నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు…

స్పీక్ ఫర్టిలైజర్స్ రీజనల్ మేనేజర్ సుభాన్

గ్రామీణ ప్రాంతాల్లో స్పీక్ సేవలు మరువలేనివి…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

స్పీక్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం…

మంగపేట నేటిధాత్రి

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని స్పీక్ ఫర్టిలైజర్స్ వరంగల్ రీజనల్ మేనేజర్ షేక్ ముల్ల సుభాన్ అన్నారు మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్పీక్ ఫర్టిలైజర్స్ కంపెనీ సౌజన్యంతో, వికాస్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బాలల దినోత్సవం కార్యక్రమానికి సుభాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు రైతు కుటుంబాల అధిక ఫలసాయానికి తమ స్పీక్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం ఎంతగానో కృషి చేస్తుందన్నారు విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు విద్యతోనే వ్యక్తికి వివేకం వికాసం లభిస్తాయన్నారు తమ స్పీక్ మరియు గ్రీన్ స్టార్ ఫర్టిలైజర్స్ కంపెనీ సంస్థల నుండి రూ డెబ్భై వేల విలువైన స్కూలు బ్యాగులు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ పేద విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ సందర్భంగా ఈరోజు పంపిణీ చేసినట్లు సుబాన్ తెలిపారు ఈ సందర్భంగా జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ మరియు వికాస్ ఫర్టిలైజర్స్ ప్రోప్రైటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ మారుమూల మరియు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో స్పీక్ ఫర్టిలైజర్స్ సేవలు వెలకట్టలేనివని అన్నారు తమ అకినేపళ్లి మల్లారం పాఠశాలల పేద విద్యార్థిని విద్యార్థులకు స్కూలు బ్యాగులు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన స్పీక్ మరియు గ్రీన్ స్టార్ యాజమాన్యానికి సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో స్పిక్ సంస్థ నుండి ఈ ప్రాంత రైతులు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సాంబశివరెడ్డి స్పీక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ శ్రీనివాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పవన్ ఉపాధ్యాయులు విజయ భాస్కర్ శాంతి మేరీ పద్మ జక్క వజ్రం అప్పిన బోయిన సరళ వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు శెట్టిపల్లి తిరుపతిరావు జెడ్డి పూర్ణచందర్ విద్యార్థిని విద్యార్థులు స్థానిక గ్రామస్తులు యూత్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!