్ని డబ్బులు ఖర్చైనా, పార్టీ అదికారంలోకి వచ్చాక పదవి వస్తుందా? రాదా? అన్నది మళ్లీ నాయకుల చేతుల్లోవుండదు. నాకే పదవి అని చెప్పుకునే పరిస్దితి నాయకులు వుండదు. పైగా నాకు పదవి ఎందుకు ఇవ్వవని నిలదీసే హక్కు కూడా వుండదు. ఒక వేళ సంబంధిత ఎమ్మెల్యేనో, మంత్రినో గట్టిగా నిలదీస్తే అదికార పార్టీలో వున్నా సరే కేసులు ఎదుర్కొవాల్సిందే. లేకుంటే అంతకు ముందుకన్నా ఎక్కువ నిర్భందం చూడాల్సిందే.ఎందుకంటే అదికార పార్టీలో వున్నప్పుడు పదవులు అడుక్కొవాలి. ఇచ్చేదా ఎదురుచూడాలి. రాకుంటే ప్రశ్నించకూడదు. ఒకవేళ నమ్మకంలేకపోతే పార్టీ మారిపోవచ్చు. ఓ స్ధాయిన నాయకులకు తప్ప, ద్వితీయ శ్రేణి నాయకులకు తప్పని తిప్పలివి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, కేంద్రంలోనూ ఇదే పరిస్దితి వుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కాలమౌతోంది. కాని ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగడం లేదు. ఆ పదవులేమీ ఐదేళ్లు వుండవు. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే ఏడాదిన్న కాలం పూర్తయిపోయింది. వాటికి ఎవరినో ఒకరిని భర్తీ చేస్తే, మరో ఆరు నెలల్లో కొత్త వాళ్లకు అవకాశమిస్తే చాల మంది నాయకులను సంతృప్తిపర్చినట్లు వుండేది. కాని ఇప్పటికే మొదటి దఫా పదవులు అందలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి పదవులు కూడా ఇంకా పావు వంతు కూడా భర్తీ కాలేదు. ఇంకా స్ధానిక సంస్ధల ఎన్నికలు రావాల్సి వుంది. వాటి కోసం కూడా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇలా గతంలో కూడా రాజకీయ పార్టీలు చేశాయి. కొన్నిసార్లు ఎన్నికలకు ఓ ఏడెనమిది నెలల ముందు పదువులు ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. పార్టీ మళ్లీ అదికారంలోకి వస్తేనే ఆ పదవి వుంటుంది. లేకుంటే పోతుంది. ఇలా కూడా నాయకులను పార్టీలు మోసం చేస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇదే చేసింది. ఇచ్చిన నాయకులకే మళ్లీ మళ్లీ పదవులు పంచింది. పదేళ్లలలో కూడా పదవులు అందని వారు ఎంతో మంది వున్నారు. పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో పాలు పంచుకొని, పోరాటం చేసి, ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించుకుంటూ ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు బిఆర్‌ఎస్‌లో కొన్ని వేల మంది వున్నారు. బిఆర్‌ఎస్ పదేళ్లపాటు అదికారంలో వున్నా, పదవులు రాకుండా పోయిన వారు కొన్ని వేల మంది వున్నారు. తెలంగాణ తెర్లు కావొద్దన్న ముచ్చట చెప్పి, ఇతర పార్టీలనుంచి వచ్చిన, తెచ్చుకున్న నాయకులకు ప్రాధాన్యతలనిస్తూ, అసలు ఉద్యమకారులను పక్కన పెట్టి పదవులు పంచిన సందర్భం వుంది. ఇప్పుడు ఏపిలో కూడా అదే పరిస్ధితి మళ్లీ కనిపిస్తోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా పూర్తి స్ధాయిలో పదవులు పంచిన సందర్భం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా జరుగుతుందన్న నమ్మకం నాయకుల్లో లేకుండాపోతోంది. గత ప్రభుత్వ హాయాంలో నిర్భంధాలను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కొని, పోలీసుల చేతిలో కౌకు దెబ్బలు తిని, ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు కొన్ని వేలమంది వున్నారు. వాళ్లలో చాలా మందికి పదవులు అందడం లేన్న విమర్శలున్నాయి. కూటమిగా జట్టు కట్టి ఎలాంటి పోరాటాలు చేయని జనసేనకు పదవులు పోతుంటే తెలుగు తమ్ముళ్లు నోరు మూసుకొని వుండాల్సి వస్తుంది. తమకు రావాల్సిన పదవులు జనసేన నాయకులు ఇస్తుంటే వారికి జేజేలు కొట్టాల్సి వస్తుంది. ఏ పార్టీలో వున్న కార్యకర్తలకైనా ఇలాంటి పరిస్ధితులు రావొద్దు. ఇక జనసేనలో మరో విచిత్రం వుంది. పదవులు కోసం ఆశించి ఎవరూ రావొద్దంటూ జనసేనాని చెప్పడం విడ్డూరం. జనసేన కోసం తమ జీవితాలను త్యాగంచేయాలి కాని, పదవులు ఆశించకూడదని అనడం వల్ల ఆ పార్టీ నాయకుడి ఆలోచన ఏమిటో ఇప్పటికే జనసైనికులకు అర్ధమౌతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, పదవులు ఎవరు పంచుకుంటున్నారో చూస్తూనే వున్నారు. ఇలా కార్యకర్తల జీవితాల్లో విషాలు నింపుతున్నారు. అందుకే కార్యకర్తలో నిస్తేజం ఆవహించుకుంటోంది. పదవుల పంపకాల కాడ మీరు..జెండాలు మోసే కాడ మేమా? అని ప్రశ్నిస్తున్నారు.