మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లో శనివారం రోజు జడ్పీఎచ్ ఎస్ కారుకొండ పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయుల పాత్ర నిర్వహించి చాలా ఉత్సాహంగా పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ దశరథ్ మాట్లాడుతూ, విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం చాలా తక్కువ సమయంలో చాలా చక్కగా, క్రమశిక్షణ తో నిర్వహించడం చాలా అద్భుతంగా ఉందని విద్యార్థులను అభినందించారు , భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి, క్రమశిక్షణ తో మెలగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు…అలాగే 10 వ తరగతి విద్యార్థులు 100 శాతం పాస్ ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి గొప్ప పేరు తేవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు…
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గా విద్యార్థి మురళీకృష్ణ , ఆర్ జేడీ గా విద్యార్థిని మేఘన , డి ఈ వో గా సింధు,ఎం ఈ వో గా శివ, ప్రధానోపాధ్యాయులు గా శివశంకర్ స్వయం పరిపాలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.