పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు.

Vice President Bandari Kumar. Vice President Bandari Kumar.

పెద్దవాగు ఆనకట్ట మరమ్మత్తులు ఎప్పుడు

ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద గత రెండు సంవత్సరాలుగా పెద్దవాగు అధిక వర్షపాతంతో ఈ వాగులో అధిక మోతాదులో నీటి ప్రవాహం రావడం వలన ఈ యొక్క బ్రిడ్జి ఆనకట్ట వరద ప్రభావానికి కొట్టుకొని పోయింది అప్పటినుండి ఇక్కడున్న అధికారులు ఈ యొక్క ఆనకట్టకు మరమ్మత్తులు చేయలేదు కనీసం పలు అభివృద్ధి పనుల కోసం మండలంలో ఉన్న 20 గ్రామాలకు ఇదే రోడ్డు నుండి వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఈ సమస్య పట్టలేదా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు చెప్పలేదా మళ్లీ వర్షాకాలం మొదలైంది వాగు అధిక మోతాదులో మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్న 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది ఎందుకనగా ఇప్పటికే రోడ్డు పై నుండి అనకట్ట కిందకు వర్షం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతుంది కావున ఈ రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు గమనించి ఈ ఆనకట్టకు మరమ్మత్తులు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే మరమ్మతు పనులు జరిపించాలని  కోరుకుంటున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!