శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన శ్రీవేద పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలను బోధించారు. దీనివలన విద్యార్థులకు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని వివరించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు విజయ్ అన్నారు. జిల్లా విద్యాధికారిగా ఐలి సాయి అమృత్, మండల విద్యాధికారులుగా కొండ అక్షయ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడుగా చందా హర్షిత్ కుమార్ ,పిఈటిగా కోకిల రిషితేజ్, ఉపాధ్యాయులుగా సిరి చందన, అక్షయ, ఆద్య, త్రినయని, అవంతిక, అయాన్, మేఘన, వర్షిత్ తదితరులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వేద, సల్మా, కీర్తి రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.