దాదాపు కిలోమీటర్ మేరకు రోడ్డంతా గుంతలమయం
రాత్రి సమయంలో రావాలంటే బయపడుతున్న వాహనదారులు
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ప్రధాన రోడ్డుమార్గం వాహనదారులకు నరకంలా మారింది.మండలకేంద్రనికి కేవలం 5కిలోమీటర్ల సమీపంలో ఉన్న రోడ్డు ఈ పరిస్థితిలో ఉన్నదంటే ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో చూడవచ్చు.గత ప్రభుత్వం ఏర్పాటు అయినా కొత్తలో నూతన రోడ్డును వేయడం జరిగింది.అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న ఇ రోడ్డును నాయకులు అధికారులు ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు.అధికారుల నాయకుల నిర్లక్ష్య వైఖరికి గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు కిలోమీటర్ మేరకు గుంతలమయం
గ్రామ ప్రారంభంనుండి మొదలుకొని గ్రామంలోపలికి వెళ్లే మార్గం దాదాపు కిలోమీటర్ మేరకు రోడ్డు అడుగడుగునా గుంతలుపడి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు గ్రామంలోకి గర్భిణీ స్త్రీలు రావాలంటే రావాలంటే వణికిపోతున్నారు.ఈ రోడ్డును పది సంవత్సరాలు కావస్తున్న కనీసం రోడ్డు మారమ్మత్తులు కూడా జరిపించిన దాఖలాలు లేవు వర్షాకాలం వచ్చిందంటే చాలు అడుగడుగునా ఏర్పడ్డ గుంతలలో నీరు నిల్వవుండి వచ్చిపోయే వాహనదారుల ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని చెప్పవచ్చు కనీసం పట్టింపు లేని ప్రభుత్వలా మీద అధికారుల మీద గ్రామప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయంలో రావాలంటే బయపడుతున్న వాహనదారులు
మల్లక్కపేట గ్రామంనుండి పట్టణానికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళివచ్చే వారు ఈ మార్గం గుండా రావాలంటే బయపడుతున్నారని ఈ రోడ్డు నరకంగా మారిందని చెప్పవచ్చును కొంచెం అజాగ్రత్తగా వచ్చిందంటే వాహనదారులు గాని కొత్త వ్యక్తులు గాని ప్రమాదాల భారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.నూతన ప్రభుత్వంలో అయినా ఈ రోడ్డుకు మోక్షం వస్తుందో లేదో చూడాలని ఎదురుచూస్తున్నారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి రోడ్డు మారమ్మత్తులు జరిపించాలని గ్రామప్రజలు కోరుకుంటున్నారు.