
Jaya Theater Road
ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు
పరకాల నేటిధాత్రి
అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే పట్టణంలోని జయ థియేటర్ రోడ్డు పరిస్థితి వాహనదారుల,షాపు నిర్వాహకుల తీరు మారడం లేదు,వాహనదారులు షాపుల ముందు మోటారు సైకిల్లను ఇస్టమచ్చినట్టుగా ఇస్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు,ఇష్టానుసార పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాద చారులకు,వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.రాజధాని టీ ప్యాలెస్ దగ్గరనుండి మొదలుకొని జయ థియేటర్ వరకు అసలు షాపులకు ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవని,పరిమితిని దాటి రోడ్లమీదనే తమకు నచ్చినట్టుగా,వాహనాలను నిలిపి వస్తువులను పెట్టి వ్యాపారాలను కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.సివిల్ ఆసుపత్రి వెళ్లే ప్రధాన దారి ఇదే అవ్వడం అత్యవసర నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే తరుణంలో అంబులెన్సులకు కూడా దారి లేకుండా పోయిన పరిస్థితులెన్నో ఉన్నాయని ఈ విషయంలో స్థానిక అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వ్యాపారస్థులకు,వాహనదారులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.