
"Villagers Suffer as Roads Turn into Potholes"
పల్లె రోడ్డుకు మోక్షం ఎప్పుడో!
అద్వాన్నదారి,, ఎన్నాళ్ళు అవస్థలు
నేరేడుపల్లి గ్రామంలో రోడ్డు పరిస్థితి..
యేండ్ల తరబడి రోడ్డు మార్గం లేని వాడ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో మీసాల ఆయిలయ్య ఇంటి దగ్గర నుండి హనుమాన్ టెంపుల్ వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా తయారయ్యింది.
పల్లె ప్రజలు నిత్యం తమ అవసరాలకు మండల కేంద్రానికి రాకపోకలు సాగించే గ్రామీణ రోడ్లు పూర్తిగా ధ్వంసం గుంతల మయంగా మారడం వారికి ఇబ్బందులు తప్పడం లేదు ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే మట్టిరోడ్డే దిక్కు! అది కూడా గుంతల మయంగా మారడంతో నడక నరకయాతంగా మారుతుంది ప్రతిరోజు పాఠశాల, కళాశా లకు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనులకు నిమిత్తం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తు లు పలుమార్లు బీటీ రోడ్డు వెయ్యాలని గత ఎమ్మెల్యేతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలి తంలేకపోయింది . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి అధికారులు నాయకులు రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకులు చొరవ తీసుకుని రోడ్డు మార్గం సుగమం చేయాలని ప్రజలు కోరుతున్నారు.