
వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో 5 వ వార్డులో ప్రజా సమస్యలు మురికి కాలువల లేకపోవడం సిసి రోడ్లు లేకపోవడం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి వార్డు పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ దారి మళ్ళించారని ఐదో వార్డు ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఐ రమేష్ గంధం నాగరాజ్ బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి రాములు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు వార్డులో 15 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్లాట్లు వేశారని వారి నిర్లక్ష్యం వల్ల డ్రైనేజ్ మురికి నీరు వెళ్లడానికి అవకాశం లేకుండా చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు . అక్కడ ఉన్న నివాస గృహాలకు మురికి కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్షం వస్తే చెరువుల తయారై నీరు గృహాలలోకి వెళ్లే అవకాశం ఉందని క్వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కౌన్సిలర్ కు ప్రస్తుతం కాంగ్రె స్ లో చేరిన కౌన్సిలర్ కు ప్రజా సమస్యలపై విన్నవించామని ఎలాంటి స్పందన లేదని సీసీ రోడ్లు మురికి కాలువలు లేకపోవడం వల్ల పందులు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు దుర్వాసనతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారి పేర్కొన్నారుబ్ ప్రజల సమస్యలు మురికి కాలువలు సిసి రోడ్లు లేకపోవడంతో ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వార్డు పర్యటనకు వస్తే కాంగ్రెస్ నాయకులు దారి మళ్లించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డులో సమస్యలు పరిష్కరించకుంటే వార్డు ప్రజల సహకారంతో అఖిలపక్ష ఐక్యవేదిక ఆందోళన చేస్తుందని వారు హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొన్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తాత్కాలిక కాల్వ లు ఏర్పాటు చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు వర్షం వస్తే వార్డులో నీళ్లు అక్కడ ఉన్న నివాస గ్రహ గృహాలకు వెళ్లినచో మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు