విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు, తయారు కావాలంటే గురువు దగ్గర చదువు తీసుకోవాల్సిందే అని అన్నారు.మేము ఒకరోజు ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా ముష్కే గగన్ వాల్మీకి, ఉపాధ్యాయులుగా సురుగుల నవ్య శ్రీ, శనిగరం చరణ్,కట్ల హిమాన్షు రెడ్డి,మామిడాల విశ్వతేజ రెడ్డి,దుబ్బాకుల వశిష్ట భార్గవ,తోకల నవనీత్ రెడ్డి,గోగుల జస్వంత్ రెడ్డి, కందికట్ల హర్షిత్,సోలంకి జస్మిత,గరిడే శ్రీనిత,తాళ్లపల్లి శ్రీనిధి,పూసాల అభిజ్ఞ, తాళ్లపల్లి శరణ్య, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,మేకల సత్యపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్ పాల్గొన్నారు.